India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’ సినిమాలో సంయుక్తా మేనన్‌ను చేర్చుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ శరవేగంగా సాగుతోందని, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. అయితే, అఖండ చిత్రంలో నటించిన ప్రగ్యా జైస్వాల్‌ను తప్పించి సంయుక్తా మేనన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే బోయపాటి ‘మహాకుంభమేళా’లో షూటింగ్ కూడా పూర్తి చేశారు.

JAN, FEBలో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెఫ్ట్యూన్ ఒకే వరుసలో కనిపిస్తుంటాయి. FEB 28న రాత్రి వాటితోపాటు బుధుడు కూడా వచ్చి చేరుతాడు. దీంతో 7 గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయి. యురేనస్, నెఫ్ట్యూన్‌లను బైనాక్యులర్స్/టెలిస్కోప్‌తో, మిగతా వాటిని సాధారణంగా కంటితో చూడొచ్చు. గ్రహాలు ఇలా ఒకే వరుసలో రావడం భూమిపై ప్రభావం చూపుతుందని కొందరు సైంటిస్టులు అంటుండగా మరికొందరు కొట్టిపారేస్తున్నారు.

రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డురంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘కాంగ్రెస్ ఎప్పుడూ రాజ్యాంగబద్ధంగా పాలించలేదు. చాలా సార్లు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది. అంబేడ్కర్ జీవించి ఉన్నంతకాలం ఆయనను అవమానించింది. ఆ పార్టీ కుటుంబం కేంద్రంగా పని చేస్తుంది. కుట్రలు చేసి జనతా పార్టీని కూల్చేసింది. నెహ్రూ ఫ్యామిలీ మాత్రమే దేశాన్ని పాలించాలని భావిస్తుంటుంది’ అని విమర్శించారు.

భారతీయ రైల్వేలో కీలక మార్పులు జరుగుతున్నాయి. వేగంతో పాటు ఫస్ట్ క్లాస్ వసతులతో రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం వందేభారత్ ట్రైన్లను తీసుకురాగా త్వరలోనే బుల్లెట్ రైళ్లు సైతం వచ్చే అవకాశం ఉంది. అయితే, మూడు జెనరేషన్ల రైళ్లు ఒకే చోట ఉన్న ఫొటో వైరలవుతోంది. డీజిల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో పాటు వందేభారత్ రైళ్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించాయి. మీరు ఈ మూడింట్లోనూ ప్రయాణించారా? COMMENT

చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి నౌరంగ్ యాదవ్ గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చగా తెల్లవారుజామున కన్నుమూశారు. అయితే, రాజ్‌పాల్ తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ ట్రిప్‌లో ఉండగా మరణవార్త తెలియడంతో ఢిల్లీకి బయల్దేరినట్లు సినీవర్గాలు తెలిపాయి.

మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024ను ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఏ ఒక్కరూ స్థానం సంపాదించలేకపోయారు. పాక్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు జట్టులో చోటు లభించింది. 11 మందితో కూడిన జట్టుకు శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంకను సారథిగా ఎంపిక చేసింది. జట్టు: సయూమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, నిస్సాంక, కుశాల్ మెండిస్, అసలంక (C), రూథర్‌ఫర్డ్, ఒమర్జాయ్, హసరంగ, షాహీన్ షా అఫ్రీది, హారిస్ రవూఫ్, ఘజన్‌ఫర్.

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు దాదా రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని లవ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. ‘ఉడాన్’ ఫేమ్ విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహిస్తారు. కాగా గంగూలీ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు మూవీ మేకర్స్ 2021లోనే ప్రకటించారు.

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌కు చెందిన ఓ సైక్లిస్ట్ వినూత్నంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన సైక్లిస్ట్ అనిల్ కుమార్ బోస్ ఆకారంలో రూట్ మ్యాప్ గీసుకొని నగరంలో 11 రోజుల పాటు 913KMS తొక్కారు. నగరంలోని AOC సెంటర్‌లో ఆరంభించి ఫాక్స్ సాగర్ దగ్గర ముగించారు. తాను బోస్‌కు వీరాభిమాని కావడం వల్లే ఇలా చేసినట్లు అనిల్ తెలిపారు.

ముంబైలో ‘నిర్భయ’ తరహా ఘటన సంచలనం రేపుతోంది. 20ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో సర్జికల్ బ్లేడ్, రాళ్లు చొప్పించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాధితురాలు గొరేగావ్ రైల్వే స్టేషన్‌కు చేరుకొని విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి బ్లేడ్, రాళ్లను తొలగించారు.

రెండు వారాల క్రితం సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న BSF జవాన్లపై బంగ్లాదేశీ పశువుల స్మగ్లర్లు అటాక్ చేశారు. జీవాలను తీసుకెళ్తుండగా ప్రశ్నించడంతో పదునైన వస్తువులతో వారి గొంతు, మెడ, ఛాతీ, తొడలపై దాడి చేశారు. కుటదా బోర్డర్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో మన జవాన్లపై ఇంకెంత కాలం ఇలాంటి దారుణాలని ప్రశ్నిస్తూ నెటిజన్లు #AttackOnBSFను ట్రెండ్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.