News October 23, 2025

APPLY NOW: IRCTCలో 64 ఉద్యోగాలు

image

IRCTCలో 64 హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్‌, టూరిజంలో బీఎస్సీ/బీబీఏ/ఎంబీఏ పూర్తిచేసిన 28 ఏళ్లలోపు వారు అర్హులు. రెండేళ్ల అనుభవం ఉండాలి. నవంబర్ 8-18 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.irctc.com/
✒ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 23, 2025

వర్షంతో ఆటకు అంతరాయం

image

WWC: నవీ ముంబైలో న్యూజిలాండ్‌, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం వల్ల ఆటంకం కలిగింది. 48 ఓవర్ల తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌లకు చేరుకోగా, గ్రౌండ్ స్టాప్ కవర్లతో మైదానాన్ని కప్పేశారు. ప్రస్తుతం రోడ్రిగ్స్ 69, హర్మన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 329/2గా ఉంది. అంతకుముందు ప్రతీకా రావల్(122), స్మృతి(109) సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే.

News October 23, 2025

జుట్టు ఆరోగ్యానికి ఆముదం

image

ప్రస్తుతకాలంలో చాలామంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వాటికి ఆముదం పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్, విటమిన్-ఇ , ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్లు మాడుపై రక్తప్రసరణను పెంచి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. అలాగే మాడుపై అలెర్జీ, వాపులను తగ్గించి తేమగా ఉండేలా చూస్తుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారించి జుట్టును ఆరోగ్యంగా చేస్తుందని చెబుతున్నారు. <<-se>>#Haircare<<>>

News October 23, 2025

ఇతిహాసాలు క్విజ్ – 44 సమాధానాలు

image

1. భరతుని మేనమామ ‘యధాజిత్తు’.
2. ఉత్తరుడు మత్స్య దేశపు రాజు అయిన విరాటరాజు, సుధేష్ణల కుమారుడు.
3. బ్రహ్మ నివసించే లోకం పేరు ‘సత్య లోకం’.
4. గరుడ పక్షి విష్ణువు వాహనం.
5. భారతదేశంలోని ఏకైక బ్రహ్మ ఆలయం రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 23, 2025

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు క్యాబినెట్ ఆమోదం

image

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లో సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించగా తాజాగా సీఎం అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ధ్రువీకరించారు.

News October 23, 2025

మిస్సింగ్ ఉద్యోగులు.. రంగంలోకి ఇంటెలిజెన్స్

image

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యలో అవకతవకలపై ఇంటెలిజెన్స్ దర్యాప్తు మొదలైందని విశ్వసనీయ సమాచారం. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎంతమంది, ఎంతకాలంగా పని చేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల వివరాలు సేకరించగా.. 1.03 లక్షల మంది సమాచారం లేదు. కానీ, వీరి పేరిట పదేళ్లుగా నెలకు రూ.150కోట్ల జీతాలు జమ అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించింది.

News October 23, 2025

తదుపరి చీఫ్ జస్టిస్ కోసం కేంద్రం కసరత్తు

image

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ నియామకానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. కొత్త సీజేఐ పేరును సిఫార్సు చేయాలని ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌ని కోరింది. కాగా SC సీనియర్ జడ్జి జస్టిస్ సూర్యకాంత్‌కు తదుపరి సీజేఐగా అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 23తో జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగియనుంది.

News October 23, 2025

WWC: ప్రతీకా రావల్ సెంచరీ

image

న్యూజిలాండ్‌తో మ్యాచులో మరో ఓపెనర్ ప్రతీకా రావల్ కూడా సెంచరీ చేశారు. 122 బంతుల్లో 13 ఫోర్లతో శతకం నమోదు చేశారు. ఇప్పటికే సెంచరీ చేసిన స్మృతి మంధాన 109 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. వీరిద్దరూ 212 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం ప్రతీకాతో పాటు రోడ్రిగ్స్ క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 38.1 ఓవర్లకు 239/1.

News October 23, 2025

నిబంధనలు పాటించని కాలేజీలపై ఫిర్యాదు చేయండి: APSCHE

image

AP: కొన్ని కాలేజీలు GOVT రూల్స్ పాటించడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE) తెలిపింది. ‘కన్వీనర్ కోటా సీట్లు పొందిన వారి నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇవ్వకుంటే అడ్మిషన్‌ నిరాకరిస్తున్నాయి. కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధ చర్యలు తీసుకోవడం లేదు. మహిళలపై వేధింపుల నివారణలోనూ విఫలమవుతున్నాయి’ అని పేర్కొంది. వీటిపై తమకు లేదా వర్సిటీకి, APHERMCకి ఫిర్యాదు చేయాలని సూచించింది.

News October 23, 2025

వరిలో కంపు నల్లి – నివారణకు సూచనలు

image

ఖరీఫ్ వరి పంటలో గింజ పాలు పోసుకొనే దశలో కంపు నల్లి ఆశించడం వల్ల గింజపై నల్లని మచ్చలు ఏర్పడి, గింజలు తాలుపోతాయి. నవంబరు వరకు దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బూడిద, ఆకుపచ్చ రంగులోని నల్లి పురుగులు పంటను ఆశిస్తాయి. వీటి వల్ల పొలంలో చెడు వాసన వస్తుంది. ఈ నల్లిని సాయంత్రం వేళ పొలంలో గమనించవచ్చు. వీటి నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా మలాథియాన్ 2ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.