India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
ప్రతి రోజూ కనీసం 8 వేల అడుగులైనా వేస్తే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్లవారుజామున నడిస్తే మనసు ఆహ్లాదపడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కొవ్వు కరిగి శక్తిగా మారుతుంది. అలాగే సాయంత్రం వాకింగ్ చేస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గి రాత్రి మంచి నిద్ర పడుతుంది. కాగా ఉదయం నడిచినా, సాయంత్రం నడిచినా ఆరోగ్యానికి మేలే. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వాకింగ్ చేయండి.
AP: సీఎం చంద్రబాబు మందకృష్ణ మాదిగతో పవన్ కళ్యాణ్‌ను తిట్టించారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. ‘చంద్రబాబును కలిసి ఆయనతో ఒక గంట మాట్లాడిన తరువాత మందకృష్ణ మాదిగ బయటకు వచ్చి పవన్‌ను తిట్టారు. దీనిపై పవన్ అభిమానులకు సందేహం రాలేదా? కృష్ణ మాదిగను తిడుతున్నారు కానీ ఆయన చేత పవన్‌ను తిట్టించిన చంద్రబాబును ఒక్క మాట కూడా అనడం లేదు. అదే చంద్రబాబు మార్క్ రాజకీయం’ అని ట్వీట్ చేశారు.
AP: కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం బదిలీ చేసింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్ర రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై రవీంద్ర రెడ్డి అసభ్యకర కామెంట్స్ చేయడంతో నిన్న రాత్రి రవీంద్ర రెడ్డిని అరెస్టు చేశారు. 41C నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఇదే కేసులో మరో సీఐని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ‘ఈ విజయం అమెరికా-భారత్ సంబంధాలలో కొత్త శకానికి నాందిగా నిలుస్తుంది. అన్‌స్టాపబుల్‌గా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నాను. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, భద్రతకు సహకరించాలని ట్రంప్‌ను కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన 7 స్వింగ్ స్టేట్స్‌లోనూ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ సత్తా చాటారు. పెన్సిల్వేనియా (19 ఎలక్టోరల్ ఓట్లు), జార్జియా (16), నార్త్ కరోలినా (16), విస్కాన్సిన్ (10) రాష్ట్రాల్లో గెలిచారు. ఆరిజోనా (11), మిచిగాన్ (15), నెవాడా (6) రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇవి కూడా ట్రంప్ ఖాతాలో చేరినట్లే. ఈ రాష్ట్రాల్లో ట్రంప్ మొత్తం 91 ఓట్లను సొంతం చేసుకున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. ఈ సినిమా నుంచి నారా రోహిత్ ఫస్ట్ లుక్‌ను మూవీ యూనిట్ రివీల్ చేసింది. యాంగ్రీ లుక్‌లో పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. అంతకుముందు బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎల్లుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
AP: విజయనగరం వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటును హైకోర్టు రద్దు చేసింది. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన 2027 నవంబర్ వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. మరోవైపు ఇటీవల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అమెరికా, భారత్ సంబంధాలు మరింత బలపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మేకిన్ ఇండియాతో మోదీ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ తమ సొంత దేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెప్తున్నారు. వీరిద్దరూ మంచి మిత్రులు కావడంతో వాణిజ్య, రక్షణ, టారిఫ్ అంశాల్లో పంతానికి పోకుండా మధ్యేమార్గం వెతుకుతారని అంటున్నారు. లీగల్ ఇమ్మిగ్రేషన్ పరంగా భారతీయులకు ఇబ్బందులేమీ ఉండవని చెప్తున్నారు.
TG: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఆధార్, ధరణి, రేషన్‌కార్డు వివరాల సేకరణకు సిబ్బంది వచ్చినప్పుడు ప్రజలు అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ప్రజల పరిస్థితిని అంచనా వేయడానికి రాజకీయ, ఆదాయ డేటాను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల వివరాలకు గోప్యత ఉంటుందని భట్టి చెప్పారు. ఇదొక విప్లవాత్మక కార్యక్రమమని అభివర్ణించారు.
Sorry, no posts matched your criteria.