India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక బీఆర్ నాయుడు తొలిసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీవాణి నిధుల వినియోగంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు.
తన మెంటార్ యువరాజ్ సింగ్ గర్వపడేలా దక్షిణాఫ్రికాతో జరిగే T20 సిరీస్‌లో ఆడతానని భారత బ్యాటర్ అభిషేక్ శర్మ పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి భారత్-సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. 2007లో యువీ 6 సిక్సులు కొట్టిన డర్బన్ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో యువీ ఇన్నింగ్స్‌ను బీసీసీఐ ఇంటర్వ్యూలో అభిషేక్ గుర్తుచేసుకున్నారు. తాను ఇంటి నుంచి ఆ మ్యాచ్ చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు.
TG: సర్వర్ ప్రాబ్లమ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో మద్యం డిపోల నుంచి డీలర్లు లిక్కర్ తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది. కాగా రాత్రిలోపు సర్వర్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.
హీరోయిన్ అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కమర్షియల్ కాకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలకే ఆమె ఓటు వేస్తున్నారు. ఆమె ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటి’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనుష్క పుట్టినరోజు సందర్భంగా రేపు ఉ.9.45 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తామని పేర్కొంది.
పాకిస్థాన్ ఆటగాడు నోమన్ అలీ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీగా ఎంపికయ్యారు. అతడితోపాటు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌ను కూడా నామినీలుగా ఐసీసీ ఎంపిక చేసింది. కాగా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో నోమన్ అలీ విశేషంగా రాణించారు. మొత్తం 20 వికెట్లు పడగొట్టి మూడేళ్ల తర్వాత సొంతగడ్డపై తన జట్టుకు సిరీస్ విజయాన్ని అందించారు.
AP: రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
ప్రతి రోజూ కనీసం 8 వేల అడుగులైనా వేస్తే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్లవారుజామున నడిస్తే మనసు ఆహ్లాదపడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కొవ్వు కరిగి శక్తిగా మారుతుంది. అలాగే సాయంత్రం వాకింగ్ చేస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గి రాత్రి మంచి నిద్ర పడుతుంది. కాగా ఉదయం నడిచినా, సాయంత్రం నడిచినా ఆరోగ్యానికి మేలే. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వాకింగ్ చేయండి.
AP: సీఎం చంద్రబాబు మందకృష్ణ మాదిగతో పవన్ కళ్యాణ్‌ను తిట్టించారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. ‘చంద్రబాబును కలిసి ఆయనతో ఒక గంట మాట్లాడిన తరువాత మందకృష్ణ మాదిగ బయటకు వచ్చి పవన్‌ను తిట్టారు. దీనిపై పవన్ అభిమానులకు సందేహం రాలేదా? కృష్ణ మాదిగను తిడుతున్నారు కానీ ఆయన చేత పవన్‌ను తిట్టించిన చంద్రబాబును ఒక్క మాట కూడా అనడం లేదు. అదే చంద్రబాబు మార్క్ రాజకీయం’ అని ట్వీట్ చేశారు.
AP: కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం బదిలీ చేసింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్ర రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై రవీంద్ర రెడ్డి అసభ్యకర కామెంట్స్ చేయడంతో నిన్న రాత్రి రవీంద్ర రెడ్డిని అరెస్టు చేశారు. 41C నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఇదే కేసులో మరో సీఐని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ‘ఈ విజయం అమెరికా-భారత్ సంబంధాలలో కొత్త శకానికి నాందిగా నిలుస్తుంది. అన్‌స్టాపబుల్‌గా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నాను. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, భద్రతకు సహకరించాలని ట్రంప్‌ను కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.