News November 3, 2024

బండి సంజయ్‌కి మంత్రి పొన్నం కౌంటర్

image

TG: కాంగ్రెస్ హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ Xలో కౌంటర్ ఇచ్చారు. రైతులకు పింఛన్, 2 కోట్ల ఉద్యోగాలు, అకౌంట్లలో రూ.15 లక్షలు ఇలా BJP ఎగ్గొట్టిన హామీలు చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని దుయ్యబట్టారు.10 నెలల ప్రజా ప్రభుత్వంపై సంజయ్ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని, చేతనైతే తెలంగాణ హక్కులను కాపాడాలని హితవు పలికారు.

News November 3, 2024

ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం సబబే: హైకోర్టు

image

AP: నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందిన మహిళను సర్వీస్ నుంచి తొలగించడం సబబేనని హైకోర్టు తీర్పునిచ్చింది. రూ.లక్ష జరిమానా కూడా విధించింది. నెలలోపు విశాఖపట్నంలోని ఓంకార్ అండ్ లయన్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆ డబ్బును చెల్లించాలని ఆదేశించింది. వినికిడి లోపం ఉందని ఫేక్ సర్టిఫికెట్‌తో దివ్యాంగుల కోటాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సంపాదించిన ప్రకాశం జిల్లాకు చెందిన వెంకట నాగ మారుతిని విద్యాశాఖ తొలగించింది.

News November 3, 2024

ఇండియా ఏ ఓటమి

image

ఆస్ట్రేలియాతో జరిగిన అనధికారిక తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. ఆసీస్ 7 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. 224 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీని (88*), బ్యూ వెబ్‌స్టర్ (61*) రాణించారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్, మానవ్ సుతార్ తలో వికెట్ తీశారు.

News November 3, 2024

‘సదర్’కు రాష్ట్ర పండుగ హోదా

image

TG: రాష్ట్ర ప్రభుత్వం సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించింది. ఈ మేరకు ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జీవో జారీ చేసింది. HYD మినహా అన్ని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఎంపీ అనిల్ కుమార్ విజ్ఞప్తితో అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

News November 3, 2024

విశాఖను లింక్ చేస్తూ ORR: చంద్రబాబు

image

AP: విశాఖ నగర అభివృద్ధిపై కలెక్టరేట్‌లో CM చంద్రబాబు రివ్యూ చేశారు. నగరంలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం, నెల్లిమర్ల, భోగాపురం, అనకాపల్లి ప్రాంతాలను విశాఖకు అనుసంధానం చేస్తూ ORR నిర్మించేలా ప్లాన్ చేయాలని సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానించేలా రోడ్ల నిర్మాణం ఉండాలన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం 15% వృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.

News November 3, 2024

జనవరిలో కొత్త రేషన్ కార్డులు!

image

AP: నూతన సంవత్సర కానుకగా JANలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కార్డులు ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న కార్డులను రీడిజైన్ చేసి.. పాత, కొత్త లబ్ధిదారులందరికీ సరికొత్త డిజైన్‌తో అందజేయనుంది. పౌరసరఫరాల అధికారులు కొత్త డిజైన్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులున్నాయి.

News November 3, 2024

వ్యాయామానికి వెళ్లేటప్పుడు సెల్‌ఫోన్ వద్దు: వైద్యులు

image

వ్యాయామానికి వెళ్లేటప్పుడు సెల్‌ఫోన్, ఇయర్ ఫోన్స్ వదిలేయాలని డాక్టర్.శ్రీకాంత్ మిర్యాల సూచిస్తున్నారు. అవి లేకుండా వ్యాయామం చేయడం వల్ల జాగరూకతతో ఉండవచ్చని చెబుతున్నారు. తద్వారా వ్యాయామం చేసేటప్పుడు ఒంట్లో కదలికలు, ఊపిరి, చెమట వల్ల వచ్చే చిరాకు, అలసట, బరువులెత్తేటప్పుడు మనలోని సామర్థ్యం వంటివి అనుభూతి చెందవచ్చంటున్నారు. అవన్నీ మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని చెబుతున్నారు.

News November 3, 2024

గజినీలా ప్రవర్తిస్తోన్న చంద్రబాబు: వాలంటీర్లు

image

AP: తమకు ఇచ్చిన హామీలను మరచిపోయి సీఎం చంద్రబాబు గజినీలా వ్యవహరిస్తున్నారని వాలంటీర్లు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపించారు. తమ గౌరవ వేతనం రూ.10 వేలను ఎప్పుడు ఇస్తారని చంద్రబాబు, పవన్‌ను వారు ప్రశ్నించారు. తాము మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

News November 3, 2024

ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP: ఈ నెలాఖరుతో ఓటాన్ బడ్జెట్ ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున ఉ.10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో(నవంబర్-మార్చి) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలు 10 రోజుల పాటు కొనసాగే అవకాశముంది. పలు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టనుంది.

News November 3, 2024

INDvsNZ: బ్యాటర్లపైనే భారం

image

వాంఖడే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఫలితం నేడు తేలే ఛాన్సుంది. ప్రస్తుతం 9 వికెట్లు కోల్పోయిన కివీస్ 143 రన్స్ లీడ్‌లో ఉంది. ఆ జట్టుకు 150 రన్స్‌కి మించి లీడ్‌ ఇవ్వొద్దని భారత్ భావిస్తోంది. టార్గెట్‌ 150 రన్స్‌లోపు ఉంటే రోహిత్‌సేన కంఫర్టబుల్‌గా ఛేజ్ చేసే అవకాశం ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఇక మన బ్యాటర్లపైనే భారం ఉంది.