News January 27, 2025

UAE లేదా బంగ్లాతో భారత్ వామప్ మ్యాచ్?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమ్ ఇండియా ఓ వామప్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ లేదా యూఏఈలో ఏదో ఒకదానితో ఈ మ్యాచ్ ఆడుతుందని సమాచారం. కాగా ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత్ తమ మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా ఆడనుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. మార్చి 9న మెగా ఈవెంట్ ఫైనల్ జరగనుంది.

News January 27, 2025

అకౌంట్లలో డబ్బులు పడ్డాయా?

image

TG: అర్ధరాత్రి నుంచి ‘రైతు భరోసా’, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని సీఎం రేవంత్ నిన్న ప్రకటించారు. తొలి దశలో భాగంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో పడతాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సుమారు 10 లక్షల మంది రైతు కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అందే సూచనలు ఉన్నట్లు సమాచారం. మరి మీకు డబ్బులు పడ్డాయా?

News January 27, 2025

నేడు ఇండోర్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. ఇండోర్‌లో సమీపంలోని అంబేడ్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్‌లో జరిగే ‘సంవిధాన్ బచావో’ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీలు కూడా వెళ్తారు. సాయంత్రం తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.

News January 27, 2025

జార్జియా ఐలాండ్‌ను ఢీకొట్టనున్న భారీ ఐస్ బర్గ్

image

జార్జియా ఐలాండ్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద మంచు కొండ ఢీకొట్టనుంది. ముంబైలాంటి ఆరు నగరాల విస్తీర్ణంతో ఇది సమానం. ఇది జార్జియా ద్వీపాన్ని ఢీకొడితే ప్రమాదం తీవ్రంగానే ఉంటుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని బరువు కొన్ని ట్రిలియన్ టన్నులు ఉండొచ్చని అంచనా. అంటార్కిటికా ఫ్లిచెనర్ రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి ఇది 1986లో విడిపోయింది. అప్పటి నుంచి కదులుతూ ఇప్పుడు జార్జియా దీవి సమీపంలోకి వచ్చింది.

News January 27, 2025

సీఎం రేవంత్ అభిప్రాయాన్ని పరిశీలించండి: విజయశాంతి

image

TG: కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు కనీసం నాలుగైనా ప్రకటించాల్సిందని సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సీఎం రేవంత్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది ఎంపీలు ఉన్న బీజేపీ దీనిపై ఆలోచించడం మంచిది. సీఎం రేవంత్ అభిప్రాయాన్ని పరిశీలించాలని కోరుకుంటున్నా’ అని ఆమె పేర్కొన్నారు.

News January 27, 2025

మమతా కులకర్ణి సన్యాసం డ్రామానా?

image

1990ల్లో ఓ ఊపు ఊపిన హీరోయిన్ మమతా కులకర్ణి సన్యాసం స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా దీని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రూ.2,000 కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్‌లో ఆమె పాత్రధారి అని, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే సన్యాసిని అవతారం ఎత్తారని అంటున్నారు. సన్యాసం తోటి తన పాపాలు అన్నీ కడిగేసుకున్నట్లుగా ఆమె ఫోజులు కొడుతున్నారని ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

News January 27, 2025

గవర్నర్, కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం

image

TG: హుస్సేన్ సాగర్‌లో చేపట్టిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. కార్యక్రమం పూర్తైన వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే చివరి అంకంగా బాణసంచా పేల్చగా పడవల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

News January 27, 2025

విద్యార్థులకు నెలకు రూ.1,000 నగదు కానుక

image

హరియాణా ప్రభుత్వం విద్యార్థులకు నెలకు రూ.1,000 ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్ విద్యార్థులకూ ఈ అవార్డు ఇవ్వాలని భావించింది. తరగతిలో టాప్‌లో నిలిచిన ఓ అబ్బాయి, ఓ అమ్మాయికి ఈ నగదు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు సర్కార్ పంపింది. ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ ఎంకరేజ్‌మెంట్ (EEE) పథకం కింద ఈ అవార్డు ప్రకటించింది.

News January 27, 2025

తిలక్ వర్మ ఇంకా సూపర్‌స్టార్ కాదు: మాజీ క్రికెటర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ సూపర్ స్టార్ అని కొందరు అంటున్నారని, కానీ ఆయన ఇంకా సూపర్ స్టార్ కాలేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. కానీ ఆవైపుగా ఆయన జర్నీ కొనసాగుతోందని చెప్పారు. ‘భారత్‌కు నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్‌గా తిలక్ సత్తా చాటుతున్నారు. జట్టును కష్టాల్లోనుంచి బయటపడేస్తూ సూపర్ స్టార్‌గా ఎదుగుతున్నారు. అతని నిబద్ధత, నిలకడతో రాటుదేలుతున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News January 27, 2025

జనవరి 27: చరిత్రలో ఈ రోజు

image

1926: మొట్టమొదటి టెలివిజన్ లండన్‌లో ప్రదర్శన
1969: ప్రముఖ నటుడు బాబీ డియోల్ జననం
1974: శ్రీలంక మాజీ క్రికెటర్ చమిందా వాస్ జననం
1987: సినీ నటి అదితి అగర్వాల్ జననం
1993: నటి, గాయని షెహనాజ్ గిల్ జననం
2023: సినీ నటి జమున మరణం
2009: మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ మరణం
కుటుంబ అక్షరాస్యత దినోత్సవం