India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేరళలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్‌షీట్‌పై వారాన్ని మెన్షన్ చేయడాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రశంసించారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలోనూ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు సిద్ధమైనట్లు ట్వీట్ చేశారు. వారంతో పాటు రంగులను ఏర్పాటు చేసినట్లు తెలుపుతూ ఫొటోలు పంచుకున్నారు. దీనిపై అభిప్రాయం తెలపాలని కోరారు. ఇలా వారాన్ని మెన్షన్ చేస్తే రోజూ బెడ్‌షీట్ చేంజ్ చేస్తారు.

భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ICC T20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. నిన్న ENGపై 5 వికెట్లతో అదరగొట్టి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. 3 T20ల్లో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి 7.08 ఎకానమీతో 10వికెట్లు తీశారు. ఈ క్రమంలోనే 25 ర్యాంకులు ఎగబాకి 5వ స్థానానికి చేరారు. అలాగే T20ల్లో కుల్దీప్, భువీ తర్వాత 2సార్లు 5వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గానూ నిలిచారు.

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిజన్‌లో జరిగిన ప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించినట్లు జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ తెలిపింది. అధికారులతో టచ్‌లో ఉన్నామని మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొంది. ఘటనపై విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది.

AP: చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందని ప్రచారం చేసిన SM ప్రతినిధులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు TTD వెల్లడించింది. ఆయనకున్న క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రకారం JAN 14న దర్శనం చేయించామంది. అవాస్తవాలు ప్రచారం చేసినందుకు పోలీసు కేసుతో పాటు PIB(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. TTD ప్రతిష్ఠను పలుచన చేసేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.

AP: సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారమైందని, CM చొరవతో కోర్టు కేసుల విత్‌డ్రాకు ఇరుపక్షాలు అంగీకరించాయని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములు ఆక్రమించి 12,149 ఇళ్లు కట్టుకున్నారని, భూముల క్రమబద్ధీకరణకు గతంలోనూ ప్రయత్నించామన్నారు. ఆక్రమించిన 420ఎకరాలకు బదులు 610ఎకరాలను దేవస్థానానికి బదలాయిస్తున్నట్లు చెప్పారు. వాటి విలువ రూ.5,300cr వరకు ఉంటుందని తెలిపారు.

తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలని హుజూరాబాద్ (TG)కి చెందిన ఓ క్యాన్సర్ పేషెంట్ కోరుకుంటోంది. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన కూతురి చివరి కోరికను తీర్చాలంటూ ఆమె తల్లి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేఖ రాశారు. ‘నా కూతురు స్వాతి(25) బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి మాట్లాడటమే తన చివరి కోరిక. దయచేసి ఆయన్ను కలిపించండి’ అని తల్లి రజిత రాసిన లేఖ వైరలవుతోంది.

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ రేపు పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖకు చేరుకోనున్న వారు తొలుత ప్లాంట్‌ను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ అధికారులతో విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితిగతులు, ఇతర అంశాలపై సమీక్షిస్తారు. కాగా ఇటీవల కేంద్రం స్టీల్ ప్లాంట్ కోసం రూ.11000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

దేశీయ స్టాక్ మార్కెట్లు బడ్జెట్‌కి ముందు వరుసగా రెండో రోజు లాభాల్లో పయనించాయి. Sensex 631 PTS లాభంతో 76,532 వద్ద, Nifty 205 PTS ఎగసి 23,163 వద్ద స్థిరపడ్డాయి. చైనా DeepSeek AI వల్ల వరుస నష్టాల్లో ఉన్న IT Stocks బౌన్స్‌బ్యాక్ అవ్వడం, బడ్జెట్‌కు ముందు బ్యాంకు, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. Shriram Fin, BEL, Tata Motors టాప్ గెయినర్స్.

వరస హిట్స్‌తో ఊపుమీదున్న నందమూరి బాలకృష్ణ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ‘హిట్’ యూనివర్స్‌లో బాలయ్య కూడా భాగమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో నాని నటించిన హిట్-3 విడుదల కానుండగా, అందులో బాలయ్య చిన్న పాత్రలో మెరుస్తారని, కొనసాగింపుగా హిట్-4లో పూర్తిస్థాయి పోలీసుగా కనిపిస్తారని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.

AP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పార్థసారథి వైసీపీకి సవాల్ విసిరారు. ఆ పార్టీ నేతలకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. వైసీపీ దోపిడీ పాలనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. మూర్ఖపు ఆలోచనతో రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టారని మండిపడ్డారు. అలీబాబా 60 దొంగల్లా దోచుకున్నారని విమర్శించారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ చూసి జగన్ సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు.
Sorry, no posts matched your criteria.