News October 29, 2025

ఎల్లుండి నుంచి ఓటీటీలోకి 2 సినిమాలు

image

బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన కాంతార ఛాప్టర్-1, కొత్త లోక ఎల్లుండి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ‘కాంతార ఛాప్టర్-1’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, ‘కొత్త లోక’ జియో హాట్ స్టార్‌లో అందుబాటులోకి రానున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ‘కాంతార ఛాప్టర్-1’ రూ.800 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కొత్త లోక’ రూ.300కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

News October 29, 2025

NVIDIA సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి కంపెనీ

image

అమెరికన్ టెక్ కంపెనీ NVIDIA సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న తొలి కంపెనీగా రికార్డుల్లోకి ఎక్కింది. $4 ట్రిలియన్ వాల్యూను చేరుకున్న 3 నెలల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. $500B విలువైన AI చిప్ ఆర్డర్లు వచ్చాయని, US ప్రభుత్వం కోసం 7 సూపర్ కంప్యూటర్లు నిర్మిస్తున్నామని కంపెనీ CEO జెన్సెన్ హువాంగ్ చేసిన ప్రకటనతో షేర్లు భారీగా ఎగిశాయి.

News October 29, 2025

రూ.303 కోట్ల ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని ఆదేశం

image

TG: పెండింగ్‌లో ఉన్న SC, ST, BC, OC, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలన్నారు. దీనివల్ల ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందుతుందని, వారి మానసిక ఒత్తిడి తగ్గుతుందని భట్టి పేర్కొన్నారు.

News October 29, 2025

ఈ మార్గాల్లో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచనున్న రైల్వే

image

గుంటూరు-పగిడిపల్లి, మోటమర్రి(ఖమ్మం)-విష్ణుపురం(నల్గొండ) సెక్షన్ల మధ్య విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచడానికి రైల్వే ఆమోదం తెలిపింది. రూ.188 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాబోయే మూడేళ్లలో దీనిని పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మార్గాలు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సరకు, ప్యాసింజర్ రైళ్ల సేవలను మరింత వేగవంతం చేయనున్నాయి.

News October 29, 2025

భరత్ పోరాటం వృథా.. ఓడిన తెలుగు టైటాన్స్

image

PKL సీజన్-12లో పుణేరి పల్టాన్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచులో తెలుగు టైటాన్స్ 45-50 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫస్టాఫ్‌లో టైటాన్స్ ఆధిక్యంలో నిలిచినా సెకండాఫ్‌లో పుణేరి పుంజుకుంది. భరత్ 23 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా TT డిఫెండర్లు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించలేకపోయారు. ఓటమితో తెలుగు టైటాన్స్ ఇంటి దారి పట్టగా పుణే ఫైనల్ చేరింది. ఎల్లుండి దబాంగ్ ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది.

News October 29, 2025

ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశం

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీల్లో సౌకర్యాలు, విద్యార్థుల నమోదుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీస్, విద్యాశాఖ సహకారంతో ఈ తనిఖీలు చేపట్టనుంది. మరోవైపు బకాయిలు చెల్లించాకే తనిఖీలు చేయాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి.

News October 29, 2025

సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ₹10 కోట్లు

image

AP: సత్యసాయి శతజయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇతర ఏర్పాట్లకోసం ₹10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. NOV 23న పుట్టపర్తిలో దీన్ని నిర్వహిస్తారు. కాగా దీనిపై దాఖలైన PILను హైకోర్టు విచారించింది. పలు సేవలందించిన వారిని స్మరించుకోవడంలో తప్పులేదంది. పిల్‌ను వెనక్కు తీసుకోవాలని సూచించడంతో పిటిషనర్ ఉపసంహరించుకున్నారు.

News October 29, 2025

బిహార్ అభ్యర్థుల్లో 32% మందిపై క్రిమినల్ కేసులు

image

బిహార్ ఫేజ్1 ఎన్నికలు జరిగే 121 అసెంబ్లీ స్థానాల్లో 1314 మంది పోటీలో ఉన్నారు. అఫిడవిట్లు ఇచ్చిన 1303 అభ్యర్థుల్లో 423(32%) మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ADR పేర్కొంది. వీరిపై 33 మర్డర్, 86 అటెంప్ట్ టు మర్డర్, 46 రేప్ వంటి కేసులు నమోదయ్యాయి. పార్టీల వారీగా చూస్తే RJD 53, CONG 15, BJP 31, JDU 22, LJP 7 మంది క్రిమినల్ కేసులున్న వారే. ఇక లెఫ్ట్ పార్టీల అభ్యర్థుల్లో 30 మందిపై అలాంటి కేసులే ఉన్నాయి.

News October 29, 2025

అస్థిర స్థలంలో ఇల్లు వద్దు: వాస్తు నిపుణులు

image

కొండలు, గుట్టల అంచులలో ఇల్లు కట్టుకోవడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇలాంటి ప్రదేశాలలో నిర్మించే ఇళ్లు స్థిరంగా ఉండవు. కొండ అంచులు బలహీనమయ్యే అవకాశాలుంటాయి. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో భూమి జారే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల నివాసానికి హాని కలుగుతుంది. ఇక్కడ ప్రాణశక్తి ప్రవాహం కూడా సరిగా ఉండదు. సురక్షిత జీవనం కోసం ఇలాంటి ప్రదేశాలను నివారించాలి’ అని అన్నారు. <<-se>>#Vasthu<<>>

News October 29, 2025

మరింత కష్టపడి మీ నోరు మూయిస్తా: అభిషేక్

image

అవార్డు కొనుక్కున్నానంటూ వచ్చిన కామెంట్లపై నటుడు అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో స్పందించారు. ‘అవార్డుకోసం పీఆర్‌ మేనేజ్ చేయలేదు. కష్టంతో కన్నీళ్లు ఒలికించి, రక్తం చిందించి సాధించాను. మీరు ఇకపైనా నమ్ముతారనుకోను. అందుకే మరో విజయం కోసం మరింత కష్టపడి మీ నోరు మూయిస్తా’ అని Xలో ఆయన పేర్కొన్నారు. కాగా ‘ఐ వాంట్ టు టాక్’ మూవీలో ఆయన నటనకు ఫిలింఫేర్-2025 అవార్డు దక్కగా దాన్ని కొన్నారని SMలో విమర్శలొచ్చాయి.