News November 2, 2024

ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ రోహిత్ బాల్ మృతి

image

ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ రోహిత్ బాల్ (63) గుండెపోటుతో మృతి చెందారు. హృద‌య సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న ఏడాదిగా బాధ‌ప‌డుతున్నారు. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుల్లో రోహిత్ ఒకరు. భార‌తీయ సంప్ర‌దాయ వ‌స్త్ర ముద్ర‌ణ క‌ల‌గ‌లిపి ఉండే ఆయ‌న ఆధునిక డిజైనింగ్ వస్త్రాలు విశేష ఆద‌ర‌ణ పొందాయి. ఆయ‌న ప‌నిత‌నంలోని ప్ర‌త్యేక‌త ముందు త‌రాల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని FDCI కౌన్సిల్ పేర్కొంది.

News November 2, 2024

అమెరికన్లలో మళ్లీ అవే భయాలు!

image

పెన్సిల్వేనియాలో ఓట్ల అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఆరోపణలు చేయడం ద్వారా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల్ని డొనాల్డ్ ట్రంప్ మళ్లీ స‌వాల్ చేయ‌వ‌చ్చ‌నే ఆందోళ‌న‌లు ఊపందుకున్నాయి. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల్ని సవాల్ చేస్తూ జ‌న‌వ‌రి 6, 2021న‌ త‌న అనుచ‌రుల‌తో క్యాపిట‌ల్ భ‌వ‌నం వ‌ద్ద ట్రంప్ చేసిన ఆందోళ‌న‌ల‌ను తాజా ఆరోప‌ణ‌లు గుర్తు చేస్తున్నాయ‌ని అంటున్నారు. అయితే, ఓట‌ర్ ఫ్రాడ్‌పై ఆధారాలు లేవ‌ని ఎన్నిక‌ల అధికారులు తేల్చారు.

News November 1, 2024

గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయింపు

image

TG: సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 837/1లో 211 ఎకరాలు కేటాయిస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రకటించింది. భూకేటాయింపులు జరపడంతో యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోనుంది.

News November 1, 2024

ఆ దేశంలో విడాకుల రేటు 94%?

image

ప్రపంచంలోనే అత్యధికంగా పోర్చుగల్‌లో విడాకుల రేటు 94%గా ఉన్నట్లు ఓ స్టడీ తెలిపింది. ఆ తర్వాత స్పెయిన్ (85%), లక్సెంబర్గ్ (79%), రష్యా (73%), ఉక్రెయిన్ (70%), క్యూబా (55%), ఫిన్‌లాండ్ (55%), బెల్జియం (53%), ఫ్రాన్స్ (51%), నెదర్లాండ్స్ (48%), కెనడా (47%), యూఎస్ (45%), చైనా (44%), యూకే (41%), జర్మనీ (38%), టర్కీ (25%), ఈజిప్టు (17%), ఇరాన్ (14%), తజికిస్థాన్ (10%), వియత్నాం (7%), ఇండియా (1%) ఉన్నాయి.

News November 1, 2024

దేవాలయాల ఆస్తుల రక్షణకు కార్యాచరణ

image

AP వ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ శాఖ పరిధిలో ఆక్రమణలు, అన్యాక్రాంతమైన భూముల వివరాలు తెలియజేయాలని ఆ శాఖ కమిషనర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ తరహాలో కార్యాచరణ రూపొందించాలన్నారు. ఐ.ఎస్.జగన్నాథపురం <<14505508>>ఆలయం<<>> 50 ఎకరాల భూమి రక్షణ కోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడ కొండ తవ్వకంపై విచారణకు ఆదేశించారు.

News November 1, 2024

గాజాలో 64 మంది, లెబనాన్‌లో 24 మంది మృతి

image

హమాస్, హెజ్బొల్లాతో కాల్పుల విరమణ అవకాశాలను కొట్టిపారేస్తూ ప్ర‌త్య‌ర్థుల‌పై ఇజ్రాయెల్ విచుకుప‌డింది. గాజా మ‌ధ్య‌, ద‌క్షిణ భాగాలే ల‌క్ష్యంగా శుక్ర‌వారం జ‌రిపిన దాడుల్లో 64 మృతి చెందారు. దీర్ అల్-బలహా, నుసెరాత్ శిబిరం, అల్-జవైదా పట్టణం వంటి ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. మ‌రోవైపు లెబ‌నాన్ రాజధాని బీరూట్ ద‌క్షిణ ప్రాంత‌మైన ద‌హియె, దేశ‌ ఉత్త‌ర ప్రాంతాల‌పై IDF జ‌రిపిన దాడిలో 24 మంది మృతి చెందారు.

News November 1, 2024

కూతురు పేరు వెల్లడించిన దీపికా పదుకొణె

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన కుమార్తె పేరును వెల్లడించారు. ఆమెకు ‘దువా పదుకొణె సింగ్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. దువా అంటే ప్రార్థన అని, మా ప్రార్థనలకు ఆమె సమాధానం’ అని దీపిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా 38 ఏళ్ల దీపిక.. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ సెప్టెంబర్‌లో పాప జన్మించింది.

News November 1, 2024

3 దశాబ్దాలుగా ఈ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగ్ పోలేదు

image

జపాన్‌లోని కాన్‌సాయ్ విమానాశ్రయంలో 30 ఏళ్లుగా ఒక్క ప్రయాణికుడి బ్యాగు కూడా మిస్ కాలేదు. ప్రతి రోజూ 3,000 బ్యాగులు చెక్ చేస్తున్నా 15 నిమిషాల్లోనే ప్రయాణికులకు అప్పగిస్తున్నారు. జపాన్‌లోనే రద్దీ ఎయిర్‌పోర్టుల్లో ఒకటైన కాన్‌సాయ్‌లో నిబంధనల వల్లే అవి మిస్ కావడం లేదు. ఇది ‘వరల్డ్స్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఫర్ బ్యాగేజీ డెలివరీ’గా నిలిచింది. ఈ విమానాశ్రయం నుంచి ఏటా 2.5 కోట్ల మంది ప్రయాణిస్తుంటారు.

News November 1, 2024

కులగణన.. మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్కూళ్లు

image

TG: ఈ నెల 6 నుంచి మొదలుపెట్టి 3 వారాల పాటు కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 80వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. 36,559 మంది SGTలతో పాటు 3414 ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్లు సహా మరికొందరిని ఇందుకోసం వినియోగించనుంది. అయితే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే SGTలకు మినహాయింపు ఇచ్చింది. ప్రైమరీ స్కూళ్లల్లో ఈ 3 వారాల పాటు ఉదయం 9 నుంచి మ.ఒంటి గంట వరకే క్లాసులు జరుగుతాయి.

News November 1, 2024

వేడి నూనె పాత్ర‌లో ప‌డ్డ ఫోన్.. బ్యాట‌రీ పేలి వ్య‌క్తి మృతి

image

వంట చేస్తూ చేతిలో ప‌ట్టుకున్న ఫోన్ వ్యక్తి ప్రాణం తీసింది. మ‌ధ్యప్ర‌దేశ్‌లోని భింద్ జిల్లాలో ఓ వ్యక్తి వంట చేస్తున్న స‌మ‌యంలో చేతిలో ఉన్న ఫోన్ జారి వేడివేడి నూనె పాత్ర‌లో ప‌డింది. దీంతో ఒక్క‌సారిగా బ్యాట‌రీ పేల‌డంతో వ్యక్తికి తీవ్ర గాయాల‌య్యాయి. మెరుగైన వైద్యం కోసం గ్వాలియ‌ర్ త‌ర‌లిస్తుండ‌గా సింధ్ న‌దిపై ట్రాఫిక్ జాంతో అంబులెన్స్ ఆల‌స్యంగా ఆస్ప‌త్రికి చేరుకుంది. బాధితుడు అప్పటికే మృతి చెందాడు.