News January 29, 2025

‘దేవర-2’లో భారీ యాక్షన్ సీన్లు?

image

ఎన్టీఆర్ ‘దేవర పార్ట్-2’లో భారీ యాక్షన్ సీన్లు, ట్విస్టులు ఉండేలా డైరెక్టర్ కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, స్క్రిప్ట్‌లో భారీ మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. పుష్ప-2 తరహాలో ఫ్యాన్స్‌ను మెప్పించేలా సీన్స్ రాసుకుంటున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. దేవర-2 షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

News January 29, 2025

కుంభమేళాలో తొక్కిసలాట.. యూపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

image

మహా కుంభమేళా తొక్కిసలాట కలచివేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిర్వహణ లోపం, సామాన్య భక్తులను వదిలేసి వీఐపీలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా మేల్కోవాలని హితవు పలికారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

News January 29, 2025

ఉదయం 8 గంటలకే 4 కోట్ల మంది స్నానాలు: యోగి

image

నిన్న 5 కోట్లు, నేటి ఉదయం 8గం.కే 4 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని యోగి తెలిపారు. మౌని అమావాస్య రోజు త్రివేణీ సంగమం వద్ద స్నానం చేయడం పుణ్యప్రదం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని పేర్కొన్నారు. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గంగా ఘాట్లలో స్నానాలు చేయాలని సూచించారు. తొక్కిసలాటలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. వదంతులను నమ్మవద్దని తెలిపారు.

News January 29, 2025

ప్రయాగ్‌రాజ్‌లో 8-10 కోట్ల భక్తులున్నారు: యోగి

image

ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో 8-10 కోట్ల మంది ఉన్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నిన్న 5 కోట్ల మంది పవిత్రస్నానాలు చేశారన్నారు. రాత్రి మౌని అమావాస్య ఘడియలు రాగానే భక్తులు ఒక్కసారిగా బారికేడ్ల ముందుకు వచ్చారని తెలిపారు. తొక్కిసలాట జరగ్గానే అధికారులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టారని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

News January 29, 2025

ఆత్మీయ భరోసా అర్హుల గుర్తింపుపై కీలక ఆదేశాలు

image

TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అర్హుల గుర్తింపును ఫిబ్రవరి 2లోగా పూర్తి చేయాలని అధికారులను పంచాయతీ రాజ్ శాఖ ఆదేశించింది. లబ్ధిదారుల వివరాలను అదే రోజు సా.5గంటల లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించింది. ఆ తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఏడాదికి ₹12వేలు అందించనుంది. ఇప్పటికే తొలి విడతలో పలువురికి ₹6వేల చొప్పున జమ చేసింది.

News January 29, 2025

ఘోర విషాదం.. 20 మంది మృతి?

image

మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. 100 మంది భక్తులు గాయపడ్డారు. వారికి మేళా సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిబిరాల్లో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. ఘటనపై మోదీ, షా ఆరా తీశారు.

News January 29, 2025

మహాకుంభ్ రైళ్ల రద్దుపై రైల్వే మినిస్ట్రీ క్లారిటీ

image

మహాకుంభ్ స్పెషల్ ట్రైన్లను ఇండియన్ రైల్వే తాత్కాలికంగా నిలిపేసిందన్న వార్తలపై రైల్వే మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైతే అలాంటి ప్లానేమీ లేదని తెలిపింది. మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ ప్రాంతంలోని వేర్వేరు స్టేషన్ల నుంచి ఈ ఒక్కరోజే 360 రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నామని వెల్లడించింది. మౌని అమావాస్య కావడంతో నేడు త్రివేణీ సంగమ స్థలి, వివిధ ఘాట్లు భక్తకోటితో నిండిపోవడం తెలిసిందే.

News January 29, 2025

ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు?

image

AP: కూటమి ప్రభుత్వం త్వరలోనే మహిళలకు శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఉగాది నుంచి RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను ప్రభుత్వానికి అందించినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత పథకం ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు.

News January 29, 2025

జానీ మాస్టర్‌పై ఛాంబర్ కేసు గెలిచింది: ఝాన్సీ

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేసు గెలిచిందని నటి ఝాన్సీ వెల్లడించారు. ఛాంబర్ విధించిన ఆంక్షల్ని జానీ జిల్లా కోర్టులో సవాలు చేశారని, ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసిందని పేర్కొన్నారు. ‘పనిప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడమే కాక సంస్థలు POSH నిబంధనలు అమలుచేయాలని గుర్తుచేసే ఈ తీర్పు చాలా కీలకం’ అని ఆమె పేర్కొన్నారు.

News January 29, 2025

మైనర్లు లింగ మార్పిడి చేసుకోవడానికి వీల్లేదు: ట్రంప్

image

యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 19 ఏళ్లలోపు వారు లింగమార్పిడి చేసుకోవడానికి వీలు లేదని ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లలు జెండర్‌ను మార్చుకునేందుకు తాము మద్దతు ఇవ్వబోమని, ఇది దేశ చరిత్రపై మచ్చగా మారే ప్రమాదకరమైన ధోరణి అని పేర్కొన్నారు. తాను రెండు జెండర్లను మాత్రమే గుర్తిస్తానని ట్రంప్ తన ప్రమాణ స్వీకారోత్సవంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.