India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఎఫ్ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ సీఈవో స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది. నోటీసులకు స్పందించిన సీఈవో విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కోరారు. FEO సంస్థకు HMDA రూ.50కోట్లకు పైగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, BLN రెడ్డి, ఐఏఎస్ అరవింద్‌ను ఏసీబీ విచారించింది.

AP: రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి గాని పార్టీకి గాని న్యాయం చేయలేనన్న ఆలోచనతోనే రాజీనామా చేశానని విజయసాయి స్పష్టం చేశారు. తన కంటే ఎక్కువ శక్తిసామర్థ్యాలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడుతారనే యోచనతో ఎంపీ పదవిని వీడానన్నారు. ఈ విషయాన్ని జగన్‌కు చెబితే, ఈ నిర్ణయం కరెక్ట్ కాదని ఆయన చెప్పారని వెల్లడించారు. అయినా తన ఇష్టప్రకారం రాజీనామా చేశానని వివరించారు.

AP: MP పదవికి రాజీనామా చేసే విషయాన్ని జగన్ లండన్‌లో ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ‘YCP ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారా?’ అన్న ప్రశ్నకు రాజకీయాల నుంచి తప్పుకున్నాక పార్టీకి రాజీనామా చేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రానికి వెళ్లాక రాజీనామా లేఖ సమర్పిస్తానని చెప్పారు. తనలాంటి వెయ్యి మంది నేతలు వైసీపీని వీడినా జగన్‌కు ఏమీ కాదన్నారు.

యూపీ ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో ఆడవాళ్లు స్నానం చేస్తుండగా వీడియో తీసిన జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. కమ్రాన్ అల్వి అనే లోకల్ జర్నలిస్టు ఓ మహిళ నదిలో స్నానం చేస్తుండగా వీడియో తీసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి అసభ్యకరమైన కామెంట్ జోడించాడు. ఇది అధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిపై కేసు పెట్టి, అరెస్టు చేశారు.

AP: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ నెల 26 నుంచి 31 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబీలో వ్యక్తిగతంగా పర్యటించడానికి ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరగా, ఆ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పర్యటనను ఆమె సొంత నిధులతో చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

TG: కరీంనగర్ మేయర్ సునీల్ రావు BRS పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ ఆయన బీజేపీలో చేరనున్నారు. కరీంనగర్లో BRS నేతలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. సునీల్ రావు కామెంట్లపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. సునీల్ అత్యంత అవినీతిపరుడని, ఐదేళ్లలో రూ.కోట్లు సంపాదించారని ఆరోపణలు గుప్పించారు.

TG: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తుదిదశకు చేరింది. దీంతో రాష్ట్రంలో FEB నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీల పాలన గడువు ముగిసి వచ్చే నెల 1తో ఏడాది కావొస్తుండగా, మరోసారి ఇన్ఛార్జుల పాలన కొనసాగించేందుకు సర్కారు సిద్ధంగా లేదు. అటు రూరల్, అర్బన్ లోకల్ బాడీలకు వేర్వేరుగా కమిషన్ నివేదిక ఇవ్వనుంది.

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ రోజు రాత్రి నుంచి ఎలాంటి జంతువులను వధించరాదని, అన్ని చికెన్, మటన్, చేపల మార్కెట్లు రేపు మూసివేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చాలా పట్టణాల్లో ఇవే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి.

AP: ఎంపీ పదవికి రాజీనామా ప్రకటించిన విజయసాయి ఇంటికి తిరుపతి YCP ఎంపీ గురుమూర్తి వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడంతో షాక్ అయ్యా. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా వచ్చా. జగన్ అన్నను మళ్లీ సీఎంగా చేసుకోవడానికి కలిసికట్టుగా కృషి చేద్దామని కోరా. దానిపై ఆలోచిద్దాం అని చెప్పారు’ అని గురుమూర్తి వెల్లడించారు.

AP: వైసీపీ కీలక నేత, జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. కాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న VSR ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈయన పదవీకాలం 2028 వరకు ఉంది.
Sorry, no posts matched your criteria.