News January 29, 2025

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

image

TG: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మరణించాడు. చికాగోలో జరిగిన ప్రమాదంలో ఖైరతాబాద్‌కు చెందిన మహమ్మద్ వాజిద్ మృతిచెందాడు. వాజిద్ యువజన కాంగ్రెస్ నేతగా ఉన్నాడు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లాడు.

News January 29, 2025

యమునా వాటర్ వ్యాఖ్యలు.. కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

image

ఢిల్లీకి అందే యమునా నది నీటిలో హరియాణా విషం కలుపుతోందని ఆరోపించిన‌ ఆప్ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్‌పై సోనిప‌ట్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపాయి. అధికార-విప‌క్షాలు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌కు దిగాయి. కేజ్రీవాల్ వ్యాఖ్య‌లు జాతికే అవ‌మానం అని ప్ర‌ధాని మోదీ దుయ్యబట్టారు. హరియాణా CM నాయబ్ సింగ్ యమునా నది నీటిని తాగి ఆరోపణలను తిప్పికొట్టారు.

News January 29, 2025

వచ్చే నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

image

AP: ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. FEB నెలాఖరులో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

News January 29, 2025

రూ.300 కోట్లకు చేరువైన ‘సంక్రాంతికి వస్తున్నాం’

image

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. విడుదలైన 15 రోజుల్లోనే రూ.300 కోట్ల వసూళ్లకు చేరువైనట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని పేర్కొన్నారు. సంక్రాంతికి విడుదలై అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ప్రాంతీయ సినిమాగా ఇప్పటికే చరిత్ర సృష్టించింది.

News January 29, 2025

చంద్రబాబు కుట్రలు ప్రజలకు తెలుసు: పెద్దిరెడ్డి

image

AP: తాము 2001లో కొనుగోలు చేసిన భూములకు రెవెన్యూ శాఖ సర్వే చేసిందని, వాటిని ఇప్పుడు అటవీ భూములు అంటున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలుసని విమర్శించారు. అలాగే, ఎంతమంది YCP నుంచి వెళ్లినా పార్టీకి ఏం కాదన్నారు. VSR రాజీనామా ఆయన వ్యక్తిగతం అని చెప్పారు. పెద్దిరెడ్డి భూములపై ఆరోపణలు రాగా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

News January 29, 2025

ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి రాంప్రసాద్ ఏమన్నారంటే?

image

ఏపీలో త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై ముగ్గురు మంత్రులతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. కాగా వచ్చే నెల 6న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది.

News January 29, 2025

ప్రైవేట్ జూనియర్ కాలేజీల కీలక నిర్ణయం

image

తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్ పరీక్షలకు సెంటర్లు ఇవ్వొద్దని నిర్ణయించాయి. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించాయి. ఫీజుల చెల్లింపులో కాలేజీలకు ఫైన్ వేయడాన్ని ఖండిస్తున్నామని, ప్రాక్టికల్స్‌కు సీసీ కెమెరాల నిబంధన సరికాదన్నాయి. కార్పొరెట్ కాలేజీలకు బోర్డు అధికారులు ఏజెంట్లుగా మారారని విమర్శించాయి.

News January 29, 2025

కంచి తరహాలో మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్

image

AP: మంగళగిరిలోని ఆటో‌నగర్‌‌లో మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటుకు CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ చర్యలు చేపట్టారని మంత్రి సవిత తెలిపారు. 10.80 ఎకరాల్లో పార్కు ఏర్పాటుకు ఇవాళ స్థలాన్ని పరిశీలించిన ఆమె మాట్లాడారు. TNలోని కంచి తరహాలో పార్కును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 365 రోజులూ చేనేత కార్మికులకు పని కల్పిస్తామని చెప్పారు. YCP పాలనలో సాయం అందక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

News January 29, 2025

ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీరు ఇవ్వాల్సిందే: మంత్రి సీతక్క

image

TG: వేస‌వి ముగిసే వ‌ర‌కు నీటి ఎద్ద‌డి లేకుండా ప్ర‌తి మనిషికి రోజుకు 100 లీట‌ర్ల నీరు అందించేలా మిష‌న్ భ‌గీర‌థ సిబ్బంది క‌ృషి చేయాల‌ని మంత్రి సీత‌క్క ఆదేశించారు. ఈ పథకానికి వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజలెందుకు ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదో అధ్యయనం చేయాలన్నారు. Feb 1-10 తేదీల మ‌ధ్య స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించి మిషన్ భగీరథ నీళ్లు వాడేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాల‌ని సూచించారు.

News January 29, 2025

విమానం కూలి 18 మంది మృతి!

image

దక్షిణ సూడాన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. యునిటీ స్టేట్ నుంచి జుబా వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలింది. ఈ ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో 21 మంది ప్రయాణికులు, సిబ్బంది విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది.