News November 2, 2024

కిషన్ రెడ్డికి ట్రీట్ ఇచ్చిన మెగాస్టార్

image

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ట్రీట్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా చిరు ఇంట్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. చిరంజీవిని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్లు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘మంచి మనిషి, మెగాస్టార్ చిరంజీవిని కలవడమంటే ఎప్పుడూ ఆనందమే. సామాజిక సేవతో పాటు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించిన సేవలు ఎంతో మందికి ఆదర్శం’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

News November 2, 2024

సంక్రాంతిలోపు సర్పంచ్ ఎన్నికలు: మంత్రి

image

TG: వచ్చే ఏడాది సంక్రాంతిలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు. రాబోయే నాలుగేళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని, సీఎం మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొందరు ప్రముఖ నాయకులు త్వరలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని చెప్పారు.

News November 2, 2024

HYD మెట్రో రెండో దశలో నిర్మించే కారిడార్లు ఇవే

image

కారిడార్-4: నాగోలు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు(36.8కి.మీ)
కారిడార్-5: రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్(11.6కి.మీ)
కారిడార్-6: MGBS నుంచి చాంద్రాయణగుట్ట(7.5కి.మీ)
కారిడార్-7: మియాపూర్ నుంచి పటాన్‌చెరు(13.4కి.మీ)
కారిడార్-8: ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్(7.1కి.మీ)
కారిడార్-9: శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ

News November 2, 2024

BREAKING: రెండో దశ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

image

TG: హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జీవో 196 జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 76.4 కి.మీ మేర రూ.24,269 కోట్ల వ్యయంతో దీనిని చేపడుతున్నారు. ఇందులో రాష్ట్ర వాటా, రూ.7,313 కోట్లు, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు, జికా, ఏడీబీ, ఎన్డీబీ వాటా రూ.11,693 కోట్లుగా ఉంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తారు.

News November 2, 2024

ప్ర‌సిద్ధ శైవ క్షేత్రాల‌కు స్పెష‌ల్ బ‌స్సుల‌ు: TGSRTC

image

కార్తీక మాసంలో ప్ర‌సిద్ధ శైవ క్షేత్రాల‌కు HYD నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని TGSRTC MD సజ్జనార్ తెలిపారు. ఈ నెల 15న అరుణాచ‌లానికి ప్ర‌త్యేక ప్యాకేజీని అందిస్తున్నామ‌ని, APలోని పంచారామాల‌కు ప్ర‌తి సోమ‌వారం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. http://tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. వివ‌రాల‌కు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్ర‌దించాల‌న్నారు.

News November 2, 2024

సంతానం విషయంలో చంద్రబాబు కరెక్ట్: అసదుద్దీన్

image

TG: ఎక్కువ మంది సంతానం ఉండాలని AP, TN CMలు చంద్రబాబు, స్టాలిన్ అంటున్నారని, కానీ అదే విషయాన్ని తానంటే రాద్ధాంతం చేసేవారని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘దక్షిణాదిలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారు. ఒక వేళ జనాభా ప్రకారం నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి ఎంతో నష్టం కలుగుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

News November 2, 2024

అన్నీ బాగున్నాయ్.. మీకేది నచ్చింది?

image

దీపావళి సందర్భంగా ప్రేక్షకులను అలరింపజేసేందుకు ఏకంగా నాలుగు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’, మలయాళ నటుడు దుల్కర్ నటించిన ‘లక్కీ భాస్కర్’, తమిళ నటుడు శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రముఖ కన్నడ హీరో శ్రీమురళి నటించిన ‘బఘీరా’ కూడా యావరేజ్‌గా నిలిచింది. ఇవన్నీ దీపావళి విజేతలుగా నిలిచాయి. మరి మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి.

News November 2, 2024

ముగిసిన రెండో రోజు ఆట.. పట్టు బిగించిన భారత్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఇవాళ ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 171/9 రన్స్ చేసింది. ఓవరాల్‌గా 143 పరుగుల లీడ్‌లో ఉంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలం ధాటికి కివీస్ బ్యాటర్లు పరుగులు రాబట్టలేకపోయారు. విల్ యంగ్ (51) ఒక్కరే అర్ధ సెంచరీ సాధించారు. జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు.

News November 2, 2024

మిరాకిల్ బేబీల గురించి తెలుసా?

image

గర్భిణి ప్రసవానికి ముందు మరణించినప్పటికీ కొన్నిసార్లు బిడ్డ బతుకుతుంటుంది. దీనిని Coffin birth లేదా Posthumous birth అంటారు. గర్భిణి మరణించడంతో గర్భాశయ ముఖద్వారం వ్యాకోచించదు. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం ద్వారా పిండాన్ని బయటకు తీస్తారు. ఇలాంటి వారిని ‘మిరాకిల్ బేబీ’గా పిలుస్తారు. అయితే, ఇది అన్ని రకాల మరణాల్లో సాధ్యం కాదని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలో ఏటా 3లక్షల మంది ప్రసవ సమయంలో చనిపోతున్నారు.

News November 2, 2024

వచ్చే ఏడాది గూగుల్ ఆండ్రాయిడ్ 16 విడుదల!

image

షెడ్యూల్ కంటే ముందే గూగుల్ ఆండ్రాయిడ్ 16 విడుదల చేయ‌నున్న‌ట్టు ఆ సంస్థ‌ ప్రకటించింది. 2025లో రెండు రిలీజ్‌లు ఉంటాయ‌ని తెలిపింది. వ‌చ్చే ఏడాది క్యూ2లో ప్ర‌ధాన‌ రిలీజ్‌ను, క్యూ4లో మైన‌ర్ అప్‌డేట్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలిపింది. పూర్తి సిస్టం అప్‌డేట్ అవ‌స‌రం లేకుండా ప్రాజెక్ట్ ట్రెబుల్, మెయిన్‌లైన్ వంటి ఇనిషియేటివ్స్‌తో ద్వారా కొత్త అప్‌డేట్స్ సుల‌భంగా యూజ‌ర్ల‌కు అందించే ఏర్పాట్లు చేస్తోంది.