News October 29, 2025

పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలి: CBN

image

AP: వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్ని వేగంగా చేపట్టాలని CM CBN ఆదేశించారు. నీరు నిలవకుండా డ్రైనేజీల్ని పటిష్ఠం చేయాలన్నారు. విద్యుత్తు సరఫరా, రహదారుల పునరుద్ధరణ పనులను తక్షణమే చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లోని వారికి నిత్యావసరాలు అందించాలన్నారు. కాగా రాష్ట్రంలో 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లోని 18 లక్షల మందిపై తుఫాను ప్రభావం పడిందని అధికారులు వివరించారు.

News October 29, 2025

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. BJP అభ్యంతరం!

image

TG: అజహరుద్దీన్‌కు <<18140326>>మంత్రి<<>> పదవి ఖాయమని జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చాక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముందు రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

News October 29, 2025

నియోజకవర్గమంతా ఒకే డివిజన్‌లో ఉండేలా చర్యలు: మంత్రి అనగాని

image

AP: గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్విభజనలోని లోపాలను సవరించడంపై క్యాబినెట్ సబ్‌ కమిటీ ఇవాళ చర్చించింది. CM ఆదేశాలు, మంత్రులు ఇచ్చిన సూచనలను పరిశీలించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మండల, పంచాయతీలను విభజించకుండా నియోజకవర్గమంతటినీ ఒకే డివిజన్‌లో ఉంచాలని నిర్ణయించామన్నారు. కాగా కేంద్రం చేపట్టే జనగణనకు ముందే విభజనపై నివేదికను అందిస్తామని మంత్రి మనోహర్ తెలిపారు.

News October 29, 2025

ఇక స్పామ్ కాల్స్‌‌కు చెక్.. TRAI నిర్ణయం!

image

ఇన్‌కమింగ్ కాల్స్‌ విషయంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. కాలర్ పేరు రిసీవర్ ఫోన్‌లో ఇకపై డిఫాల్ట్‌గా డిస్‌ప్లే కానుంది. ఈ మేరకు టెలికం శాఖ ప్రపోజల్‌కు TRAI ఆమోదం తెలిపింది. SIM తీసుకునేటప్పుడు ఇచ్చిన వివరాలను ‘కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్’ ఫీచర్ ద్వారా ప్రదర్శిస్తారు. ఇది అందుబాటులోకొస్తే TrueCaller వంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం ఉండదు. స్పామ్ కాల్స్‌ను అరికట్టడంలో ఇది ఉపయోగపడుతుందని TRAI చెప్పింది.

News October 29, 2025

భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

TG: మొంథా తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేపు పలు జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. అటు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో సెలవు ఇవ్వాలని విద్యార్థులు, పేరెంట్స్ కోరుతున్నారు.

News October 29, 2025

రాహుల్ గూండాలా మాట్లాడుతున్నారు: బీజేపీ

image

ఓట్ల కోసం <<18140008>>డాన్స్<<>> చేయమన్నా చేస్తారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. లోకల్ గూండాలా రాహుల్ మాట్లాడుతున్నారని మండిపడింది. ‘మోదీకి ఓటు వేసిన దేశంలోని ప్రతి పేద వ్యక్తిని రాహుల్ అవమానించారు. ఓటర్లను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’ అని విమర్శించింది. చొరబాటుదారులకు బహిరంగంగానే ఆయన అండగా నిలుస్తున్నారని ఫైరయింది.

News October 29, 2025

ప్రెగ్నెన్సీలో సూక్ష్మపోషకాలు తీసుకుంటున్నారా?

image

ప్రెగ్నెన్సీలో అదనపు పోషకాలు తీసుకోవడం తప్పనిసరి. ఇవే బిడ్డ శారీరక, మానసిక పెరుగుదల, రోగనిరోధకశక్తిని ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ తొలి 28రోజుల్లో తీసుకునే ఫోలిక్‌ ఆమ్లం బిడ్డలో నాడీలోపాలు రాకుండా చేస్తుంది. రక్తకణాల నిర్మాణానికి ఐరన్, దంతాలు, ఎముకల నిర్మాణానికి విటమిన్‌ D, కాల్షియం అవసరం. విటమిన్‌ A, అయొడిన్‌ శిశువు మెదడు, శారీరక పెరుగుదలకి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

News October 29, 2025

అలా అయితే బంగ్లాదేశ్‌కు వెళ్తా: షేక్ హసీనా

image

భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి మీడియాతో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే బంగ్లా ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నికవ్వాల్సిన అవసరం ఉందని రాయిటర్స్‌కు మెయిల్‌లో తెలిపారు. అవామీ లీగ్‌కు లక్షలాది మంది మద్దతిస్తున్నారని, తమ పార్టీని పోటీకి అనుమతించకుంటే 2027 ఎన్నికలను వారు బహిష్కరిస్తారన్నారు. చట్టబద్ధమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు అదుపులో ఉంటే బంగ్లా వెళ్తానని చెప్పారు.

News October 29, 2025

ఇతిహాసాలు క్విజ్ – 50 సమాధానాలు

image

1. తులసి దేవికి పూర్వ జన్మలో ఉన్న పేరు ‘బృందా దేవి’.
2. త్రిపురాంతకుడు అంటే ‘పరమ శివుడు’.
3. కర్ణుడి కవచకుండలాలను దానం చేయమని కోరిన దేవుడు ‘ఇంద్రుడు’.
4. వాక్కుకు అధిష్టాన దేవత వాగ్దేవి. అంటే సరస్వతీ దేవి.
5. పరశురాముడు తన తల్లి తలను తండ్రి ‘జమదగ్ని’ ఆజ్ఞ మేరకు నరికాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 29, 2025

హైదరాబాద్‌లో అతిపెద్ద మెక్‌ డొనాల్డ్స్‌ కేంద్రం ప్రారంభం

image

అంతర్జాతీయ ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్’ 1.56 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ‘గ్లోబల్ ఆఫీస్(గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌)’ను HYDలో ఏర్పాటు చేసింది. డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ప్రారంభించారు. అమెరికా బయట మెక్‌ డొనాల్డ్స్‌కు ఇదే అతిపెద్ద కేంద్రం. ఇది ఆ కంపెనీ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రైస్ ఆపరేషన్స్‌కు ‘గ్లోబల్ హబ్’గా పని చేయనుంది. 1200 మంది(హై స్కిల్డ్)కి ఉపాధి లభించనుంది.