India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KKR రిటెన్షన్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో కన్నీళ్లు వచ్చాయని టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తెలిపారు. తనను ఎందుకు రిటైన్ చేసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. ఆ జట్టుకు ఆడినన్ని రోజులు విజయం కోసం తీవ్రంగా శ్రమించానని ఆయన వ్యాఖ్యానించారు. వేలంలో మళ్లీ తనను ఆ జట్టు కొనుగోలు చేయొచ్చేమోనని అభిప్రాయపడ్డారు. కాగా అయ్యర్ KKR తరఫున గత సీజన్‌లో 370 రన్స్ చేశారు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
AP: ఉచిత సిలిండర్ పేరిట అరకొరగా లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం ఎంపిక చేసిందని వైసీపీ దుయ్యబట్టింది. దీంతో దాదాపు అరకోటి మందిని పథకానికి దూరంగా ఉంచిందని Xలో ట్వీట్ చేసింది. శాడిస్ట్ చంద్రబాబు చెప్పేవన్నీ ‘గ్యాస్’ కబుర్లేనని విమర్శించింది. ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వడానికి రూ.4వేల కోట్లు అవసరమైతే ప్రభుత్వం రూ.2,684.75 కోట్లు ఇస్తోందని ఆరోపించింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. స్కార్పియో అదుపుతప్పి చెరువులో పడటంతో మైనర్ బాలిక సహా ఎనిమిది మంది మరణించారు. టర్నింగ్ దగ్గర స్కిడ్ అయి చెరువులోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. మృతులు లరిమా గ్రామానికి చెందినవారని చెప్పారు. సూరజ్‌పూర్ వెళ్తుండగా దబ్రి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
TG: ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సోకాల్డ్ ప్రజాపాలనలో పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందన్నారు. ఆసిఫాబాద్(D) వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న విద్యార్థిని పరిస్థితికి బాధ్యులెవరని ప్రశ్నిస్తూ ఓ న్యూస్ ఆర్టికల్‌ను Xలో షేర్ చేశారు.
అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమని Rasmussen Poll అంచనా వేసింది. ట్రంప్‌కు 297, కమలా హారిస్‌కు 241 ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని పేర్కొంది. స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, నార్త్ కరోలినా, విస్కన్సిన్, నెవడా, పెన్సిల్వేనియా, ఆరిజోనా, మిచిగాన్ రాష్ట్రాల్లో ట్రంప్ సత్తా చాటుతారని తెలిపింది. కాగా నవంబర్ 5న అగ్రరాజ్యంలో ఎన్నికలు జరగనున్నాయి.
AP: రాష్ట్రంలోని నగరాల్లో నిర్మించే 100 గజాల్లోపు ఇళ్లకు ప్లాన్ పర్మిషన్ అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే దీన్ని అమల్లోకి తెస్తామన్నారు. 300 గజాల్లోపు ఇళ్లకు సులభంగా ప్లాన్ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. భవన నిర్మాణ అనుమతుల విధానాలు పరిశీలించి పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 174 పరుగులకు ఆలౌటైంది. ఇవాళ ఆట ప్రారంభమైన కాసేపటికే కివీస్ తన చివరి వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో అజాజ్ పటేల్ క్యాచ్ ఔటయ్యారు. కివీస్ 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. కాగా ఈ టార్గెట్‌ను ఛేదించడం టీమ్ ఇండియాకు అంత సులభమేం కాదు. వాంఖడేలో ఇప్పటివరకు అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన రికార్డు సౌతాఫ్రికా (163vsIND) పేరిట ఉంది.
ఈ ఏడాది శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తులందరికీ రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. నవంబర్ చివరి నుంచి ప్రారంభమయ్యే యాత్రా సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సన్నిధానం, పంబ, అప్పచ్చిమేడు, నీలక్కల్ ఇతర ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సకూ ఏర్పాట్లు ఉంటాయని వివరించింది.
తమపై దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో 30,000 మంది హిందువులు రోడ్లెక్కారు. రాజధాని ఢాకాలో భారీ సంఖ్యలో ర్యాలీలు చేపట్టారు. మైనారిటీల రక్షణకు చట్టం, ప్రత్యేక మంత్రిత్వశాఖ, హిందూ సంఘాల నేతలపై దేశద్రోహం కేసుల ఎత్తివేత, తమకు ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు వంటి డిమాండ్లు చేస్తున్నారు. ప్రధాని పదవి నుంచి హసీనాను దించాక తమపై హింస, బెదిరింపులు పెరిగాయని, రక్షణ కల్పించాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడటంతో రాయలసీమకు కరవు బాధ తప్పింది. ఈ సీజన్లో శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్‌లోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 211 టీఎంసీల నీటిని తరలించారు. 2022లో గరిష్ఠంగా 183 టీఎంసీల నీటిని తరలించగా ఇప్పుడు దాని కంటే దాదాపు 30 టీఎంసీల జలాలను అధికంగా వాడుకున్నారు. తెలుగు గంగ, గాలేరు-నగరి, SRBC ద్వారా రాయలసీమలోని పలు రిజర్వాయర్లలో కృష్ణమ్మ నీటిని నింపారు.
Sorry, no posts matched your criteria.