News October 24, 2025

ఈ నెల 29న మెగా జాబ్‌మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పల్నాడు(D) నరసరావుపేటలోని ఈశ్వర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, ఫార్మసీ, డిగ్రీ, ఇంజినీరింగ్, MBBS, PG అర్హతగల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 – 35ఏళ్ల మధ్య ఉండాలి. ఈ జాబ్‌మేళాలో 34 MNC కంపెనీలు పాల్గొంటున్నాయి. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/

News October 24, 2025

గుడిలో ఈ పనులు చేయకూడదు

image

నిజమైన భక్తికి శాంతమే ఆధారం. అందుకే ఓపిక ఉంటేనే గుడికి రావాలి. అశాంతితో ఇతరుల భక్తి భావానికి ఆటంకం కలిగించకూడదు. అలాంటివారు గుడికి రాకపోవడమే ఉత్తమం. ఆలయానికి వచ్చిన భక్తులు చిత్తంతో ఉండాలి. గట్టిగా మాట్లాడకూడదు. ఫోన్ వాడకూడదు. దైవ దర్శన సమయంలో మీ వంతు వచ్చే వరకు ఓర్పుతో, వినయంగా వేచి చూడాలి. తోసుకుంటూ ముందుకెళ్లడం వంటివి మానుకోవాలి. పూర్తి ఏకాగ్రత దైవం పైనే ఉంచాలి. ఇతర ఆలోచనలు మీ మదిన మెదలకూడదు.

News October 24, 2025

BUS ACCIDENT: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

image

కర్నూలు <<18087723>>బస్సు ప్రమాదంలో<<>> ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. నెల్లూరు (D) వింజమూరు (M) గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్(8), కూతురు మన్విత(6) మృతి చెందారు. అటు బస్సు ఢీకొట్టడంతో పల్సర్ బైకుపై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయాడు. అతడు కర్నూలు జిల్లా ప్రజానగర్‌కు చెందిన శంకర్‌గా గుర్తించారు. మొత్తం ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు సమాచారం.

News October 24, 2025

ప్రమాదం జరిగిన బస్సుపై భారీగా జరిమానాలు

image

AP: కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో దగ్ధమైన బస్సుపై చాలా జరిమానాలు ఉన్నాయి. ఇటీవల ఓవర్ స్పీడ్, డేంజర్ స్పీడ్ చలాన్లు నమోదయ్యాయి. మొత్తం రూ.23 వేల వరకు ఫైన్లు ఉన్నాయి. వేమూరి కావేరి సంస్థకు చెందిన బస్సు డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానికి ఈ జరిమానాలే నిదర్శనం. మరోవైపు ఈ బస్సుకు 2024 ఏప్రిల్‌లో ఇన్సూరెన్స్, గత మార్చిలో ఫిట్‌నెస్ వ్యాలిడిటీ ముగియడం గమనార్హం.

News October 24, 2025

బస్సు ప్రమాదం: మీకు హ్యాట్సాఫ్ బ్రదర్, సిస్టర్❤️

image

చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాద దుర్ఘటనలో ఇద్దరు దైవాల్లా ఆదుకున్నారు. ఆ సమయంలో అటుగా ప్రయాణించిన ఓ మహిళ వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రత గుర్తించి అన్ని విభాగాలను వారు అప్రమత్తం చేసేలా ఆ వీడియో హెల్ప్ చేసింది. ఇక ఆ రూట్లో వెళ్లిన ఓ వ్యక్తి కార్లో ఆరుగురు క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ఆస్పత్రిలో డ్రాప్ చేసి వెళ్లిపోయారు. ఆ ఇద్దరితో పాటు ఆపదలో ఆదుకున్న ప్రతి ఒక్కరికీ హ్యాట్సాఫ్❤️❤️

News October 24, 2025

భారత్ బంద్.. యథావిధిగా స్కూళ్లు

image

భారీ వర్షాలకు ఇవాళ ప.గో., ప్రకాశం జిల్లాల్లో, బాపట్ల జిల్లాలోని 5 మండలాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకూ భారీ వర్షాలున్న నేపథ్యంలో తమకూ సెలవివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు ఇవాళ భారత్ బంద్ కూడా కావడంతో స్కూళ్లకు సెలవు ఉంటుందని కొందరు భావించారు. కానీ, బంద్ ప్రభావం లేకపోవడంతో ఏపీ, టీజీలో పాఠశాలలు యథావిధిగా నడుస్తున్నాయి. మీ ప్రాంతంలో సెలవుందా? COMMENT.

News October 24, 2025

విశాఖ డేటా సెంటర్‌: TDP, YCP మధ్య ‘క్రెడిట్’ వార్!

image

AP: విశాఖలో ఏర్పాటయ్యే డేటా సెంటర్‌పై TDP, YCP మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. క్రెడిట్ తమదేనని రెండు పార్టీలు వాదిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్‌కు తమ హయాంలోనే ఒప్పందం జరిగిందని చెప్తున్నాయి. 2020 నవంబర్‌లో అగ్రిమెంట్, 2023 మేలో శంకుస్థాపన చేశామని మాజీ సీఎం జగన్ చెప్పడంపై TDP మండిపడింది. 2019లో చంద్రబాబు CMగా ఉన్నప్పుడే అదానీ గ్రూప్, AP ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు చెప్పింది. దీనిపై మీ కామెంట్?

News October 24, 2025

APSRTCలో 277 పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

APSRTC‌లో 277 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కర్నూలు(46), నంద్యాల(43), అనంతపురం(50), శ్రీ సత్యసాయి(34), కడప(60), అన్నమయ్య(44) జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.118. అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://apsrtc.ap.gov.in/

News October 24, 2025

నేడు, రేపు భారీ వర్షాలు!

image

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, NGKL, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారితే.. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సున్నట్లు పేర్కొంది.

News October 24, 2025

మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి.. వైద్య సేవలకు ఆదేశం

image

AP: తెల్లవారుజామున కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం అత్యంత విషాదకరమని మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు. ‘పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి వైద్యసేవలు అందించాల్సిందిగా కర్నూలు GGH సూపరింటెండెంట్‌ను ఆదేశించాను. FSL టీమ్‌లను సంఘటనాస్థలికి పంపించాం’ అని తెలిపారు.