News October 29, 2025

రాహుల్ గూండాలా మాట్లాడుతున్నారు: బీజేపీ

image

ఓట్ల కోసం <<18140008>>డాన్స్<<>> చేయమన్నా చేస్తారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. లోకల్ గూండాలా రాహుల్ మాట్లాడుతున్నారని మండిపడింది. ‘మోదీకి ఓటు వేసిన దేశంలోని ప్రతి పేద వ్యక్తిని రాహుల్ అవమానించారు. ఓటర్లను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’ అని విమర్శించింది. చొరబాటుదారులకు బహిరంగంగానే ఆయన అండగా నిలుస్తున్నారని ఫైరయింది.

News October 29, 2025

ప్రెగ్నెన్సీలో సూక్ష్మపోషకాలు తీసుకుంటున్నారా?

image

ప్రెగ్నెన్సీలో అదనపు పోషకాలు తీసుకోవడం తప్పనిసరి. ఇవే బిడ్డ శారీరక, మానసిక పెరుగుదల, రోగనిరోధకశక్తిని ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ తొలి 28రోజుల్లో తీసుకునే ఫోలిక్‌ ఆమ్లం బిడ్డలో నాడీలోపాలు రాకుండా చేస్తుంది. రక్తకణాల నిర్మాణానికి ఐరన్, దంతాలు, ఎముకల నిర్మాణానికి విటమిన్‌ D, కాల్షియం అవసరం. విటమిన్‌ A, అయొడిన్‌ శిశువు మెదడు, శారీరక పెరుగుదలకి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

News October 29, 2025

అలా అయితే బంగ్లాదేశ్‌కు వెళ్తా: షేక్ హసీనా

image

భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి మీడియాతో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే బంగ్లా ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నికవ్వాల్సిన అవసరం ఉందని రాయిటర్స్‌కు మెయిల్‌లో తెలిపారు. అవామీ లీగ్‌కు లక్షలాది మంది మద్దతిస్తున్నారని, తమ పార్టీని పోటీకి అనుమతించకుంటే 2027 ఎన్నికలను వారు బహిష్కరిస్తారన్నారు. చట్టబద్ధమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు అదుపులో ఉంటే బంగ్లా వెళ్తానని చెప్పారు.

News October 29, 2025

ఇతిహాసాలు క్విజ్ – 50 సమాధానాలు

image

1. తులసి దేవికి పూర్వ జన్మలో ఉన్న పేరు ‘బృందా దేవి’.
2. త్రిపురాంతకుడు అంటే ‘పరమ శివుడు’.
3. కర్ణుడి కవచకుండలాలను దానం చేయమని కోరిన దేవుడు ‘ఇంద్రుడు’.
4. వాక్కుకు అధిష్టాన దేవత వాగ్దేవి. అంటే సరస్వతీ దేవి.
5. పరశురాముడు తన తల్లి తలను తండ్రి ‘జమదగ్ని’ ఆజ్ఞ మేరకు నరికాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 29, 2025

హైదరాబాద్‌లో అతిపెద్ద మెక్‌ డొనాల్డ్స్‌ కేంద్రం ప్రారంభం

image

అంతర్జాతీయ ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్’ 1.56 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ‘గ్లోబల్ ఆఫీస్(గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌)’ను HYDలో ఏర్పాటు చేసింది. డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ప్రారంభించారు. అమెరికా బయట మెక్‌ డొనాల్డ్స్‌కు ఇదే అతిపెద్ద కేంద్రం. ఇది ఆ కంపెనీ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రైస్ ఆపరేషన్స్‌కు ‘గ్లోబల్ హబ్’గా పని చేయనుంది. 1200 మంది(హై స్కిల్డ్)కి ఉపాధి లభించనుంది.

News October 29, 2025

కందలో అంతర పంటలు.. అంతర పంటగా కంద

image

కంద దుంపలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, తక్కువ కాలపరిమితి కలిగిన నువ్వు, మినుము, చిరుధాన్యాలు మొదలైన పంటలను అంతర పంటలుగా ఆయా ప్రాంతాలకు, కాలానికి తగిన విధంగా ఎంపిక చేసి సాగు చేసుకోవచ్చు. అలాగే పసుపులో మిశ్రమ పంటగా కందను వేసుకోవచ్చు. అరటి, కొబ్బరిలో అంతర పంటగా వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. పసుపులో కూడా కందను అంతర పంటగా వేసి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.

News October 29, 2025

ప్రజలు తినే పంటలు పండిస్తే మంచిది: CBN

image

AP: రాయలసీమలో వరికాకుండా ఇతర పంటలు పండిస్తున్నారని, కోస్తాలో కూడా తినేరకాలు పండించాలని CBN రైతులకు సూచించారు. ‘పంటకు ఫలితం ఉండాలంటే తినే వాళ్లుండాలి. ప్రజలు తినని వాటిని పండిస్తే లాభమేంటి? ఇప్పటికే ధాన్యం వాడకం తగ్గిపోతోంది’ అని చెప్పారు. అలా చేయకుండా తనను ఎన్ని తిట్టినా ఫలితం లేదన్నారు. కార్బోహైడ్రేట్స్ ఉండే రైస్ తినకూడదని దానివల్లే అందరికీ షుగర్ అని అన్నారు. కోనసీమలో పంటల్ని CM పరిశీలించారు.

News October 29, 2025

మెదడు ఎదుగుదలలో తల్లిపాల పాత్ర

image

తల్లిపాలు బిడ్డ ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎన్నో పోషకాలతో నిండి ఉండే తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తాయి. అయితే శిశువుల వివిధ దశల్లో మెదడు ఎదుగుదలకు అనుగుణంగా చనుబాలలోని పోషకాల మోతాదులు మారిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలినెలల్లో తల్లిపాలలో మేయో-ఇనాసిటోల్‌ పెద్దమొత్తంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది బిడ్డ మెదడులో నాడీఅనుసంధానాలకు తోడ్పడుతోంది.

News October 29, 2025

AUSతో తొలి 3 టీ20లకు నితీశ్ దూరం

image

టీమ్ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ ఆస్ట్రేలియాతో మూడు టీ20లకు దూరమయ్యారు. ఆయన గాయం నుంచి కోలుకునేందుకు కాస్త సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం ఆయన మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొంది. అయితే ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది వెల్లడించలేదు. ఆస్ట్రేలియాతో ఆడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో నితీశ్ <<18098198>>గాయపడిన<<>> సంగతి తెలిసిందే.

News October 29, 2025

ఆ పోస్టులు ఖాళీగా లేవు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

image

బిహార్‌లో ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్ కుమారేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘బిహార్‌లో సీఎం పోస్టు, ఢిల్లీలో ప్రధాని సీటు ఖాళీగా లేవు. ఇక్కడ నితీశ్ ఉన్నారు. అక్కడ మోదీ ఉన్నారు. మీకు (ఆర్జేడీ, కాంగ్రెస్) ఛాన్స్ రాదు’ అని అన్నారు. జంగిల్ రాజ్ నుంచి బిహార్‌ను రక్షించుకునేందుకే ఈ ఎన్నికలని చెప్పారు. ఒక్క పొరపాటు జరిగినా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్తుందని ప్రజలను హెచ్చరించారు.