India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: పెండింగ్‌లో ఉన్న SC, ST, BC, OC, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలన్నారు. దీనివల్ల ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందుతుందని, వారి మానసిక ఒత్తిడి తగ్గుతుందని భట్టి పేర్కొన్నారు.

గుంటూరు-పగిడిపల్లి, మోటమర్రి(ఖమ్మం)-విష్ణుపురం(నల్గొండ) సెక్షన్ల మధ్య విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచడానికి రైల్వే ఆమోదం తెలిపింది. రూ.188 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాబోయే మూడేళ్లలో దీనిని పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మార్గాలు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సరకు, ప్యాసింజర్ రైళ్ల సేవలను మరింత వేగవంతం చేయనున్నాయి.

PKL సీజన్-12లో పుణేరి పల్టాన్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచులో తెలుగు టైటాన్స్ 45-50 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫస్టాఫ్‌లో టైటాన్స్ ఆధిక్యంలో నిలిచినా సెకండాఫ్‌లో పుణేరి పుంజుకుంది. భరత్ 23 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా TT డిఫెండర్లు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించలేకపోయారు. ఓటమితో తెలుగు టైటాన్స్ ఇంటి దారి పట్టగా పుణే ఫైనల్ చేరింది. ఎల్లుండి దబాంగ్ ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది.

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీల్లో సౌకర్యాలు, విద్యార్థుల నమోదుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీస్, విద్యాశాఖ సహకారంతో ఈ తనిఖీలు చేపట్టనుంది. మరోవైపు బకాయిలు చెల్లించాకే తనిఖీలు చేయాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి.

AP: సత్యసాయి శతజయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇతర ఏర్పాట్లకోసం ₹10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. NOV 23న పుట్టపర్తిలో దీన్ని నిర్వహిస్తారు. కాగా దీనిపై దాఖలైన PILను హైకోర్టు విచారించింది. పలు సేవలందించిన వారిని స్మరించుకోవడంలో తప్పులేదంది. పిల్‌ను వెనక్కు తీసుకోవాలని సూచించడంతో పిటిషనర్ ఉపసంహరించుకున్నారు.

బిహార్ ఫేజ్1 ఎన్నికలు జరిగే 121 అసెంబ్లీ స్థానాల్లో 1314 మంది పోటీలో ఉన్నారు. అఫిడవిట్లు ఇచ్చిన 1303 అభ్యర్థుల్లో 423(32%) మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ADR పేర్కొంది. వీరిపై 33 మర్డర్, 86 అటెంప్ట్ టు మర్డర్, 46 రేప్ వంటి కేసులు నమోదయ్యాయి. పార్టీల వారీగా చూస్తే RJD 53, CONG 15, BJP 31, JDU 22, LJP 7 మంది క్రిమినల్ కేసులున్న వారే. ఇక లెఫ్ట్ పార్టీల అభ్యర్థుల్లో 30 మందిపై అలాంటి కేసులే ఉన్నాయి.

కొండలు, గుట్టల అంచులలో ఇల్లు కట్టుకోవడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇలాంటి ప్రదేశాలలో నిర్మించే ఇళ్లు స్థిరంగా ఉండవు. కొండ అంచులు బలహీనమయ్యే అవకాశాలుంటాయి. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో భూమి జారే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల నివాసానికి హాని కలుగుతుంది. ఇక్కడ ప్రాణశక్తి ప్రవాహం కూడా సరిగా ఉండదు. సురక్షిత జీవనం కోసం ఇలాంటి ప్రదేశాలను నివారించాలి’ అని అన్నారు. <<-se>>#Vasthu<<>>

అవార్డు కొనుక్కున్నానంటూ వచ్చిన కామెంట్లపై నటుడు అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో స్పందించారు. ‘అవార్డుకోసం పీఆర్ మేనేజ్ చేయలేదు. కష్టంతో కన్నీళ్లు ఒలికించి, రక్తం చిందించి సాధించాను. మీరు ఇకపైనా నమ్ముతారనుకోను. అందుకే మరో విజయం కోసం మరింత కష్టపడి మీ నోరు మూయిస్తా’ అని Xలో ఆయన పేర్కొన్నారు. కాగా ‘ఐ వాంట్ టు టాక్’ మూవీలో ఆయన నటనకు ఫిలింఫేర్-2025 అవార్డు దక్కగా దాన్ని కొన్నారని SMలో విమర్శలొచ్చాయి.

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, ప్రొఫెషనల్ విద్యాసంస్థలు, యూనివర్సిటీల బంద్‌కు <<18122140>>SFI<<>> పిలుపునిచ్చింది. దీంతో పలు కాలేజీలు రేపు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షాల నేపథ్యంలో సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని స్కూళ్లకు రేపు హాలిడే ఇచ్చారు.

అణుశక్తితో నడిచే మరో ఆయుధాన్ని రష్యా ప్రయోగించింది. అండర్ వాటర్ డ్రోన్ ‘Poseidon’ను టెస్ట్ చేసినట్లు ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇది న్యూక్లియర్ పవర్ యూనిట్ అమర్చిన మానవరహిత వెహికల్ అని తెలిపారు. ఆ డ్రోన్‌ను ఇంటర్‌సెప్ట్ చేసే మార్గమే లేదని చెప్పారు. వారం రోజుల వ్యవధిలో రష్యా నిర్వహించిన రెండో పరీక్ష ఇది. ఇటీవల న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ <<18109096>>మిసైల్ <<>>Burevestnikను ప్రయోగించడం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.