News November 5, 2024

ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు

image

ప్ర‌భుత్వ నియామ‌కాల్లో మ‌హిళ‌ల‌కు ఉన్న 33% రిజ‌ర్వేష‌న్ల‌ను 35 శాతానికి పెంచేందుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు CM మోహ‌న్ యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన క్యాబినెట్‌ భేటీలో నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో అన్ని ర‌కాల ప్ర‌భుత్వ నియామకాల్లో (ఫారెస్ట్ మినహా) మహిళలకు 35% రిజర్వేషన్లు అమలుకానున్నాయి. మహిళా సాధికారతలో ఈ నిర్ణయం కీలక ముందడుగని డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా పేర్కొన్నారు.

News November 5, 2024

భారత్ బ్రాండ్: రూ.30కే గోధుమ పిండి, రూ.34కే బియ్యం

image

కేంద్రం భారత్ బ్రాండ్ రెండో దశను ఆవిష్కరించింది. కాస్త ధరలు పెంచి రూ.30కే కేజీ గోధుమ పిండి, రూ.34కే KG బియ్యం వినియోగదారులకు ఇవ్వనుంది. 5-10 KGల బ్యాగులను NCCF, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మనుంది. వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు దీనిని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఫేజ్-1లో రూ.27.50కే కేజీ గోధుమ పిండి, రూ.29కే కిలో బియ్యం అందించింది.

News November 5, 2024

US Elections: డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం

image

న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో పోలింగ్ ముగిసింది. తొలి ఫ‌లితం కూడా వ‌చ్చేసింది. అర్హులైన ఓటర్లు అతిత‌క్కువగా ఉండే ఈ ప్రాంతంలో 1960 నుంచి మిగిలిన రాష్ట్రాల కంటే ముందే పోలింగ్ జ‌రుగుతోంది. ఈ ఫ‌లితాల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌న‌కు చెరో మూడు చొప్పున బ్యాలెట్ ఓట్లు ద‌క్కాయి. యూఎస్-కెనడా సరిహద్దులోని ఈ పట్టణ ప్రజలు గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చారు.

News November 5, 2024

నవంబర్ 25 నుంచి పార్లమెంటు సమావేశాలు

image

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా వక్ఫ్ సవరణ బిల్లు సహా దేశంలో జమిలి ఎన్నికల బిల్లు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నవంబర్ రెండో వారంలో పలు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉపఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో కొత్త స‌భ్యుల ప్రమాణం కూడా ఉంటుంది.

News November 5, 2024

ఎల్లుండి ‘థగ్ లైఫ్’ నుంచి స్పెషల్ అప్డేట్

image

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి ఎల్లుండి స్పెషల్ అప్డేట్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. పెన్సిల్ ఆర్ట్‌తో కూడిన కమల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. లోకనాయకుడి బర్త్ డే సందర్భంగా ఈనెల 7న ఉదయం 11 గంటలకు సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ వస్తుందన్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించారు.

News November 5, 2024

USA ఎన్నికలు: అంతరిక్షం నుంచి ఓటింగ్

image

మరికొన్ని గంటల్లో USA అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈక్రమంలో స్పేస్ స్టేషన్‌లో చిక్కుకున్న సునీతా విలియమ్స్‌, మరో ముగ్గురు వ్యోమగాములు ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తారు. నాసా పంపిన అప్లికేషన్‌లో వారు ఓటేయగానే ఆ డేటాను శాటిలైట్ ద్వారా రిసీవ్ చేసుకుంటారు. దీనిని ఓటరు, ఎన్నికల అధికారి మాత్రమే చూడగలరు. కాగా, ఇలా తొలిసారి 1997లో డేవిడ్ వోల్ఫ్ ఓటేయగా చివరిసారి 2020లో కేట్ రూబిన్స్ ఓటేశారు.

News November 5, 2024

PIC OF THE DAY: కొడుకు, కూతురితో కోహ్లీ

image

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా ఆయన భార్య అనుష్క శర్మ ఇన్‌స్టాలో ఓ ఫొటోను షేర్ చేశారు. కూతురు వామిక, కొడుకు అకాయ్‌తో కోహ్లీ సరదాగా గడిపిన సందర్భాన్ని ఫొటోలో చూపించారు. అయితే, ఇద్దరు పిల్లల ముఖాలు కనిపించకుండా స్టిక్కర్‌తో కవర్ చేశారు. ఈ ఫొటోను కోహ్లీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

News November 5, 2024

విద్యార్థినులను పరామర్శించిన మంత్రులు పొన్నం, సురేఖ

image

TG: ఫుడ్ పాయిజన్‌తో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ విద్యార్థినులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

News November 5, 2024

కొన్ని రోజులు ఢిల్లీలో ఉండండ‌ని మీరే అంటారు: ప‌్రియాంకా గాంధీ

image

వ‌య‌నాడ్‌లో ప్రియాంకా గాంధీ గెలిస్తే తరువాత నియోజకవర్గంలో పెద్దగా కనిపించరని వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ఆమె కొట్టిపారేశారు. తన కుమారుడు బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్న‌ప్పుడు అతణ్ని చూసేందుకు నిత్యం వెళ్లేదాన్నని, అయితే కొన్ని రోజులకు రావడం తగ్గించండని ప్రిన్సిపల్ కోరారని తెలిపారు. ఆ ప్రిన్సిపల్ మాదిరిగానే ఇక్కడికి రావడం త‌గ్గించి ఢిల్లీలో ఉండండని వయనాడ్ ప్రజలు చెప్పే రోజు వ‌స్తుందన్నారు.

News November 5, 2024

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉంది?

image

డుగ్.. డుగ్ అని సౌండ్ చేస్తూ రోడ్డుపై వెళ్తోన్న వారి చూపును అట్రాక్ట్ చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను లాంఛ్ చేసింది. రాయల్ ఎన్​ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరుతో లాంఛ్ అయిన ఈ బైక్ 2026లో అందుబాటులోకి రానుంది. ఇది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం వాడిన ఒరిజినల్ ఫ్లయింగ్ ఫ్లీ బైక్ నుంచి ప్రేరణ పొందింది. ఇంజిన్ ఉండే చోట బ్యాటరీని ఉంచారంతే. 100 KM రైడింగ్ రేంజ్ ఉండొచ్చు.