India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసును ప్రభుత్వం CIDకి బదిలీ చేసే అవకాశముంది. ఇప్పటికే వైద్యశాఖ సమావేశంలో అధికారులు దీనిపై చర్చించారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 నెలలుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు తేల్చారు. ఒక్కో ఆపరేషన్‌కు ₹50లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ ఉన్నట్లు సమాచారం.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నారు. ఈ నెల 30న రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగుతారు. ఈ క్రమంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరిగే అరుణ్ జైట్లీ స్టేడియంలోకి ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. కాగా విరాట్ చివరిసారి 2012లో రంజీ మ్యాచ్‌లో ఆడారు.

యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై కత్తిదాడి కేసులో నిందితుడు షరీఫుల్ ఇస్లామ్‌ను పోలీసులు బాంద్రా కోర్టుకు తీసుకెళ్లారు. నేటితో ముగుస్తున్న అతడి కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాల్సిందిగా వారు మెజిస్ట్రేట్‌ను కోరే అవకాశముంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో అంతుచిక్కని ప్రశ్నలు, అనుమానాలు ఎన్నో ఉన్నాయి. కోర్టు విచారణపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇంగ్లండ్ లయన్స్ జట్టు తరఫున అతిపిన్న వయసు(16 ఏళ్ల 291 రోజులు)లో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచారు. గతంలో ఈ రికార్డ్ అతడి తండ్రి ఆండ్రూ(20 ఏళ్ల 18 రోజులు) పేరిట ఉండేది. ఆండ్రూ 1998లో కెన్యాపై సెంచరీ చేయగా 26 ఏళ్ల తర్వాత రాకీ క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌పై ఈ రికార్డ్ సాధించారు.

TDSను నిరంకుశం, నిర్హేతుకం, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలన్న పిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘సారీ, మేం దీన్ని విచారించలేం. పిల్‌ను ఘోరంగా డ్రాఫ్ట్ చేశారు. మీరు హైకోర్టుకు వెళ్లొచ్చు. దీనిని మేం తిరస్కరిస్తున్నాం’ అని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. TDS సమానత్వ హక్కును హరించేస్తోందని, గుదిబండగా మారిందని BJP నేత, లాయర్ అశ్విని కుమార్ పిల్ దాఖలు చేశారు.

AP: అమరావతి అభివృద్ధి పనులను ఫిబ్రవరి 2వ వారంలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నేలపాడులో అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ పనులను ఆయన పరిశీలించారు. ‘2015లో ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇస్తే 58 రోజుల్లో 34 వేల ఎకరాలను రైతులు ఇచ్చారు. ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం. ఈ నెలాఖరులోగా అన్నీ ఖరారు చేసి, మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం’ అని చెప్పారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా అల్ట్రా HDలో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది థియేటర్ ప్రింట్ కాదని, మూవీ ఎడిటింగ్ టీమ్ నుంచే లీక్ అయిందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో CG వర్క్ లేదని స్పష్టంగా కనపడుతోందని అంటున్నారు. రూ.కోట్లు పెట్టి సినిమాలు తీస్తే.. ఇలా పైరసీ చేస్తారా? అని మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.82,420కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.300 పెరిగి రూ.75,550గా నమోదైంది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.వెయ్యి పెరిగి రూ.1,05,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆర్థికసాయం అందించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. అమరావతికి హడ్కో రుణం, వరల్డ్ బ్యాంక్ సాయం వంటి అంశాలనూ కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌తోనూ బాబు భేటీ అవుతారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఐటీ అధికారులు దిల్ రాజును సాగర్ సొసైటీలోని ఆయన కార్యాలయానికి తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ సోదాలు లేదా పలు అంశాలపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.