News January 25, 2025

వ్యాయామం చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి!

image

వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే అయినా జాగ్రత్తలు తీసుకోకుంటే గుండెపై భారం పడి కుప్పకూలిపోయే ప్రమాదముంది. శక్తికి మించి వ్యాయామం చేయకూడదు. ఒంట్లో నీటి % తగ్గకుండా చూసుకోవాలి. వ్యాయామాలు చేసేందుకు ఫిట్‌గా ఉన్నామా? లేదా? తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే చేయడం బెటర్. శరీరాకృతి కోసం స్టెరాయిడ్స్ వాడకూడదు. కడుపునిండా భోజనం చేసి ఎక్సర్‌సైజ్ చేయకూడదు.

News January 25, 2025

డాలర్‌తో రూపాయి క్షీణతపై మోదీకి కాంగ్రెస్ సెటైర్

image

డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని విమర్శించింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలం నుంచి ప్రస్తుత మోదీ పాలన వరకు రూపాయి క్షీణించడంలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందో తెలుపుతూ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. ఇందులో మోదీదే అత్యధిక వాటా అంటూ పేర్కొంది. పై ఫొటోలో దానికి సంబంధించిన వివరాలు చూడొచ్చు. రూపాయి విలువ భారీ పతనం మోదీ పాలనలో జరిగిందని అందులో కాంగ్రెస్ పేర్కొంది.

News January 25, 2025

జియో భారత్ ఫోన్లలో కొత్త ఫీచర్

image

జియో భారత్ ఫోన్లలో ‘జియో సౌండ్ పే’ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది దేశంలోని 5కోట్ల మంది చిరువ్యాపారులకు ఉపయోగపడుతుందని జియో ఇన్ఫొకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ సునీత్ దత్ చెప్పారు. వినియోగదారుల ఆన్‌లైన్ పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం సౌండ్ బాక్సులు అవసరం లేదని, ఫ్రీగా ‘జియో సౌండ్ పే’తో ఫోన్‌లోనే మెసేజ్ వినొచ్చని తెలిపారు. దీంతో ప్రతి వ్యాపారికి ఏడాదికి రూ.1500 సేవ్ అవుతుందన్నారు.

News January 25, 2025

నేడు నలుగురు ఇజ్రాయెల్ బందీల విడుదల

image

ఇజ్రాయెల్ మహిళా బందీలు నలుగురిని నేడు విడిచిపెడుతున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గత శనివారం హమాస్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా, తొలి విడతగా ఆదివారం ముగ్గురు బందీలను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.

News January 25, 2025

దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్

image

AP: దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయన సీఎస్, సీఎంవో అధికారులతో సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దిగ్గజ సంస్థల సీఈఓలు, పలు దేశాల ప్రతినిధులు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారని సీఎం వారితో చెప్పారు. ఆ సమయంలో పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు చంద్రబాబు సూచించారు.

News January 25, 2025

MHలో భారీ పేలుడు.. 8కి చేరిన మృతుల సంఖ్య

image

మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ <<15243613>>పేలుడు<<>> ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరినట్లు నాగపూర్ పోలీసులు వెల్లడించారు. ఉ.11గంటలకు ఘటన జరగ్గా, సహాయక చర్యలకు 8గంటల సమయం పట్టిందన్నారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 13మందిలో 8మంది చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర CM ఫడణవీస్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

News January 25, 2025

రజినీకాంత్ ‘జైలర్ 2’లో బాలకృష్ణ?

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ‘జైలర్ 2’ మూవీ నుంచి ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని సమాచారం. బాలయ్య ప్రస్తుతం బోయపాటి తెరకెక్కించే ‘అఖండ 2’ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నారు. ఇదే సమయంలో ‘జైలర్ 2‌’లో నటిస్తారని టాక్.

News January 25, 2025

ఇలాంటి వారు అరటిపండు తినకూడదా?

image

అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొందరు వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలర్జీ, శ్వాసకోస సమస్యలు, ఆస్తమా బాధితులు తినకూడదు. మలబద్ధకం ఉన్న వారు తింటే అది మరింత తీవ్రం కావచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. బీపీ, షుగర్ ఉన్నవారు, అధిక బరువుతో సతమతమయ్యేవారు తినకుంటేనే మంచిది. అరటిలో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి వీరికి అంతగా మేలు చేయదు.

News January 25, 2025

పొగమంచు వల్లే స్పిన్ ఆడటం కష్టమైంది: బ్రూక్

image

కోల్‌కతా‌లో జరిగిన తొలి T20లో ENG బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ఆడటంలో తడబడ్డారు. దీనికి పొగమంచే కారణమని ఆ జట్టు VC బ్రూక్ తెలిపారు. ‘చక్రవర్తి చాలా మంచి బౌలర్. పొగ మంచు వల్ల అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం మరింత కష్టమైంది. చెన్నైలో అలాంటి సమస్య ఉండదని అనుకుంటున్నా. T20 క్రికెట్‌లో అత్యంత కష్టతరమైనది స్పిన్ బౌలింగ్‌ను ఆడటమే. నేను మిడిలార్డర్‌లో వస్తాను కాబట్టి తొలి బంతి నుంచే స్పిన్‌ను ఆడాలి’ అని చెప్పారు.

News January 25, 2025

జనవరి 25: చరిత్రలో ఈ రోజు

image

1918: రష్యన్ సామ్రాజ్యం నుంచి “సోవియట్ యూనియన్” ఏర్పాటు
1969: సినీ నటి ఊర్వశి జననం
1971: 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు
✰ జాతీయ పర్యాటక దినోత్సవం
✰ ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
✰ జాతీయ ఓటర్ల దినోత్సవం