News November 6, 2024

భార్యను కౌగలించుకొని, ముద్దుపెట్టిన ట్రంప్

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం పొందడంతో డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా కన్వెన్షన్ సెంటర్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన భార్య మెలానియా ట్రాంప్‌ను కౌగలించుకొని ముద్దు పెట్టి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా ఉంటూ విజయం కోసం ఎంతో కష్టపడి పనిచేశారని ఆయన కొనియాడారు. చనిపోయిన మెలానియా తల్లి కూడా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండి ఉంటారని చెప్పుకొచ్చారు.

News November 6, 2024

ముగ్గురు US ప్రెసిడెంట్లతో మోదీ సావాసం

image

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక లాంఛనమైపోవడంతో ఆయనకు భారతీయులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా 2014 నుంచి ముగ్గురు అధ్యక్షులు మారినా మోదీ మాత్రం భారత ప్రధానిగానే ఉన్నారని గుర్తుచేస్తున్నారు. 2014-17 వరకు ఒబామా, 2017-21 వరకు ట్రంప్, 2021- 24 వరకు బైడెన్, మళ్లీ ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూడు పర్యాయాలుగా మోదీ వీరితో సావాసం చేస్తున్నారు.

News November 6, 2024

ఢిల్లీకి బయల్దేరిన పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఇవాళ సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. శాంతి భద్రతల అంశంపై షాతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత తిరిగి ఏపీకి పయనం కానున్నారు.

News November 6, 2024

చావును దాటి వైట్‌హౌస్‌పై జెండా ఎగరేసి..

image

US ఎన్నికల్లో విజయానికి ముందు డొనాల్డ్ ట్రంప్ అష్టకష్టాలు పడ్డారు. కోర్టుల్లో చాలా కేసులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో ఎన్నికల్లో అసలు పోటీచేయకుండా కుట్రలు జరిగాయి. ఫెడరల్ కోర్టు దానిని కొట్టేసి మార్గం సుగమం చేసింది. ఆ తర్వాత పెన్సిల్వేనియా కాల్పుల్లో వెంట్రుకవాసిలో బుల్లెట్ నుంచి తప్పించుకున్నారు. మరోసారి గోల్ఫ్ కోర్ట్ వద్ద కాల్పులు జరిగాయి. చివరికి అన్నీ దాటుకొని వైట్‌హౌస్‌లో అడుగు పెడుతున్నారు.

News November 6, 2024

విజయనగరం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ

image

AP: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం వైసీపీ అభ్యర్థిని ప్రకటించింది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు బరిలో ఉన్నట్లు తెలిపింది. కాగా ఈ నెల 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 28న ఎన్నిక జరగనుంది. అంతకుముందు రఘురాజుపై అనర్హత వేటుతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.

News November 6, 2024

వర్రా రవీంద్రను వదిలేయడంపై సీఎం సీరియస్

image

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి 41ఏ నోటీసులిచ్చి పోలీసులు వదిలేయడంపై సీఎం చంద్రబాబు, డీజీపీ తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కడప ఎస్పీతో కర్నూలు రేంజ్ DIG సమావేశమై రవీంద్ర కేసుపై చర్చించారు. మరో కేసులో రవీంద్రాను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వర్రాపై మంగళగిరి, HYDలో కేసులున్నాయి.

News November 6, 2024

టాప్-10లోకి దూసుకొచ్చిన పంత్

image

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఐదు స్థానాలు మెరుగుపరచుకుని ఆరో స్థానానికి చేరుకున్నారు. యశస్వీ జైస్వాల్ ఒక స్థానం దిగజారి ఫోర్త్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్-20లో కూడా లేకుండా పోయారు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అశ్విన్ 5, రవీంద్ర జడేజా 6 స్థానాల్లో ఉన్నారు.

News November 6, 2024

వాట్సాప్‌లో ఫొటో సెర్చ్ ఆప్షన్!

image

ఫొటోలను సెర్చ్ చేసేందుకు ‘search on web’ ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. దీని సాయంతో వేరే బ్రౌజర్‌లోకి వెళ్లకుండా యాప్‌లోనే ఫొటో గురించి సెర్చ్ చేయొచ్చు. ఆ ఫొటో ఎక్కడిది? ఎడిట్ చేశారా? అనే సమాచారం తెలుసుకోవచ్చు. ఫొటో పైన కనిపించే త్రీ డాట్స్‌పై క్లిక్ చేస్తే అందులో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ ఈ ఆప్షన్ ఎనేబుల్ కానున్నట్లు వాబీటా ఇన్ఫో తెలిపింది.

News November 6, 2024

నా ప్రియ మిత్రుడు ట్రంప్‌కు శుభాకాంక్షలు: మోదీ

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గెలుపొంది 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘చరిత్రాత్మక విజయం పొందిన నా ప్రియ మిత్రుడికి శుభాకాంక్షలు. పరస్పర సహకారంతో భారత్-యూఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం. మన ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం విషెస్ తెలిపారు.

News November 6, 2024

జో బైడెన్ స్టేట్‌లో ట్రంప్ ప్రభంజనం

image

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ స్టేట్ పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ విజయ దుందుభి మోగించారు. అక్కడ 19 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. 2016 తర్వాత మళ్లీ డెమోక్రాట్ల కంచుకోటను బద్దలుకొట్టారు. 1948 తర్వాత పెన్సిల్వేనియాను గెలవకుండా డెమోక్రాట్లు వైట్‌హౌస్‌ను గెలిచిన దాఖలాలు లేనేలేవు. ఈ వార్త రాసే సమయానికి ట్రంప్ 270 మ్యాజిక్ ఫిగర్‌కు 3 ఓట్ల దూరంలో ఉన్నారు. మీడియా ఆయన్ను ఇప్పటికే విజేతగా ప్రకటించేసింది.