India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశంలోనే తొలిసారిగా APలో రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి విడతలో పౌరులకు దేవదాయ, ఎనర్జీ, APSRTC, రెవెన్యూ, అన్న క్యాంటీన్, CMRF, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లోని 161 సేవలు అందించనుంది. త్వరలోనే మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సాప్‌లోనే ప్రభుత్వ సేవలు పొందుతారని సీఎం చంద్రబాబు చెప్పారు.

హిందూ జాతీయవాదం (హిందుత్వ), ఖలిస్థానీ తీవ్రవాదాన్ని దేశంలో పెరుగుతున్న ముప్పుగా UK పరిగణిస్తోందని The Guardian కథనాన్ని ప్రచురించింది. ఇటీవల లీకైన హోం శాఖ నివేదిక ప్రకారం హిందుత్వాన్ని మొదటిసారిగా ఆందోళనకరమైన ఐడియాలజీగా UK గుర్తించింది. 2022లో Ind-Pak ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా బ్రిటిష్ హిందూ- బ్రిటిష్ ముస్లింల మధ్య లీసెస్టర్‌లో జరిగిన అల్లర్ల తర్వాత హిందుత్వాన్ని ముప్పుగా చేర్చారు.

AP: రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రానికి చెందిన శకటానికి తృతీయ బహుమతి రావడంపై CM చంద్రబాబు, Dy.CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడంపై CM అభినందనలు తెలిపారు. 30 ఏళ్ల తర్వాత RD పరేడ్‌లో బహుమతి వచ్చిందని చెప్పారు. మరోవైపు, హస్తకళలు చాటేలా శకటం ప్రదర్శన, బహుమతి రావడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏటికొప్పాక శకటానికి SMలో సైతం పెద్దఎత్తున మద్దతు లభించిన విషయం తెలిసిందే.

HYD మీర్‌పేటలో భార్యను <<15292119>>ముక్కలుగా <<>>నరికి ఉడికించిన కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అతడే హత్య చేసినట్లు పోలీసులు సాక్ష్యాలను న్యాయమూర్తి ముందు ఉంచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నెల 16న మాధవిని చంపి శవాన్ని ముక్కలుగా చేసి ఉడికించి ఆ తర్వాత ఎముకల్ని దంచి పొడిగా మార్చాడు. బూడిదను చెరువులో పడేశాడు.

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను అర్హులందరికీ ఇవ్వకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయకపోవడం బాధాకరమని సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. కేంద్రమే ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తోందని, కార్డులపై మోదీ ఫొటో ఉండాలని డిమాండ్ చేశారు. ప్రధాని ఆవాస్ యోజన ఇళ్లకు అదే పేరు కొనసాగించాలన్నారు.

కేరళలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్‌షీట్‌పై వారాన్ని మెన్షన్ చేయడాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రశంసించారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలోనూ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు సిద్ధమైనట్లు ట్వీట్ చేశారు. వారంతో పాటు రంగులను ఏర్పాటు చేసినట్లు తెలుపుతూ ఫొటోలు పంచుకున్నారు. దీనిపై అభిప్రాయం తెలపాలని కోరారు. ఇలా వారాన్ని మెన్షన్ చేస్తే రోజూ బెడ్‌షీట్ చేంజ్ చేస్తారు.

భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ICC T20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. నిన్న ENGపై 5 వికెట్లతో అదరగొట్టి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. 3 T20ల్లో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి 7.08 ఎకానమీతో 10వికెట్లు తీశారు. ఈ క్రమంలోనే 25 ర్యాంకులు ఎగబాకి 5వ స్థానానికి చేరారు. అలాగే T20ల్లో కుల్దీప్, భువీ తర్వాత 2సార్లు 5వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గానూ నిలిచారు.

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిజన్‌లో జరిగిన ప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించినట్లు జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ తెలిపింది. అధికారులతో టచ్‌లో ఉన్నామని మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొంది. ఘటనపై విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది.

AP: చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందని ప్రచారం చేసిన SM ప్రతినిధులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు TTD వెల్లడించింది. ఆయనకున్న క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రకారం JAN 14న దర్శనం చేయించామంది. అవాస్తవాలు ప్రచారం చేసినందుకు పోలీసు కేసుతో పాటు PIB(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. TTD ప్రతిష్ఠను పలుచన చేసేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.

AP: సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారమైందని, CM చొరవతో కోర్టు కేసుల విత్‌డ్రాకు ఇరుపక్షాలు అంగీకరించాయని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములు ఆక్రమించి 12,149 ఇళ్లు కట్టుకున్నారని, భూముల క్రమబద్ధీకరణకు గతంలోనూ ప్రయత్నించామన్నారు. ఆక్రమించిన 420ఎకరాలకు బదులు 610ఎకరాలను దేవస్థానానికి బదలాయిస్తున్నట్లు చెప్పారు. వాటి విలువ రూ.5,300cr వరకు ఉంటుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.