India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గెలుపొంది 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘చరిత్రాత్మక విజయం పొందిన నా ప్రియ మిత్రుడికి శుభాకాంక్షలు. పరస్పర సహకారంతో భారత్-యూఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం. మన ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం విషెస్ తెలిపారు.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ స్టేట్ పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ విజయ దుందుభి మోగించారు. అక్కడ 19 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. 2016 తర్వాత మళ్లీ డెమోక్రాట్ల కంచుకోటను బద్దలుకొట్టారు. 1948 తర్వాత పెన్సిల్వేనియాను గెలవకుండా డెమోక్రాట్లు వైట్‌హౌస్‌ను గెలిచిన దాఖలాలు లేనేలేవు. ఈ వార్త రాసే సమయానికి ట్రంప్ 270 మ్యాజిక్ ఫిగర్‌కు 3 ఓట్ల దూరంలో ఉన్నారు. మీడియా ఆయన్ను ఇప్పటికే విజేతగా ప్రకటించేసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. నాలుగేళ్లు మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. శాంతి, శ్రేయస్సు కోసం పాటుపడదాం’ అని ట్వీట్ చేశారు.
US అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రెసిడెంట్ జీతం ఎంతనే చర్చ మొదలైంది. వార్షిక వేతనం 400,000 డాలర్లు(₹3.36 కోట్లు) ఉంటుంది. వీటితో పాటు అధికారిక విధుల నిర్వహణ కోసం ఏడాదికి మరో 50,000(₹42లక్షలు) డాలర్లు ఇస్తారు. అలాగే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, వైట్‌హౌస్ నిర్వహణ వంటి ఖర్చుల కోసం 1,00,000(₹84 లక్షలు) డాలర్లు, 19000 డాలర్లు ఆతిథ్యం, ఈవెంట్ల కోసం ఇస్తారు. 2001లో చివరిగా జీతాలు పెంచారు.
తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘స్వింగ్ రాష్ట్రాల్లో నేను ఊహించిన దాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. పాపులర్ ఓట్లలోనూ మనదే ఆధిక్యం. మనకు 315 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. ఎవరైనా దేశంలోకి చట్టబద్ధంగా వచ్చేలా చట్టాలు తయారు చేస్తా. సరిహద్దులను నిర్ణయిస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
AP: ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982ని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ 2024 బిల్లుకి క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. కాగా పాత చట్టంతో భూ ఆక్రమణలపై కేసుల నమోదులో ఇబ్బందులు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం అందుతున్న 80 శాతం ఫిర్యాదుల్లో భూవివాదాలే ఉన్నాయంటున్న ప్రభుత్వం, YCP హయాంలో లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు చెబుతోంది.
US ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ హవాను బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎంజాయ్ చేస్తున్నారు. వైట్‌హౌస్‌లో కిచెన్ సింక్‌తో అడుగుపెట్టినట్టు ఓ ఎడిటెడ్ ఫొటోను పోస్ట్ చేశారు. ‘LET THAT SINK IN’ అని ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ట్విటర్‌ను కొనుగోలు చేశాక ఆయన ఇలాగే సింక్‌తో ఆఫీస్‌లోకి ఎంటరవ్వడం తెలిసిందే. ఆ తర్వాత తన విజన్‌కు అనుగుణంగా మార్పులు చేపట్టారు. వైట్‌హౌస్‌లో భారీ సంస్కరణలు ఖాయమని సింబాలిక్‌గా ఇలా చెప్పారు.
ఏపీలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన నివాసం, కార్యాలయం, రొయ్యల ఫ్యాక్టరీలపై ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. 2019లో భీమవరంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌పై గ్రంథి శ్రీనివాస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇటు పలు జిల్లాల్లో వ్యాపారుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ చేపట్టింది.
TG: ఆరోగ్య శ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఎంప్యానెల్ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను సులభతరం చేయనుంది. 50 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంప్యానెల్ అయ్యే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 347 ఆస్పత్రులకు మరో 150 జత అవుతాయి. ఆస్పత్రుల అనుమతులపై నిర్ణయం తీసుకునే ఎంప్యానెల్ డిసిప్లినరీ కమిటీని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.
AP: హైదరాబాద్‌లో మాజీ సీఎం ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన చోటే విగ్రహం ఆవిష్కరిస్తామని చెప్పారు. కాగా విగ్రహంతోపాటు కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను టీడీపీ నేతలు కలిసినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.