News November 6, 2024

వర్రా రవీంద్రను వదిలేయడంపై సీఎం సీరియస్

image

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి 41ఏ నోటీసులిచ్చి పోలీసులు వదిలేయడంపై సీఎం చంద్రబాబు, డీజీపీ తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కడప ఎస్పీతో కర్నూలు రేంజ్ DIG సమావేశమై రవీంద్ర కేసుపై చర్చించారు. మరో కేసులో రవీంద్రాను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వర్రాపై మంగళగిరి, HYDలో కేసులున్నాయి.

News November 6, 2024

టాప్-10లోకి దూసుకొచ్చిన పంత్

image

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఐదు స్థానాలు మెరుగుపరచుకుని ఆరో స్థానానికి చేరుకున్నారు. యశస్వీ జైస్వాల్ ఒక స్థానం దిగజారి ఫోర్త్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్-20లో కూడా లేకుండా పోయారు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అశ్విన్ 5, రవీంద్ర జడేజా 6 స్థానాల్లో ఉన్నారు.

News November 6, 2024

వాట్సాప్‌లో ఫొటో సెర్చ్ ఆప్షన్!

image

ఫొటోలను సెర్చ్ చేసేందుకు ‘search on web’ ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. దీని సాయంతో వేరే బ్రౌజర్‌లోకి వెళ్లకుండా యాప్‌లోనే ఫొటో గురించి సెర్చ్ చేయొచ్చు. ఆ ఫొటో ఎక్కడిది? ఎడిట్ చేశారా? అనే సమాచారం తెలుసుకోవచ్చు. ఫొటో పైన కనిపించే త్రీ డాట్స్‌పై క్లిక్ చేస్తే అందులో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ ఈ ఆప్షన్ ఎనేబుల్ కానున్నట్లు వాబీటా ఇన్ఫో తెలిపింది.

News November 6, 2024

నా ప్రియ మిత్రుడు ట్రంప్‌కు శుభాకాంక్షలు: మోదీ

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గెలుపొంది 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘చరిత్రాత్మక విజయం పొందిన నా ప్రియ మిత్రుడికి శుభాకాంక్షలు. పరస్పర సహకారంతో భారత్-యూఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం. మన ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం విషెస్ తెలిపారు.

News November 6, 2024

జో బైడెన్ స్టేట్‌లో ట్రంప్ ప్రభంజనం

image

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ స్టేట్ పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ విజయ దుందుభి మోగించారు. అక్కడ 19 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. 2016 తర్వాత మళ్లీ డెమోక్రాట్ల కంచుకోటను బద్దలుకొట్టారు. 1948 తర్వాత పెన్సిల్వేనియాను గెలవకుండా డెమోక్రాట్లు వైట్‌హౌస్‌ను గెలిచిన దాఖలాలు లేనేలేవు. ఈ వార్త రాసే సమయానికి ట్రంప్ 270 మ్యాజిక్ ఫిగర్‌కు 3 ఓట్ల దూరంలో ఉన్నారు. మీడియా ఆయన్ను ఇప్పటికే విజేతగా ప్రకటించేసింది.

News November 6, 2024

కొత్త అధ్యక్షుడికి విషెస్ తెలిపిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. నాలుగేళ్లు మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. శాంతి, శ్రేయస్సు కోసం పాటుపడదాం’ అని ట్వీట్ చేశారు.

News November 6, 2024

అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతంటే?

image

US అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రెసిడెంట్ జీతం ఎంతనే చర్చ మొదలైంది. వార్షిక వేతనం 400,000 డాలర్లు(₹3.36 కోట్లు) ఉంటుంది. వీటితో పాటు అధికారిక విధుల నిర్వహణ కోసం ఏడాదికి మరో 50,000(₹42లక్షలు) డాలర్లు ఇస్తారు. అలాగే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, వైట్‌హౌస్‌ నిర్వహణ వంటి ఖర్చుల కోసం 1,00,000(₹84 లక్షలు) డాలర్లు, 19000 డాలర్లు ఆతిథ్యం, ఈవెంట్ల కోసం ఇస్తారు. 2001లో చివరిగా జీతాలు పెంచారు.

News November 6, 2024

అక్రమ వలసలు అడ్డుకుంటాం: ట్రంప్

image

తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘స్వింగ్ రాష్ట్రాల్లో నేను ఊహించిన దాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. పాపులర్ ఓట్లలోనూ మనదే ఆధిక్యం. మనకు 315 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. ఎవరైనా దేశంలోకి చట్టబద్ధంగా వచ్చేలా చట్టాలు తయారు చేస్తా. సరిహద్దులను నిర్ణయిస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News November 6, 2024

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు.. కారణమిదే!

image

AP: ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982ని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ 2024 బిల్లుకి క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. కాగా పాత చట్టంతో భూ ఆక్రమణలపై కేసుల నమోదులో ఇబ్బందులు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం అందుతున్న 80 శాతం ఫిర్యాదుల్లో భూవివాదాలే ఉన్నాయంటున్న ప్రభుత్వం, YCP హయాంలో లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు చెబుతోంది.

News November 6, 2024

ట్రంప్ జోరు: మళ్లీ కిచెన్ సింక్ ఫొటో షేర్ చేసిన మస్క్

image

US ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ హవాను బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎంజాయ్ చేస్తున్నారు. వైట్‌హౌస్‌లో కిచెన్ సింక్‌తో అడుగుపెట్టినట్టు ఓ ఎడిటెడ్ ఫొటోను పోస్ట్ చేశారు. ‘LET THAT SINK IN’ అని ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ట్విటర్‌ను కొనుగోలు చేశాక ఆయన ఇలాగే సింక్‌తో ఆఫీస్‌లోకి ఎంటరవ్వడం తెలిసిందే. ఆ తర్వాత తన విజన్‌కు అనుగుణంగా మార్పులు చేపట్టారు. వైట్‌హౌస్‌లో భారీ సంస్కరణలు ఖాయమని సింబాలిక్‌గా ఇలా చెప్పారు.