India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: 1-10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో తప్పులు దొర్లకుండా రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల సేవల్ని వినియోగించుకునే సరికొత్త ప్రయోగానికి విద్యా పరిశోధన, శిక్షణ మండలి శ్రీకారం చుట్టింది. సబ్జెక్ట్ నిపుణులు, డైట్, ప్రభుత్వ బీఈడీ కళాశాలల అధ్యాపకులు తప్పులుంటే గుర్తించి పంపేలా చర్యలు తీసుకోవాలని DEOలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా ఇటీవల పాఠ్యపుస్తకాల్లో పాత మంత్రుల పేర్లు ముద్రించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉ.10 గంటలకు సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమవుతుంది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా అక్కడి ప్రజల స్థితిగతులపై సర్వే, BCలకు స్వయం ఉపాధి రుణాలను పునరుద్ధరించడంపై చర్చించనున్నారు. YCP హయాంలో భూఅక్రమాలు, డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్లు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ సేద్యం, మాతాశిశు మరణాలు, రోడ్ల నిర్మాణం, అమరావతిలోని R5 జోన్‌పై CM దిశానిర్దేశం చేయనున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ కాంస్యం కోసం మలేషియా ప్లేయర్ లీజీ జియాతో తలపడనున్నారు. మరోవైపు టేబుల్ టెన్నిస్ రౌండ్-16లో భారత మహిళల టీమ్, రొమేనియాతో పోటీ పడనుంది. రెజ్లింగ్‌లో నిశా దహియా, మెన్స్ 3000m స్టిపుల్ ఛేజ్‌లో అవినాశ్ బరిలో ఉన్నారు. పూర్తి షెడ్యూల్ కోసం పైన చూడండి. కాగా భారత్ ఖాతాలో ఇప్పటివరకు 3 కాంస్య పతకాలు చేరాయి.
<<-se>>#Olympics2024<<>>
AP: తమ క్లస్టర్ పరిధిలో గ్రామ, వార్డు వాలంటీర్లు క్రియేట్ చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను వెంటనే తొలగించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఆ గ్రూపుల నుంచి వైదొలిగేలా ప్రజలకూ అవగాహన కల్పించాలంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఆ గ్రూపులు పెట్టినట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలగించిన వివరాలను సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు తమకు తెలియజేయాలని స్పష్టం చేసింది.
హసరంగా గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో వచ్చి అద్భుతం చేశారు వాండర్సే. 2015లోనే వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ 34 ఏళ్ల స్పిన్నర్‌కు సరైన అవకాశాలు రాలేదు. 9 ఏళ్లలో 23 మ్యాచులు మాత్రమే ఆడారు. కానీ నిన్న బలమైన టీమ్ ఇండియాపై 6 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించారు. స్టార్ ప్లేయర్లు రోహిత్, గిల్, విరాట్, దూబే, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌ను పెవిలియన్‌కు చేర్చి లంక విజయంలో కీలకపాత్ర పోషించారు.
TG: ఉచితాలు అనేవి అనుచితంగా ఇవ్వడం తప్పు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్హత లేని వారికి ఇవ్వకూడదని న్యూజెర్సీలో NRIలతో జరిగిన సమావేశంలో చెప్పారు. కోటీశ్వరులు ఉచితాలు తీసుకోకపోవడం మంచిదని సూచించారు. దీంతో అసలైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ అందించిందని ఉద్ఘాటించారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాను మించి ఉండాలనే ‘డబుల్ ఇస్మార్ట్’ స్టోరీ పూరీ రాశారని రామ్ పోతినేని చెప్పారు. పూరీ ఎక్కువ సమయం తీసుకున్న స్క్రిప్ట్ ఇదేనని తెలిపారు. డబుల్ ఇస్మార్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. పూరీతో పని చేసేటప్పుడే కాకుండా అతని స్క్రిప్ట్ వింటున్నపుడూ కిక్ వస్తుందన్నారు. కమర్షియల్ సినిమాలు తెరకెక్కించడం అంత సులువు కాదని పేర్కొన్నారు. ఈ నెల 15న ‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల కానుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల హాకీలో ఆస్ట్రేలియా, బెల్జియం, అర్జెంటీనా, బ్రిటన్ జట్లు ఇంటి బాట పట్టాయి. క్వార్టర్ ఫైనల్లో ఆయా జట్లు ఓటమి పాలవ్వడంతో భారత పురుషుల హాకీ జట్టుకు బంగారం లాంటి ఛాన్స్ ముందుంది. సెమీస్‌లో జర్మనీతో మ్యాచులో సత్తా చాటితే గోల్డ్ గెలిచే అవకాశం ఉంది. జట్టులోని ఆటగాళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ విజయాన్ని అందిస్తే దాదాపు 44 ఏళ్ల కల సాకారం అవుతుంది.
<<-se>>#Olympics2024<<>>
TG: వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తక్షణమే దీనిని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గత రెండు నెలల్లో నమోదైన 48.6 శాతం అధిక వర్షపాతంతో సుమారు 34 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వెల్లడించారు.
TG: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో బ్రేక్ దర్శనం ప్రారంభం కానుంది. నేటి నుంచి ప్రతి రోజూ ఉదయం 10:15 గంటల నుంచి 11:15 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. టికెట్ ధర ఒక్కరికి రూ.300 చొప్పున నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బ్రేక్ దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.