India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లలో పశుసంపద భారీగా పెరిగిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ పేర్కొంది. దాదాపు రూ.2వేల కోట్ల వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. గుడ్ల ఉత్పత్తి రెట్టింపు కాగా మాంసం ఉత్పత్తిలోనూ గణనీయమైన అభివృద్ధి జరిగిందని వివరించింది. పశుసంపద, పాలు, గుడ్లు, మాంస ఉత్పత్తుల విలువ 2014-15లో రూ.2,824.57కోట్లు ఉండగా 2022-23 నాటికి అది రూ.4,789.09కోట్లుగా నమోదైనట్లు తెలిపింది.
నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభమైంది. పరమశివుడికి, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో పూజలు చేయడం ఎంతో శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరించడం వల్ల కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ నెలలో పవిత్ర నదుల్లో బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
AP: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించిన సందర్భంగా CM చంద్రబాబు లబ్ధిదారులకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు. మహిళలు తొలుత డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండానే సిలిండర్ అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘ప్రస్తుతం లబ్ధిదారులు డబ్బులు చెల్లిస్తే 2 రోజుల్లో ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. నేరుగా ఫ్రీ సిలిండర్ ఇచ్చేందుకు సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. త్వరలోనే వాటిని పరిష్కరిస్తాం’ అని తెలిపారు.
TG: సీఎం రేవంత్ ఆదేశాలతో HYD బాపూఘాట్‌లో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభమైనట్లు CMO వెల్లడించింది. ‘పట్నాలో 72 అడుగుల గాంధీ కాంస్య విగ్రహం ఉంది. గుజరాత్‌లో వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహ ఎత్తు 182 మీటర్లు. దీనికంటే ఎత్తయిన విగ్రహాన్ని ఎలా నిర్మించాలి? దండి మార్చ్‌కు కదిలినట్లు నిలబడి ఉండాలా? ధ్యాన ముద్రలో తయారుచేయించాలా? అనే దానిపై చర్చిస్తున్నాం’ అని పేర్కొంది.
AP: ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఇవాళ విశాఖలోని రుషికొండ భవనాలను పరిశీలించనున్నారు. గత ప్రభుత్వం రూ.500 కోట్లతో నిర్మించిన వీటిని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై సమాలోచనలు చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. కాగా ఈ భవనాలను నిర్మించడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
TG: వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ స్థానంలో ఉత్తమ్ లేదా భట్టివిక్రమార్కకు సీఎం పదవి దక్కొచ్చన్నారు. ఆ పార్టీలోని ఓ వర్గం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందని చెప్పారు. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ అడ్లూరి ఖండించారు.
AP: వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడిన విషయం తెలిసిందే.
వరుస పండుగల సందర్భంగా యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అక్టోబర్‌లో ట్రాన్సాక్షన్ల సంఖ్య 16.58 బిలియన్లు, విలువ రూ.23.5 లక్షల కోట్లుగా నమోదైనట్లు NPCI వెల్లడించింది. ఇప్పటి వరకు ఒక నెలలో ఇదే అత్యధికమని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన లావాదేవీల సంఖ్యలో 45 శాతం, విలువపరంగా 34 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది. రోజువారీ లావాదేవీలు 535 మిలియన్లుగా నమోదైనట్లు వివరించింది.
AP: శ్రీశైల మహాక్షేత్రంలో ఇవాళ్టి నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు భారీగా భక్తులు రానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన, హారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల ప్రారంభ సూచికగా ఆలయ ప్రాంగణంలో నేడు అర్చకులు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు.
మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా L2:ఎంపురాన్ మూవీ తెరకెక్కుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో మోహన్‌లాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టొవినో, దుల్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా లూసిఫర్‌ను తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో చిరంజీవి రీమేక్ చేశారు.
Sorry, no posts matched your criteria.