News November 6, 2024

స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ ‘కింగ్’

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన 7 స్వింగ్ స్టేట్స్‌లోనూ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ సత్తా చాటారు. పెన్సిల్వేనియా (19 ఎలక్టోరల్ ఓట్లు), జార్జియా (16), నార్త్ కరోలినా (16), విస్కాన్సిన్ (10) రాష్ట్రాల్లో గెలిచారు. ఆరిజోనా (11), మిచిగాన్ (15), నెవాడా (6) రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇవి కూడా ట్రంప్ ఖాతాలో చేరినట్లే. ఈ రాష్ట్రాల్లో ట్రంప్ మొత్తం 91 ఓట్లను సొంతం చేసుకున్నారు.

News November 6, 2024

WATCH: ‘భైరవం’ నుంచి నారా రోహిత్ లుక్

image

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. ఈ సినిమా నుంచి నారా రోహిత్ ఫస్ట్ లుక్‌ను మూవీ యూనిట్ రివీల్ చేసింది. యాంగ్రీ లుక్‌లో పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. అంతకుముందు బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎల్లుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

News November 6, 2024

BREAKING: రఘురాజుపై అనర్హత వేటు రద్దు

image

AP: విజయనగరం వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటును హైకోర్టు రద్దు చేసింది. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన 2027 నవంబర్ వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. మరోవైపు ఇటీవల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

News November 6, 2024

మేక్ అమెరికా గ్రేట్ అగైన్ vs మేకిన్ ఇండియా.. ఏం జరగబోతోంది!

image

డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అమెరికా, భారత్ సంబంధాలు మరింత బలపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మేకిన్ ఇండియాతో మోదీ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ తమ సొంత దేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెప్తున్నారు. వీరిద్దరూ మంచి మిత్రులు కావడంతో వాణిజ్య, రక్షణ, టారిఫ్ అంశాల్లో పంతానికి పోకుండా మధ్యేమార్గం వెతుకుతారని అంటున్నారు. లీగల్ ఇమ్మిగ్రేషన్ పరంగా భారతీయులకు ఇబ్బందులేమీ ఉండవని చెప్తున్నారు.

News November 6, 2024

సిబ్బందికి ప్రజలు అందుబాటులో ఉండాలి: భట్టి

image

TG: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఆధార్‌, ధరణి, రేషన్‌కార్డు వివరాల సేకరణకు సిబ్బంది వచ్చినప్పుడు ప్రజలు అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ప్రజల పరిస్థితిని అంచనా వేయడానికి రాజకీయ, ఆదాయ డేటాను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల వివరాలకు గోప్యత ఉంటుందని భట్టి చెప్పారు. ఇదొక విప్లవాత్మక కార్యక్రమమని అభివర్ణించారు.

News November 6, 2024

అయ్యర్ మరో సెంచరీ

image

భారత ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నారు. ఒడిశాతో జరుగుతున్న రంజీ మ్యాచులో ముంబై తరఫున 101 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఈ సీజన్‌లో 20 రోజుల వ్యవధిలోనే రెండో సెంచరీ చేయడం గమనార్హం. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడికి ఇది 15వ శతకం.

News November 6, 2024

తాతా.. ఐ లవ్ యూ.. ట్రంప్ మనవరాలి సంతోషం

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన డొనాల్డ్ ట్రంప్‌కు కుటుంబసభ్యులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మనవరాలైన కై మాడిసన్ ట్రంప్ విషెస్ తెలిపారు. ‘అమెరికన్ల కోసం మీలా ఎవరూ కష్టపడి పని చేయరు. అభినందనలు తాత, ఐ లవ్ యూ’ అని ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ -వెనెస్సా కుమార్తెనే ఈ కై. చదువుకుంటూనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు.

News November 6, 2024

అయిపోయాడనుకున్నారు.. కానీ!

image

2017లో US అధ్యక్షుడైన ట్రంప్ 2021లో బైడెన్ చేతిలో ఓడారు. ఓటమిని అంగీకరించలేక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఆ నిరసనల్లో అల్లర్లు జరిగి ఆయనపై కేసులయ్యాయి. ఓ పోర్న్‌స్టార్‌కు ట్రంప్ డబ్బిచ్చిన కేసు సహా 34 కేసుల్లో దోషిగా తేలారు. దీంతో ట్రంప్ కథ ముగిసిందని భావించారు. కానీ మళ్లీ అధ్యక్ష బరిలోకి దిగారు. ప్రచారంలో ఆయనపై కాల్పులూ జరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు 47వ ప్రెసిడెంట్ అవుతున్నారు.

News November 6, 2024

IPL: వేలంలో అత్యధిక ధర పలికేదెవరు?

image

ఈ నెలాఖరులో ఐపీఎల్-2025 వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 1,574 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ వేలంలో అత్యధిక రేటు ఎవరు పలుకుతారని ప్రశ్నిస్తూ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. దీనికి పంత్ అత్యధిక ధర పలుకుతారని ఎక్కువ మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో బట్లర్, బౌల్ట్, అయ్యర్, రాహుల్ పలకవచ్చని చెబుతున్నారు. మీరు ఎవరని అనుకుంటున్నారో కామెంట్ చేయండి?

News November 6, 2024

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.10 లక్షల లోన్

image

ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం హామీతో దేశంలోని 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు రూ.10 లక్షల వరకు రుణం లభించనుంది. లోన్‌లో 75% వరకు బ్యాంకులకు కేంద్రం గ్యారంటీ ఇవ్వనుంది. దీనిపై 3 శాతం వడ్డీ రాయితీ ఉండనుంది. ఇందుకోసం కేంద్రం రూ.3,600 కోట్లు కేటాయించనుంది.