News November 1, 2024

రేపటి నుంచి కొత్త కార్యక్రమం

image

APలో రేపటి నుంచి గుంతల రహిత రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు VZM(D) గజపతినగరంలో ప్రారంభిస్తారు. రూ.860 కోట్లతో జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని రోడ్లను గుంతల రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభిస్తారు. ఇందులో అధునాతన విధానాలు అవలంభించేలా SRM యూనివర్సిటీ, ఐఐటీ తిరుపతితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

News November 1, 2024

కాంగ్రెస్ గ్యారంటీలపై మోదీ విమర్శలు.. తెలంగాణపై కూడా

image

కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు ఇస్తూ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను దిగజార్చుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. ప‌థ‌కాల‌ ప్ర‌క‌టనపై క‌ర్ణాట‌క నేత‌ల‌కు ఖ‌ర్గే స‌ల‌హా ఇవ్వ‌డంపై మోదీ స్పందించారు. త‌ప్పుడు వాగ్దానాలు ఇవ్వ‌డం సుల‌భ‌మే అని, వాటిని అమ‌లు చేయ‌డం అసాధ్య‌మ‌న్న విష‌యం ఇప్పుడు కాంగ్రెస్‌కు అర్థ‌మవుతోందని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రభుత్వాల ఆర్థిక స్థితి క్షీణిస్తోందన్నారు.

News November 1, 2024

శ్రమించి.. విజయాన్ని ముద్దాడి!

image

విజయాన్ని ముద్దాడటం అంత ఈజీ కాదు. దానికోసం ఎంతో శ్రమించాలి. అలా శ్రమించి విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ యంగ్ ప్లేయర్లు. IPL-2025 రిటెన్షన్‌లో వీరిని రూ.కోట్లు వరించాయి. రింకూ సింగ్‌ను గతేడాది రూ.55 లక్షలకు కొంటే ఇప్పుడు రూ.13 కోట్లు, గతేడాది రూ.20లక్షలు పొందిన ధ్రువ్ జురెల్ ఇప్పుడు రూ. 14 కోట్ల జీతం పొందారు. రజత్ & మయాంక్ ఇద్దరూ గతేడాది రూ.20 లక్షలు పొందితే 2025 IPLలో రూ.11 కోట్లు రానున్నాయి.

News November 1, 2024

GST Collections: అక్టోబర్‌లో భారీగా వసూళ్లు

image

Oct జీఎస్టీ వ‌సూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.87 ల‌క్ష‌ల కోట్లుగా న‌మోద‌య్యాయి. గ‌త ఏడాది ఇదే నెల‌తో పోలిస్తే 9 శాతం వృద్ధి న‌మోదైంది. ఈ మొత్తంలో ఎస్జీఎస్టీ రూ.41 వేల కోట్లు, సీజీఎస్టీ రూ.33 వేల కోట్లు, ఐజీఎస్టీ ద్వారా రూ.99 వేల కోట్లు స‌మ‌కూరాయి. సెస్సుల రూపంలో మ‌రో రూ.12 వేల కోట్లు వ‌సూల‌య్యాయి. ఈ వృద్ధి పండుగ సీజన్‌లో అమ్మకాలు, పన్ను చెల్లింపుల వల్లే సాధ్యమైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

News November 1, 2024

ఎగబడి కొన్నారు.. అంతలోనే వదిలేశారు..!

image

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను గత ఐపీఎల్ వేలంలో KKR ఎగబడి మరీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా రూ.24.75 కోట్లు పెట్టి దక్కించుకుంది. కానీ పట్టుమని పది నెలలు కూడా గడవకముందే అతడిని వదిలేసింది. గత సీజన్‌లో ఫెయిల్ కావడం వల్లే ఆ ఫ్రాంచైజీ వదిలేసినట్లు టాక్. కాగా ఈ నెలలో జరగబోయే మెగా వేలంలో స్టార్క్‌ను దక్కించుకునేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

News November 1, 2024

జేఎంఎం మొత్తం ఓ న‌కిలీ వ్య‌వ‌స్థ‌: హిమంత బిశ్వ

image

ఝార్ఖండ్ ముక్తి మోర్చా మొత్తం ఓ న‌కిలీ వ్య‌వ‌స్థ అని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ విమ‌ర్శించారు. CM హేమంత్ సోరెన్ వ‌య‌సుపై వివాదం రేగ‌డంపై ఆయ‌న స్పందించారు. ‘JMM వ్యవస్థ మొత్తం నకిలీ. అఫిడవిట్‌ను ప‌రిశీలిస్తే సోరెన్ వ‌య‌సు కూడా పెరిగింది. ఇది చొర‌బాటుదారుల‌ ప్రభుత్వం. JMMను తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ఎవరూ సురక్షితంగా ఉండరు. ప్రజలు బాధ్యతగా వారిని గ‌ద్దెదించాలి’ అని శర్మ పిలుపునిచ్చారు.

News November 1, 2024

IED బాంబు పేల్చిన ఉగ్రవాదులు.. ఏడుగురు మృతి

image

పాక్ బ‌లూచిస్తాన్ ప్రావిన్సులో ఉగ్రవాదులు రిమోట్ కంట్రోల్డ్ IED బాంబును పేల్చిన ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతిచెందారు. మ‌స్తాంగ్ జిల్లాలోని సివిల్ ఆస్పత్రి చౌక్ వ‌ద్ద పోలీసు వ్యాన్‌ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. ముందుగానే పార్కింగ్ చేసిన బైక్‌లో బాంబులు ఉంచి రిమోట్ కంట్రోల్‌తో వాటిని పేల్చిన‌ట్టు మస్తాంగ్ DPO ఉమ్రానీ తెలిపారు. మృతుల్లో ఐదుగురు స్కూల్ పిల్ల‌లు, ఒక పోలీసు ఉన్నారు. మ‌రో 17 మంది గాయ‌ప‌డ్డారు.

News November 1, 2024

ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసే వారికి ప్రభుత్వ రక్షణ

image

AP: ఉద్యోగుల అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, ఫిర్యాదులు, కేసులు పెట్టేవారికి రక్షణ కల్పించనుంది. నోడల్ అధికారిగా ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డాను నియమించింది. ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసే వారికి అండగా ఉండేలా నోడల్ అధికారి కార్యాచరణ రూపొందించనున్నారు. వివరాలకు 0866-2428400/2974075 నంబర్లకు ఫోన్ చేయండి.

News November 1, 2024

అప్పుడే 6.20 కోట్ల మంది అమెరికన్లు ఓటేశారు

image

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అప్పుడే 6.20 కోట్ల మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. మ‌న ద‌గ్గ‌ర పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల మాదిరిగా అమెరికాలో ఎర్లీ ఓటింగ్‌కు అవ‌కాశం ఉంది. దీంతో స్థానిక ఓటర్లు ఈ-మెయిల్ లేదా వ్య‌క్తిగ‌తంగా హాజ‌రై త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో దాదాపు 24.4 కోట్ల మంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నిక‌ల్లో 66% పోలింగ్ జ‌రిగింది.

News November 1, 2024

కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులపై కీలక ప్రకటన

image

APలో త్వరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిపై కార్యాచరణ రూపొందిస్తామని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. SKLM(D) ఈదుపురం సభలో ఆయన ప్రసంగించారు. ‘విశాఖ రైల్వే జోన్‌కు లైన్ క్లియర్ చేశాం. రేపో, ఎల్లుండో భూమిపూజ చేస్తాం. టెక్కలి/పలాసలో ఎయిర్‌పోర్టు తీసుకొస్తాం. మూలపేటలో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం’ అని హామీ ఇచ్చారు.