India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎయిర్టెల్ 2 ప్లాన్ల ధరలను తగ్గించింది. రూ.499గా ఉన్న రీఛార్జీపై రూ.30 తగ్గించి రూ.469 చేసింది. దీని వ్యాలిడిటీ 84 రోజులు కాగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 SMSలు వస్తాయి. రూ.1,959తో ఉన్న ప్లాన్ ధరను రూ.1,849కి మార్చింది. 365 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 SMSలు లభిస్తాయి. వాయిస్, SMSల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించిన విషయం తెలిసిందే.

టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేయడం అతని ప్రత్యేకత అని చెప్పారు. బౌలింగ్‌లో వేరియేషన్లు చూపించడం అతనికే సాధ్యమన్నారు. ఈ తరం లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ, మిచెల్ స్టార్క్‌తో పోలిస్తే టీ20ల్లో అత్యుత్తమ బౌలర్ అర్ష్‌దీప్ అని కొనియాడారు.

TG: ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమని, తామే ముద్రించి ప్రజలకు కార్డులు జారీ చేస్తామని స్పష్టంచేశారు. కాగా రాష్ట్రానికి 20లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని CM రేవంత్ కోరారు.

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో KTRను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ సహా BRS నేతలపై పెట్టిన కేసులన్నీ ఏమయ్యాయని అన్నారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు సహా పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరిన సందర్భంగా సంజయ్ మాట్లాడారు. దావోస్ పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

TG: సరూర్ నగర్ అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి దందాకు సంబంధించిన వివరాలను రాచకొండ CP సుధీర్ బాబు వెల్లడించారు. ‘కిడ్నీ రాకెట్లో పవన్ అనే వ్యక్తి వైద్యులు, రోగులు, దాతలకు మధ్యవర్తిగా ఉన్నాడు. రాజశేఖర్, ప్రభ రిసీవర్లుగా ఉన్నారు. సుమంత్ ఆస్పత్రిని నిర్వహిస్తుండగా అవినాశ్ అనే వైద్యుడు సర్జరీలు చేశాడు. ఒక్కో సర్జరీకి ₹50-60లక్షలు వసూలు చేశారు. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు.

AP: థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనేది తమ నినాదమని CM CBN తెలిపారు. ‘ప్రపంచంలోని గొప్ప కంపెనీలన్నీ దావోస్‌కు వస్తుంటాయి. అక్కడికి వెళ్లడం వల్ల ప్రతినిధులను కలిసే అవకాశం వస్తుంది. మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి. సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తయారుచేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు గొప్పస్థాయిలో ఉన్నారు. ధ్వంసమైన AP బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం’ అని అన్నారు.

AP: దావోస్‌లో ఎన్ని MoUలు చేసుకున్నారంటూ వస్తున్న ప్రశ్నలపై CM చంద్రబాబు వివరణ ఇచ్చారు. ‘రామాయపట్నంలో రూ.95వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, LG కంపెనీ రూ.5వేల కోట్లు, రూ.65వేల కోట్లతో రిలయన్స్ బయో ఫ్యూయల్ ప్లాంట్ రాబోతున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లతో పాటు గూగుల్ రాక రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్. విశాఖలో ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి’ అని తెలిపారు.

TG: రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పథకాలను రేపు ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. HYD మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాల అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగొద్దని, అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

AP: YS వివేకా మరణంపై విజయసాయి రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ఆరోజు ఉదయం వివేకా చనిపోయారని ఓ విలేఖరి ఫోన్ చేసి చెప్పారు. అది విని షాక్ అయ్యా. సన్నగా, హెల్తీగా ఉండే వ్యక్తి సడెన్‌గా చనిపోవడం ఏంటీ అని ఆశ్చర్యపోయా. అవినాశ్‌కి ఫోన్ చేస్తే ఆయన వేరేవాళ్లకు ఫోన్ ఇచ్చి మాట్లాడించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని ఆ వ్యక్తి నాకు చెప్పారు. అదే విషయాన్ని నేను మీడియాకు చెప్పాను’ అని ఢిల్లీలో చెప్పారు.

AP: వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పైచేయి వల్లే రాజీనామా చేశారని జరుగుతున్న ప్రచారంపై విజయసాయి రెడ్డి స్పందించారు. ‘నా ప్రాధాన్యం ఎవరూ తగ్గించలేరు. నా కెపాసిటీ నాకు తెలుసు. దాన్ని ఎవరూ అంచనా వేయలేరు. నా పదవికి న్యాయం చేయగలనని అనిపిస్తే చేస్తానని చెప్తా.. లేదంటే చేయనని చెప్తా. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం చేయగలనని అనుకోవడంలేదు. అందుకే ఎంపీ పదవి నుంచి తప్పుకున్నా’ అని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.