News October 29, 2025

ఆవు పాల అభిషేకంతో కష్టాల నుంచి విముక్తి

image

కార్తీక మాసంలో శివారాధన గొప్ప ఫలితాలనిస్తుందని మనకు తెలిసిందే. అందుకే చాలామంది శివాలయాలకు వెళ్లి శివలింగాలకు అభిషేకాలు చేస్తుంటారు. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత పవిత్రమని పండితులు సూచిస్తున్నారు. ఈ అభిషేకం ద్వారా కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘గోమాత పాలు శుభాలకు, పవిత్రతకు చిహ్నం. ఈ అభిషేకం వల్ల శివుడు సంతృప్తి చెంది, జీవితంలో సుఖశాంతులు నెలకొనేలా ఆశీర్వదిస్తాడు’ అంటున్నారు.

News October 29, 2025

బీర, కాకరకాయలను ఎప్పుడు కోస్తే మంచిది?

image

బీరకాయలు రకాన్ని బట్టి 60 నుంచి 90 రోజులలో కోతకు వస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడే కోయాలి. కాయలను ముదిరిపోకుండా 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే కోయాలి. కాయలు ముదిరితే పీచు పదార్ధం ఎక్కువై మార్కెట్‌కి పనికి రాకుండా పోతాయి. కాయలను ఒక అంగుళం కాడతో సహా కోయాలి. కాకర పంట నాటిన 60-70 రోజులకు కోతకు వస్తుంది. కాయలను లేతగా ఉన్నప్పుడు, 3-4 రోజుల వ్యవధిలో కోయాలి. దీని వల్ల దిగుబడి పెరిగి మంచి ధర వస్తుంది.

News October 29, 2025

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 308 పోస్టులు

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ 308 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, వొకేషనల్ కోర్సు చదివిన అభ్యర్థులు NOV 15వరకు అప్లై చేసుకోవచ్చు. ITI అప్రెంటిస్‌లు 300 ఉండగా.. వొకేషనల్ అప్రెంటిస్‌లు 8 ఉన్నాయి. వయసు కనీసం 18ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలో మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:https://cochinshipyard.in/

News October 29, 2025

ఉపవాసంతో వృద్ధాప్యం దూరం

image

ఉపవాసం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. శరీరంలోని కణాలను రిపేర్ చేయడంతో పాటు నిద్ర, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను సరిచేస్తుందంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యఛాయలను దూరం చెయ్యడంలోనూ ఉపవాసం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు సిర్టుయిన్స్ ఉత్పత్తై వృద్ధాప్యప్రక్రియకు వ్యతిరేకంగా పనిచేస్తాయని చెబుతున్నారు.

News October 29, 2025

అజహరుద్దీన్‌కు హోంశాఖ!?

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత <<18140326>>అజహరుద్దీన్‌కు<<>> హోం, మైనారిటీ సంక్షేమ శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. అటు అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక మరో రెండు మంత్రి పదవులను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందని సమాచారం.

News October 29, 2025

NI-MSMEలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ 3 అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News October 29, 2025

తుఫాన్ నష్టంపై వేగంగా అంచనాలు: లోకేశ్

image

AP: ‘మొంథా’ ప్రభావంతో జరిగిన నష్టంపై వేగంగా ప్రాథమిక అంచనాలు రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, చెట్లు కూలి కరెంటు నిలిచిపోయిందని చెప్పారు. విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండి బాధితులకు సహాయాన్ని అందించాలని సూచించారు.

News October 29, 2025

నేను చిరు మూవీలో నటించట్లేదు: మాళవిక

image

చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నారనే ప్రచారాన్ని హీరోయిన్ మాళవికా మోహనన్ ఖండించారు. ‘ఏదో ఒకరోజు చిరంజీవి సార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు ఉంది. అయితే మెగా158లో నటిస్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రభాస్ ‘ది రాజాసాబ్’లో ఈ బ్యూటీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 2026 జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News October 29, 2025

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి

image

ఎల్లుండి తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్న అజహరుద్దీన్, ఆయన కుమారుడు అసదుద్దీన్‌తో భేటీలో సీఎం రేవంత్ మంత్రి పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మైనారిటీలు లేకపోవడంతో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. MLCగా అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపింది. దానికి ఆమోదం తెలపాల్సి ఉంది.

News October 29, 2025

‘మొంథా’ ఎఫెక్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం

image

TG: ‘మొంథా’ తుఫాను ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వరికోతల సమయం కావడంతో ఆరబోసిన ధాన్యానికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, రిజర్వాయర్ల నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలపై నుంచి రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. హైడ్రా, ఇతర రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.