News October 30, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
* టీమ్‌గా పనిచేసి నష్టనివారణ చర్యలు చేపట్టాం: CM చంద్రబాబు
* తెలంగాణలోని భీమదేవరపల్లి(HNK)లో 41.2cmల వర్షపాతం
* రూ.303 కోట్ల ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలి: భట్టి
* అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఖరారు: కాంగ్రెస్ పార్టీ వర్గాలు
* TTD దేవాలయాలన్నింటిలోనూ అన్నదానం చేయాలని నిర్ణయం

News October 30, 2025

మొంథా తుఫాను.. రేపు పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్‌

image

AP: మొంథా తుఫాను నేపథ్యంలో YCP రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో రేపు ఉ.11 గంటలకు ఆ పార్టీ చీఫ్ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. తుఫాను తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను జిల్లా అధ్యక్షులు ఆయనకు వివరించనున్నట్లు YCP వెల్లడించింది. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై పార్టీ నాయకులకు జగన్ దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది.

News October 30, 2025

‘స్పిరిట్‌’లో డాన్ లీ?.. కొరియన్ మీడియాలో వార్తలు!

image

ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ మూవీని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కొరియన్ స్టార్ డాన్ లీ నటిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవల రిలీజ్ చేసిన సౌండ్ స్టోరీలో డాన్ లీ గురించి ప్రస్తావించలేదు. దీంతో అవి పుకార్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో స్పిరిట్‌లో డాన్ నటిస్తున్నారని కొరియన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆయన కనిపించే తొలి ఇండియన్ మూవీ ఇదేనంటున్నాయి.

News October 30, 2025

మైనార్టీకి మంత్రి పదవి ఇస్తాం: టీపీసీసీ చీఫ్

image

TG: కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, అందుకే మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. <<18140326>>మంత్రి<<>> పదవికి అజహరుద్దీన్ పేరు ఫైనల్ అయినట్లుగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీల మీటింగ్ కోసమే అజహరుద్దీన్ తనను కలిశారని చెప్పారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు నెలల్లో కూలుతుందన్న బీజేపీ ఇక చిలుక జోస్యం చెప్పుకోవాల్సిందేనని సెటైర్లు వేశారు.

News October 29, 2025

ఎల్లుండి నుంచి ఓటీటీలోకి 2 సినిమాలు

image

బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన కాంతార ఛాప్టర్-1, కొత్త లోక ఎల్లుండి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ‘కాంతార ఛాప్టర్-1’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, ‘కొత్త లోక’ జియో హాట్ స్టార్‌లో అందుబాటులోకి రానున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ‘కాంతార ఛాప్టర్-1’ రూ.800 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కొత్త లోక’ రూ.300కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

News October 29, 2025

NVIDIA సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి కంపెనీ

image

అమెరికన్ టెక్ కంపెనీ NVIDIA సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న తొలి కంపెనీగా రికార్డుల్లోకి ఎక్కింది. $4 ట్రిలియన్ వాల్యూను చేరుకున్న 3 నెలల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. $500B విలువైన AI చిప్ ఆర్డర్లు వచ్చాయని, US ప్రభుత్వం కోసం 7 సూపర్ కంప్యూటర్లు నిర్మిస్తున్నామని కంపెనీ CEO జెన్సెన్ హువాంగ్ చేసిన ప్రకటనతో షేర్లు భారీగా ఎగిశాయి.

News October 29, 2025

రూ.303 కోట్ల ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని ఆదేశం

image

TG: పెండింగ్‌లో ఉన్న SC, ST, BC, OC, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలన్నారు. దీనివల్ల ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందుతుందని, వారి మానసిక ఒత్తిడి తగ్గుతుందని భట్టి పేర్కొన్నారు.

News October 29, 2025

ఈ మార్గాల్లో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచనున్న రైల్వే

image

గుంటూరు-పగిడిపల్లి, మోటమర్రి(ఖమ్మం)-విష్ణుపురం(నల్గొండ) సెక్షన్ల మధ్య విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచడానికి రైల్వే ఆమోదం తెలిపింది. రూ.188 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాబోయే మూడేళ్లలో దీనిని పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మార్గాలు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సరకు, ప్యాసింజర్ రైళ్ల సేవలను మరింత వేగవంతం చేయనున్నాయి.

News October 29, 2025

భరత్ పోరాటం వృథా.. ఓడిన తెలుగు టైటాన్స్

image

PKL సీజన్-12లో పుణేరి పల్టాన్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచులో తెలుగు టైటాన్స్ 45-50 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫస్టాఫ్‌లో టైటాన్స్ ఆధిక్యంలో నిలిచినా సెకండాఫ్‌లో పుణేరి పుంజుకుంది. భరత్ 23 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా TT డిఫెండర్లు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించలేకపోయారు. ఓటమితో తెలుగు టైటాన్స్ ఇంటి దారి పట్టగా పుణే ఫైనల్ చేరింది. ఎల్లుండి దబాంగ్ ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది.

News October 29, 2025

ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశం

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీల్లో సౌకర్యాలు, విద్యార్థుల నమోదుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీస్, విద్యాశాఖ సహకారంతో ఈ తనిఖీలు చేపట్టనుంది. మరోవైపు బకాయిలు చెల్లించాకే తనిఖీలు చేయాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి.