News January 29, 2025

‘అణు’ దాడి జరిగిన ప్రాంతాలకు రండి.. ట్రంప్‌కు జపాన్ ఆహ్వానం

image

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడి జరిగి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా అక్కడ పర్యటించాలని ఆ నగరాల మేయర్లు US అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. ‘అణుశక్తిపై ఆధారపడటాన్ని తగ్గించి అణ్వాయుధ నిషేధానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాం. తద్వారా ప్రపంచశాంతిని నెలకొల్పుతారని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్‌పై US అణుబాంబులు జారవిడవగా 2.10 లక్షలమందికిపైగా కన్నుమూశారు.

News January 29, 2025

ఎమోషన్స్‌ను దాచుకోండి గురూ..!

image

కోపం, బాధ, దుఃఖం వంటి భావోద్వేగాలను ఏదో ఒక సందర్భంలో చూపిస్తాం. అయితే, ప్రతికూల భావోద్వేగాలను అతిగా చూపిస్తే అనారోగ్యపడతామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతికోపం వల్ల కాలేయం బలహీనమవుతుంది. దుఃఖం ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. శ్వాసకోస సమస్యలొస్తాయి. చింత వల్ల జీర్ణక్రియ సమస్యలు, భయం వల్ల మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి పెరిగితే గుండె & మెదడు పనితీరు మందగిస్తుంది.

News January 29, 2025

BREAKING: రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్

image

దేశంలోనే తొలిసారిగా APలో రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి విడతలో పౌరులకు దేవదాయ, ఎనర్జీ, APSRTC, రెవెన్యూ, అన్న క్యాంటీన్, CMRF, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లోని 161 సేవలు అందించనుంది. త్వరలోనే మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సాప్‌లోనే ప్రభుత్వ సేవలు పొందుతారని సీఎం చంద్రబాబు చెప్పారు.

News January 29, 2025

హిందుత్వాన్ని ముప్పుగా పరిగణిస్తున్న UK!

image

హిందూ జాతీయ‌వాదం (హిందుత్వ‌), ఖ‌లిస్థానీ తీవ్ర‌వాదాన్ని దేశంలో పెరుగుతున్న ముప్పుగా UK ప‌రిగ‌ణిస్తోందని The Guardian కథనాన్ని ప్రచురించింది. ఇటీవల లీకైన హోం శాఖ నివేదిక ప్రకారం హిందుత్వాన్ని మొదటిసారిగా ఆందోళనకరమైన ఐడియాలజీగా UK గుర్తించింది. 2022లో Ind-Pak ఆసియా క‌ప్ మ్యాచ్ సంద‌ర్భంగా బ్రిటిష్ హిందూ- బ్రిటిష్ ముస్లింల మ‌ధ్య లీసెస్టర్‌లో జరిగిన అల్లర్ల తర్వాత హిందుత్వాన్ని ముప్పుగా చేర్చారు.

News January 29, 2025

30ఏళ్ల తర్వాత రాష్ట్రానికి బహుమతి: సీఎం హర్షం

image

AP: రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రానికి చెందిన శకటానికి తృతీయ బహుమతి రావడంపై CM చంద్రబాబు, Dy.CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడంపై CM అభినందనలు తెలిపారు. 30 ఏళ్ల తర్వాత RD పరేడ్‌లో బహుమతి వచ్చిందని చెప్పారు. మరోవైపు, హస్తకళలు చాటేలా శకటం ప్రదర్శన, బహుమతి రావడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏటికొప్పాక శకటానికి SMలో సైతం పెద్దఎత్తున మద్దతు లభించిన విషయం తెలిసిందే.

News January 29, 2025

గురుమూర్తికి 14 రోజుల రిమాండ్

image

HYD మీర్‌పేటలో భార్యను <<15292119>>ముక్కలుగా <<>>నరికి ఉడికించిన కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అతడే హత్య చేసినట్లు పోలీసులు సాక్ష్యాలను న్యాయమూర్తి ముందు ఉంచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నెల 16న మాధవిని చంపి శవాన్ని ముక్కలుగా చేసి ఉడికించి ఆ తర్వాత ఎముకల్ని దంచి పొడిగా మార్చాడు. బూడిదను చెరువులో పడేశాడు.

News January 29, 2025

రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో ఉండాలి: బండి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను అర్హులందరికీ ఇవ్వకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయకపోవడం బాధాకరమని సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. కేంద్రమే ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తోందని, కార్డులపై మోదీ ఫొటో ఉండాలని డిమాండ్ చేశారు. ప్రధాని ఆవాస్ యోజన ఇళ్లకు అదే పేరు కొనసాగించాలన్నారు.

News January 29, 2025

ఈ నిర్ణయాన్ని మెచ్చుకోవాల్సిందే.. ఏమంటారు?

image

కేరళలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్‌షీట్‌పై వారాన్ని మెన్షన్ చేయడాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రశంసించారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలోనూ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు సిద్ధమైనట్లు ట్వీట్ చేశారు. వారంతో పాటు రంగులను ఏర్పాటు చేసినట్లు తెలుపుతూ ఫొటోలు పంచుకున్నారు. దీనిపై అభిప్రాయం తెలపాలని కోరారు. ఇలా వారాన్ని మెన్షన్ చేస్తే రోజూ బెడ్‌షీట్ చేంజ్ చేస్తారు.

News January 29, 2025

T20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన వరుణ్ చక్రవర్తి

image

భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ICC T20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. నిన్న ENGపై 5 వికెట్లతో అదరగొట్టి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. 3 T20ల్లో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి 7.08 ఎకానమీతో 10వికెట్లు తీశారు. ఈ క్రమంలోనే 25 ర్యాంకులు ఎగబాకి 5వ స్థానానికి చేరారు. అలాగే T20ల్లో కుల్దీప్, భువీ తర్వాత 2సార్లు 5వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గానూ నిలిచారు.

News January 29, 2025

సౌదీలో రోడ్డు ప్రమాదం.. 9 మంది భారతీయులు మృతి

image

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిజన్‌లో జరిగిన ప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించినట్లు జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ తెలిపింది. అధికారులతో టచ్‌లో ఉన్నామని మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొంది. ఘటనపై విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది.