India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డ్రగ్స్‌కి సంబంధించిన వార్తలు వచ్చినప్పుడల్లా బాగా వినిపించే పేరు కొకైన్. అయితే 1880ల్లో ఆస్ట్రియా న్యూరాలజిస్ట్ సెగ్మండ్ ఫ్రెడ్ దీనిపై అనేక పరిశోధనలు చేసి పలు చికిత్సలకు ఔషధంగా వాడారు. దీర్ఘకాలిక నొప్పి నుంచి ఉపశమనం కోసం తన స్నేహితుడికి కొకైన్‌ను ఇవ్వగా, అతను దానికి ఎడిక్ట్ అయ్యాడు. ఆ తర్వాత దీని డోస్ ఎక్కువై మరణాలు సంభవించడంతో కొకైన్‌ను ఔషధంగా వాడటం నిలిపివేశాడు.
➼డ్రగ్స్ ప్రాణాంతకం.
కేరళ, పంజాబ్, యూపీలో నవంబర్ 13న పలు అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నవంబర్ 20వ తేదీకి మార్చింది. కేరళలోని పాలక్కడ్, పంజాబ్‌లోని 4 స్థానాలు, యూపీలోని 9 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఈ తేదీ మార్పు వర్తిస్తుంది. Nov 13న మతపరమైన కార్యక్రమాలు ఉన్నందునా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తేదీ మార్పుపై బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు విజ్ఞప్తి చేసినట్టు EC వెల్లడించింది.
AP: ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాల్లో అమరావతి నిలిచేలా చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానితో మూడుముక్కలాట ఆడిందని విమర్శించారు. ప్రస్తుతం రూ.30వేల కోట్లకు సంబంధించి టెండర్ పనులు మొదలయ్యాయని తెలిపారు. డిసెంబర్ చివరికల్లా అన్ని టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. వరల్డ్ బ్యాంక్ రూ.15వేల కోట్ల రుణమిస్తోందని, 3ఏళ్లలో పనులు పూర్తి కావాలని CM ఆదేశించారన్నారు.
ఆస్ట్రేలియాతో జరిగే BGTలో రాణించకపోతే రోహిత్, విరాట్ టెస్టుల నుంచి రిటైర్ కావాలని భారత మాజీ బౌలర్ కర్సన్ గవ్రీ అభిప్రాయపడ్డారు. ‘ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశాన్ని ఓడించాలంటే సీనియర్లు రన్స్ చేయాల్సిందే. రోహిత్, విరాట్ భారత క్రికెట్‌కు చాలా చేశారు. కానీ జట్టు గెలవాలంటే రన్స్ కావాలి. భవిష్యత్ కోసం కొత్త జట్టును నిర్మించాలి. పర్ఫార్మెన్స్ ఇవ్వకుంటే ఎంతకాలం టీంలో ఉంచుతారు’ అని ప్రశ్నించారు.
DMKను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొందరు కొత్త పార్టీలు స్థాపిస్తున్నారని దళపతి విజయ్‌ను సీఎం స్టాలిన్ పరోక్షంగా విమర్శించారు. ‘ఎవరైతే కొత్త పార్టీ స్థాపిస్తున్నారో వారు DMK ఆదరణను చూసి ఓర్వలేక పార్టీ నాశనాన్ని కోరుకుంటున్నారు. మాకు ఈ అంశాల గురించి ఆందోళన లేదు. ప్రజలకు మంచిపనులు చేయడం కోసమే మా ప్రయాణం. ఇలాంటి అనవసర విషయాలకు సమయం వృథా చేయడం మాకు ఇష్టం లేదు’ అంటూ విజయ్‌ను టార్గెట్ చేశారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ఎందుకు చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. గత BRS ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ఆ రిపోర్ట్ ఇవ్వకపోతే ఆ సర్వేకు చేసిన ఖర్చంతా ఆయన నుంచే రికవరీ చేయాలన్నారు. KCR, KTRలను చూస్తుంటే రాజకీయాలపై అసహ్యం కలుగుతోందని మండిపడ్డారు. రుణమాఫీ చేయలేదని, ఉద్యోగాలు, ఇతర హామీలపై సమాధానం చెప్తూ కేటీఆర్ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.
AP: హోంమంత్రి అనితను ఉద్దేశిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. హోం మంత్రికి హోంలోనే(కూటమిలో) అసంతృప్తి మొదలైందని ట్వీట్ చేశారు. దానికి సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను ట్యాగ్ చేశారు. అటు వైసీపీ శ్రేణులు సైతం కూటమి చీలిపోతోందని, అనిత హోంమంత్రిగా విఫలమయ్యారంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.
మహారాష్ట్రలో రెబల్స్ వెనక్కి తగ్గలేదు. సోమవారంలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవాలన్న ఆయా పార్టీల అధినేతల ఆదేశాలను బేఖాతరు చేస్తూ బరిలో నిలిచేందుకే మొగ్గుచూపారు. మహాయుతి తరఫున 36 మంది, మహా వికాస్ అఘాడీ తరఫున 26 మంది రెబల్స్ బరిలో ఉన్నారు. పోటీలో ఉంటే ఆరేళ్లు పార్టీ నుంచి బహిష్కరిస్తామని బీజేపీ హెచ్చరించింది. నామినేషన్ల ఉపసంహరణపై శరద్ పవార్, ఉద్ధవ్ అల్టిమేటం ఇచ్చినా రెబల్స్ వెనక్కి తగ్గలేదు.
పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో ఓటమి తప్పదనుకున్న దశలో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ బ్యాట్‌తో మెరిశారు. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 155కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ కమిన్స్ బౌలర్లతో కలిసి లక్ష్యాన్ని ఛేదించారు. 31 బంతుల్లో 32 పరుగులతో రాణించారు. అంతకుముందు షాహీన్ అఫ్రిదీ (24), నసీమ్ షా (40) చివర్లో రాణించడంతో పాక్ 203 రన్స్ చేసింది.
AP: నిత్యావసరాల వస్తువుల ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలపై భారం పెరగకుండా చూస్తామని తెలిపారు. ఈమేరకు నిత్యావసరాల ధరల పర్యవేక్షణపై సచివాలయంలో సమీక్షించారు. రైతు బజార్లలో ధరల పట్టికల ప్రదర్శన, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. సమీక్షలో పలువురు మంత్రులు, వ్యవసాయ, ఆర్థిక, పౌరసరఫరాల, మార్కెటింగ్‌శాఖల అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.