India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్టైల్ కోసం జుట్టుకు పింక్, గ్రీన్, బ్లూ లాంటి వైబ్రంట్ కలర్లను వేసుకోవడం ఇటీవల పెరిగింది. వీటివల్ల తొందరగా గ్రే హెయిర్ వస్తుందని, జుట్టు నెరిసిపోతుందనే వాదన చాలా కాలంగా ఉంది. అయితే దీనికి సైంటిఫిక్ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ‘జన్యుపరం, సూర్యరశ్మి, ఒత్తిడి వల్లే జుట్టు నెరుస్తుంది. రంగులు వేసుకోవడం కారణం కాదు. ఆ కలర్లు జుట్టు పైపొరను మాత్రమే ప్రభావితం చేస్తాయి’ అని స్పష్టం చేస్తున్నారు.
TG: ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(ఇంగ్లిష్, మ్యాథ్స్) ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను TGPSC విడుదల చేసింది. <
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను కేంద్ర మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా స్వీకరించింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఆదేశించింది. కాగా ఫార్మా సిటీకి భూములు ఇవ్వనందుకు పోలీసులు తమను హింసించారని, అక్రమంగా నిర్బంధించారని కొందరు గ్రామస్థులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
AP: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తామని YCP MPలు తెలిపారు. వైసీపీ చీఫ్ జగన్‌తో భేటీ అనంతరం మాట్లాడుతూ ‘పోలవరం ఎత్తును తగ్గించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిలదీస్తాం. వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. ప్రత్యేక హోదా కోసం నినదిస్తాం. YCP కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులను పార్లమెంటులో చర్చిస్తాం’ అని పేర్కొన్నారు.
సినీ నటి రేణూ దేశాయ్ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని రేణు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన తల్లి ఫొటో షేర్ చేసి ఓం శాంతి అంటూ పోస్ట్ చేశారు. దీంతో రేణును నెటిజన్లు ఓదారుస్తున్నారు. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచిస్తున్నారు.
TG: ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్‌లో తాను పాల్గొంటానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2009 నవంబర్ 29న తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు కావడంతో దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
భారత షట్లర్లు పీవీ సింధు, అనుపమ ఉపాధ్యాయ చైనా మాస్టర్స్ టోర్నీలో రెండో రౌండ్లో వెనుదిరిగారు. సింగపూర్‌కు చెందిన యెవో జియా మిన్ చేతిలో సింధు 16-21, 21-17, 21-23 తేడాతో ఓడిపోగా అనుపమ జపాన్ క్రీడాకారిణి నత్సుకీ నిడైరాతో 21-7, 21-14 తేడాతో ఓటమిపాలయ్యారు. సింధు ఈ ఏడాది వరుసగా 7 టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ కూడా దాటకపోవడం గమనార్హం.
అదానీ గ్రూప్‌తో కుదుర్చుకున్న రెండు భారీ ప్రాజెక్టులను రద్దు చేస్తున్నట్లు కెన్యా ప్రకటించింది. పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్స్ నిర్మించేందుకు 700 మిలియన్ డాలర్ల ఎనర్జీ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు విలియం రుతో వెల్లడించారు. దాంతో పాటు JKI విమానాశ్రయాన్ని విస్తరించేందుకు జరుపుతున్న ప్రణాళికలను నిలిపివేస్తున్నామన్నారు. కాగా అదానీపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ వైవాహిక జీవితం సరిగా లేదంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిపై అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో పరోక్షంగా స్పందించారు. ‘ఊహాగానాలెప్పుడూ ఊహాగానాలే. అవాస్తవాలే. వాటికి ఎటువంటి ఆధారాలు ఉండవు. ధ్రువీకరణ కాని సమాచారాన్ని ప్రశ్నార్థకం పెట్టి రాసేస్తుంటారు. అది ఎవరి గురించైతే రాశారో వారి జీవితంపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో పట్టించుకోరు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో దారుణం జరిగింది. ముష్కరులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 38 మంది మరణించారు. 29 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. పరాచినార్ నుంచి పెషావర్‌కు వెళ్తున్న రెండు వ్యాన్లపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
Sorry, no posts matched your criteria.