News November 6, 2024

ON THIS DAY: అండమాన్‌ను స్వాధీనం చేసుకున్న నేతాజీ

image

జపాన్ ఇంపీరియల్ ఫోర్స్ ఆక్రమణలో ఉన్న అండమాన్ నికోబార్ దీవిని 1943లో ఇదేరోజున భారత సైన్యం సుప్రీం కమాండర్‌ సుభాష్ చంద్రబోస్ స్వాధీనం చేసుకున్నారు. టోక్యోలో జపాన్ ప్రధానిని కలిసిన తర్వాత నవంబర్ 6, 1943న A&N దీవులను భారత్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అనంతరం 30 డిసెంబర్ 1943న భారత గడ్డపై తొలిసారిగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని నేతాజీ ఎగురవేశారు.

News November 6, 2024

పార్కింగ్‌లో జపాన్ ఉద్యోగుల కొత్త పద్ధతి!

image

జపాన్‌ టెక్నాలజీలో దూసుకెళ్తూనే సరికొత్త పద్ధతులను తీసుకొస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. అక్కడ ఆఫీసుకు లేటుగా వచ్చే ఉద్యోగుల కోసం ఇంట్రెస్టింగ్ రూల్‌ను అమలు చేస్తున్నారు. ముందుగా కార్యాలయానికి వచ్చిన వారు తమ కారును దూరంగా పార్క్ చేయాలి. అలా చేయడం వల్ల ఆలస్యంగా వచ్చేవారు తమ కారును దగ్గరగా పార్క్ చేసి సమయానికి ఆఫీసుకు వచ్చేలా చేస్తుంది. ఉద్యోగులు పరస్పరంగా ఇలా ఒప్పందం చేసుకుంటారని తెలుస్తోంది.

News November 6, 2024

రిలీజైన నెలరోజుల్లోనే OTTలోకి ‘లక్కీ భాస్కర్’?

image

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రేక్షకులను అలరిస్తూనే మంచి కలెక్షన్లు రాబడుతోంది. అయితే, రిలీజైన నెలరోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 30న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News November 6, 2024

క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి బడ్జెట్, నూతన క్రీడా విధానం, డ్రోన్, సెమీ కండక్టర్ పాలసీలు, ప్రభుత్య ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంపుదలపై క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఇటు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లపైనా చర్చించనున్నారు.

News November 6, 2024

OFFICIAL: రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి

image

బాలీవుడ్ ‘రామాయణ’ మూవీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. 2026 దీపావళికి మొదటి, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నాయి. నితేశ్ తివారీ రూపొందించనున్న ఈ మూవీలో బాబీ డియోల్, యశ్ కీలకపాత్రలు పోషిస్తారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తారు.

News November 6, 2024

US ELECTIONS: ఇండియన్ అమెరికన్స్ హవా

image

అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ హవా కొనసాగుతోంది. వర్జీనియా నుంచే కాకుండా మొత్తం ఈస్ట్ కోస్ట్‌లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎంపికైన సుహాస్ సుబ్రహ్మణ్యం చరిత్ర సృష్టించారు. ఐదుగురు ఇండియన్ అమెరికన్స్ ఉండే కాంగ్రెస్ సమోసా కాకస్‌లో చోటు దక్కించుకున్నారు. మిచిగన్ నుంచి శ్రీ తానేదార్ రెండోసారి, ఇల్లినాయిస్ నుంచి రాజా కృష్ణమూర్తి విజయఢంకా మోగించారు. మరికొందరి ఫలితాలు రావాల్సి ఉంది.

News November 6, 2024

నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

image

AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసుతో పాటు టీడీపీ ఆఫీసు, బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై గతంలో అమరావతిలో జరిగిన దాడి ఘటనల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో నందిగం సురేశ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News November 6, 2024

క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఢిల్లీకి పవన్

image

ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరనున్నారు. సాయంత్రం 6.30 నుంచి 7 గంటల మధ్యలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News November 6, 2024

‘పుష్ప 2’ మేకర్స్ భారీ ప్లాన్?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రానున్న ‘పుష్ప 2’ మూవీ ప్రమోషన్లు భారీగా చేపట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు టాక్. పుణే, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, హుబ్లీ, చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌తోపాటు దుబాయ్ లేదా అమెరికాలో ప్రెస్ మీట్లు, పబ్లిక్ ఈవెంట్లు నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

News November 6, 2024

గెలిచేదెవరైనా US మరింత ఒంటరవ్వడం ఖాయం: జైశంకర్

image

ప్రెసిడెంట్‌గా గెలిచేదెవరైనా అమెరికా మరింత ఒంటరి (Isolationist) అవ్వడం ఖాయమేనని EAM జైశంకర్ అన్నారు. ఇతర దేశాలపై వారి పెత్తనం, రాజకీయ జోక్యం తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఒబామా హయాం నుంచి గ్లోబల్ కమిట్‌మెంట్స్‌ అంశంలో అమెరికా అప్రమత్తంగా ఉంటోందని వివరించారు. డొనాల్డ్ ట్రంప్ దీనిని బాహాటంగానే చెప్తుంటారని పేర్కొన్నారు. ఏదేమైనా అమెరికాతో భారత్ సంబంధాలు మరింత మెరుగవుతాయని ధీమా వ్యక్తం చేశారు.