News January 24, 2025

650 పోస్టులు.. ఎంపికైన వారి లిస్టు విడుదల

image

TG: అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ లిస్టును TGPSC విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ప్రొవిజినల్ లిస్టును <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచింది. మొత్తం 650 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది.

News January 24, 2025

ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్య నిషేధం

image

మధ్యప్రదేశ్(MP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ సహా 17 ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్యం పూర్తిగా నిషేధించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రను కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలను సీఎం నొక్కి చెప్పారు. కాగా గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉంది.

News January 24, 2025

RRR కేసు.. తులసిబాబుకు కస్టడీ

image

AP: రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబుకు కోర్టు కస్టడీ విధించింది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో అతడు A-6గా ఉన్నారు. కాగా తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.

News January 24, 2025

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సీపీ కీలక వ్యాఖ్యలు

image

TG: మీర్‌పేట్‌లో భార్యను <<15227723>>దారుణంగా హత్య చేసిన ఘటన<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇది మిస్సింగ్ కేసుగానే ఉందని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణులతోనూ ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News January 24, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై హైకోర్టులో పిల్!

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సినిమా బడ్జెట్, కలెక్షన్ల విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని పిటిషనర్ పేర్కొన్నారు. అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ఐటీ, ఈడీ, జీఎస్టీ అధికారులతో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

News January 24, 2025

VIRAL: విపరీతమైన చలి.. ఏనుగులకు స్వెటర్లు

image

చలి విపరీతంగా పెరిగిపోవడంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పొగ మంచు కప్పేస్తోంది. దీంతో మూగ జీవాలు సైతం వణికిపోతున్నాయి. ఈక్రమంలో ప్రతి ఏటా మథురలోని వైల్డ్‌లైఫ్ రెస్క్యూ & రిహాబిలిటేషన్ ఆర్గనైజేషన్ రెస్క్యూ చేసిన ఏనుగులకు స్వెటర్లు వేస్తుంటుంది. బ్లాంకెట్స్ & మహిళలు నేసిన ఊలు స్వెటర్లు ధరించడంతో ఏనుగులు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి.

News January 24, 2025

ముగిసిన గ్రామ సభలు.. నెక్స్ట్ ఏంటి?

image

TG: ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల కోసం నిర్వహించిన గ్రామ సభలు ముగిశాయి. అధికారులు ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేసి వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటారు. లబ్ధిదారులపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే ఎంక్వైరీ చేస్తారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

News January 24, 2025

బీఆర్ఎస్ పార్టీకి షాక్

image

TG: కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నగర మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడనున్నారు. రేపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

News January 24, 2025

సైఫ్‌కు రూ.25 లక్షల బీమాపై జోరుగా చర్చ

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకేసారి రూ.25 లక్షల బీమా మంజూరు చేయడం SMలో విస్తృత చర్చకు దారితీసింది. అదే సామాన్యులకైతే ఎన్నో కొర్రీలు పెట్టి, తమ చుట్టూ తిప్పుకున్న తర్వాత ఏదో కొంత ఇస్తారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సామాన్యులు డిశ్చార్జి అయిన తర్వాత కూడా క్లైమ్ చేయరు. VVIPలకు మాత్రం ఆగమేఘాల మీద బీమా క్లెయిమ్ చేస్తారని మండిపడుతున్నారు.

News January 24, 2025

తలకు ఆనుకొని భారీ కణితి.. కాపాడిన వైద్యులు

image

ఫొటో చూసి రెండు తలలతో ఉన్న శిశువు అనుకుంటున్నారా? కాదు. ఈ పాపకు తలతో పాటు భారీ కణితి ఏర్పడింది. దీనిని ఆక్సిపిటల్ ఎన్సెఫలోసెల్ అనే డిసీస్ అని ఓ వైద్యుడు ఈ ఫొటో షేర్ చేశారు. పుట్టుకతోనే మెదడుతో పాటు చుట్టుపక్కల కణజాలం పుర్రె నుంచి బయటకు వస్తాయని తెలిపారు. ఎంతో క్లిష్టమైన చికిత్సను తాము పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయడం వల్ల వీటిని ముందే గుర్తించవచ్చన్నారు.