News October 29, 2025

మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

image

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News October 29, 2025

పాక్‌కు చెంపపెట్టులాంటి ఫొటో.. శివాంగీతో ముర్ము

image

అంబాలా ఎయిర్ బేస్‌లో రఫేల్‌ రైడ్‌ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్క్వాడ్రన్ లీడర్ శివాంగీ సింగ్‌తో ఫొటో దిగారు. శివాంగీ రఫేల్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పైలట్. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత రఫేల్ జెట్లు కూల్చేశామన్న పాక్.. పైలట్ శివాంగీని ప్రాణాలతో బంధించామని ప్రచారం చేసింది. కానీ ఇవాళ రాష్ట్రపతి ఆమెతో ఫొటో దిగి పాక్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ ఫొటో దాయాదికి చెంపపెట్టులాంటిదనే చెప్పాలి.

News October 29, 2025

ధ్వజస్తంభం లేని గుళ్లలో ప్రదక్షిణ చేయకూడదా?

image

‘దాదాపు అన్ని ఆలయాల్లో గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. దీని ప్రతిష్ఠాపన వైభవంగా చేస్తారు. ధ్వజస్తంభం కూడా ఆలయ శక్తిలో భాగమే. అయితే కొన్ని ఆలయాల్లో ధ్వజస్తంభం ఉండదు. వాటిని వాయు ప్రతిష్ఠ ఆలయాలు అంటారు. అలాంటి చోట్ల నిత్య పూజ, నైవేద్యాలు తప్పనిసరి కాదు. ధ్వజస్తంభం ఉన్నా, లేకపోయినా గుడిలో ప్రదక్షిణ చేయవచ్చు. ఇంట్లో తులసి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే ఇది కూడా శుభప్రదం’ అని పండితులు చెబుతున్నారు.

News October 29, 2025

18 ఓవర్లకు కుదింపు

image

వర్షం ఆగిపోవడంతో ఆస్ట్రేలియా-భారత్ తొలి టీ20 మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
*ఇన్నింగ్స్ 18 ఓవర్లకు కుదింపు
*ముగ్గురు బౌలర్లు 4 ఓవర్ల చొప్పున వేయొచ్చు
*ఇద్దరు బౌలర్లు 3 ఓవర్లు వేయొచ్చు
*పవర్ ప్లే 5.2 ఓవర్ల వరకు
> ప్రస్తుతం భారత్ స్కోర్ 5 ఓవర్లకు 43/1గా ఉంది. అభిషేక్ 19 రన్స్ చేసి ఔటయ్యారు. క్రీజులో గిల్ (16*), సూర్య (8*) ఉన్నారు.

News October 29, 2025

‘తులసి బాసో’ వరి రకం ప్రత్యేకతలు ఇవే

image

తులసి బాసో ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర దేశీయ వరి రకం. దీనిలో ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఖరీఫ్‌కి మాత్రమే అనువైన రకం. 135 రోజుల తర్వాత ఎకరాకు 15-18 క్వింటాళ్లు, రెండవ కోతకు 6-8 క్వింటాళ్లు, మూడో కోతకు 5-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొదటి కోతకి మూడో కోతకు గింజ పరిమాణం, సువాసన ఏమాత్రం తగ్గదు. ఎంతటి గాలులనైనా తట్టుకొని పంట ఒరగదు. రైతు ఫోన్ నెంబరు 6300027502, 9440809364.

News October 29, 2025

Swiggy & Zomato: ఒక్కో ఆర్డర్‌పై రూ.100 ఫీజు?

image

జొమాటో, స్విగ్గీ వినియోగదారులకు భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌కు రూ.100 -150 వరకు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం ప్లాట్‌ఫామ్ ఫీజు, ప్యాకేజింగ్ ఛార్జెస్, రెయిన్ ఫీజు, అలాగే వీటిపై GSTని వసూలు చేస్తున్నాయి. వీటికి బదులు ఇకపై ఒకే ఛార్జ్‌ను వసూలు చేస్తాయని వార్తలొస్తున్నాయి. దీనిపై సంస్థలు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

News October 29, 2025

దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

image

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్‌రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News October 29, 2025

గాజాపై దాడులు.. 60 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 60 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించడంతో సైన్యం 3చోట్ల బాంబుల వర్షం కురిపించింది. కాగా బందీల మృతదేహాల అప్పగింతకు ఉద్రిక్త పరిస్థితులు అడ్డంకిగా ఉన్నట్లు హమాస్ పేర్కొంది. హమాస్ ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం వల్లే దాడి జరిగిందని, ఇది శాంతికి విఘాతం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

News October 29, 2025

కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

image

అధిక వర్షపాతం ఉన్న సమయంలో ఈ ఆకుగూడు పురుగు పంటను ఆశిస్తుంది. కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆశిస్తుంది. లార్వాలు చిగురాకులను, ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్‌ 36% యస్‌.యల్‌ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలి.

News October 29, 2025

తుఫాన్ బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000

image

AP: తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక <<18137630>>సాయం<<>> ప్రకటించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.1000 అందజేయాలని నిర్ణయించింది. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3000 అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారు.