India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కొత్త పథకాల మంజూరుకు ఈరోజు అంతం కాదు ఆరంభం మాత్రమేనని <<15268566>>KTRకు<<>> డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున లాంఛనంగా పథకాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. BRS హయాంలో నిధులు అందుబాటులో ఉన్నా పథకాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పేదలను పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇవాళ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిత్యం ప్రజలకు పనికి వచ్చే నిర్ణయాలు తాము తీసుకుంటామని చెప్పారు.

AP: ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రదర్శించడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ప్రధాని మోదీతో సహా ప్రముఖులందరినీ ఈ శకటం ఆకట్టుకుంది. పర్యావరణహితమైన, సహజసిద్ధమైన వనరులతో చేసే మన ఏటికొప్పాక బొమ్మలు కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. శకటంలో భాగస్వాములను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.

ఆశా భోస్లే మనవరాలు, సింగర్ జనై భోస్లేతో డేటింగ్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని భారత బౌలర్ సిరాజ్ ఒక్క పోస్టుతో తిప్పికొట్టారు. తమ ఇద్దరిది అన్నాచెల్లెళ్ల బంధం అని అర్థం వచ్చేలా ఓ పోస్టు చేశారు. ‘నా ప్రియమైన సోదరుడా’ అని జనై పోస్టు చేయగా దానిని ట్యాగ్ చేస్తూ ‘హమ్ తుమ్హారే హై సనమ్’ సినిమాలోని ‘తారోంకా చమక్‌తా’ పాట లిరిక్స్‌ను పంచుకున్నారు. ఈ పాట అన్నాచెల్లెళ్ల బంధాన్ని తెలియజేస్తూ సాగుతుంది.

కరోనా సమయంలో ప్రపంచానికి తరచూ పలు హెచ్చరికలు, సూచనలు చేసి పేరొందిన ఆ దేశ మాజీ వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌచీకి ట్రంప్ సర్కారు భద్రతను తొలగించింది. ఆయన తన భద్రతను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని తేల్చిచెప్పింది. ప్రభుత్వానికి పనిచేసినంత మాత్రాన జీవితమంతా భద్రత ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. కాగా.. కరోనా సమయం నుంచీ ట్రంప్ ఫౌచీని వ్యతిరేకిస్తున్నారు.

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో 4,597 గ్రూప్-బీ, సీ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 66 విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ఫార్మసిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <

AP: టీటీడీ పాలకమండలి జనవరి 31న అత్యవసర సమావేశం కానుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సభ్యులు, అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన దృష్ట్యా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలనూ రద్దు చేశారు.

CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును FEB 8 వరకు పెంచారు. CBSEలో 70% మార్కులతో టెన్త్ పాసైన అమ్మాయిలు అర్హులు. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల్ని ప్రోత్సహించేలా దీన్ని అమలు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు ₹1000 చొప్పున రెండేళ్లు అందుతాయి. కుటుంబ వార్షికాదాయం ₹8లక్షలలోపు ఉండాలి. 11వ తరగతి పూర్తైన వారు మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. దరఖాస్తు కోసం ఇక్కడ <

నటి శ్వాసికా విజయ్ ఏడాది వ్యవధిలో రెండోసారి పెళ్లి చేసుకున్నారు. అయితే రెండు సార్లూ తన ప్రియుడు ప్రేమ్‌తోనే కావడం విశేషం. గత ఏడాది జనవరి 26న వారికి కేరళ సంప్రదాయంలో తొలిసారి పెళ్లైంది. అయితే తమిళ సంప్రదాయంలో మరోసారి ఏకమవ్వాలని భావించి వారు తాజాగా పెళ్లి చేసుకున్నారు. శ్వాసిక అసలు పేరు పూజా విజయ్. వైగై అనే తమిళ మూవీతో ఆమె సినిమాల్లోకి వచ్చారు. చివరిగా లబ్బర్ పందూ సినిమాలో నటించారు.

TG: పథకాల కోసం అర్హులైన వారెవరూ రూపాయి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖతో కలిసి 4 పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పథకాల కోసం కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు. అనర్హులకు లబ్ధి చేకూరినట్లు తేలితే వారికి మధ్యలోనే పథకాలను ఆపేస్తామన్నారు. త్వరలో ఇంటింటికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

అప్పుల ఊబిలో ఉన్న బంగ్లాదేశ్‌కు అమెరికా షాకిచ్చింది. ఆ దేశానికి ఇచ్చే అన్ని రకాల సాయాలను నిలిపివేస్తున్నట్లు అమెరికా దాతృత్వ సంస్థ USAID ప్రకటించింది. బంగ్లాతో ప్రస్తుతం జరుగుతున్న, మున్ముందు జరగాల్సిన అన్ని సహాయక కార్యక్రమాలను నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తో భేటీ అయిన కొన్ని రోజులకే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.