India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేసు గెలిచిందని నటి ఝాన్సీ వెల్లడించారు. ఛాంబర్ విధించిన ఆంక్షల్ని జానీ జిల్లా కోర్టులో సవాలు చేశారని, ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసిందని పేర్కొన్నారు. ‘పనిప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడమే కాక సంస్థలు POSH నిబంధనలు అమలుచేయాలని గుర్తుచేసే ఈ తీర్పు చాలా కీలకం’ అని ఆమె పేర్కొన్నారు.

యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 19 ఏళ్లలోపు వారు లింగమార్పిడి చేసుకోవడానికి వీలు లేదని ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లలు జెండర్‌ను మార్చుకునేందుకు తాము మద్దతు ఇవ్వబోమని, ఇది దేశ చరిత్రపై మచ్చగా మారే ప్రమాదకరమైన ధోరణి అని పేర్కొన్నారు. తాను రెండు జెండర్లను మాత్రమే గుర్తిస్తానని ట్రంప్ తన ప్రమాణ స్వీకారోత్సవంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

మహేశ్-రాజమౌళి #SSMB29 సినిమాకు ప్రియాంకా చోప్రాను హీరోయిన్‌గా తీసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా రూ.20 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారన్న టాక్ నడుస్తోంది. నిజమైతే భారత హీరోయిన్లలో ఇది రికార్డ్ రెమ్యునరేషన్ అయ్యే అవకాశం ఉంది.

ప్రయాగ్‌రాజ్‌కు కోట్లాది మంది వస్తుండటంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళా స్పెషల్ ట్రైన్లను ఇండియన్ రైల్వే నిలిపివేసింది. తర్వాతి ఆదేశాలు వచ్చేంత వరకు ఆపేస్తున్నట్టు తెలిపింది. రెగ్యులర్ ట్రైన్లు యథావిధిగా నడుస్తాయని వెల్లడించింది.

మహా కుంభమేళాలో తొక్కిసలాటలో భక్తులు మరణించడం చాలా బాధాకరం అని ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు. నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించాలన్నారు. ఈ ఘటన నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని భక్తుల కోసం వసతి, భోజనం, నీటి సౌకర్యాలకు అదనపు ఏర్పాట్లు చేయాలని ట్వీట్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్వామివారి దర్శనం నేరుగా లభిస్తోంది. కాగా.. శ్రీవారిని నిన్న 70,610 మంది దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. వారిలో 17,310 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని పేర్కొన్నారు. ఇక స్వామివారికి హుండీ ద్వారా రూ.3.78 కోట్ల ఆదాయం సమకూరింది.

మహా కుంభమేళాలో తొక్కిసలాట జరగడంపై BSP చీఫ్ మాయావతి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో పలువురు చనిపోయినట్లు అధికారిక ప్రకటన రాలేదు. ఈక్రమంలోనే మృతులకు సంతాపం తెలియజేస్తున్నానని మాయావతి ట్వీట్ చేయడం గమనార్హం.

ప్రపంచ అంతాన్ని గుర్తించేందుకు రూపొందించిన డూమ్స్ డే గడియారం మరో 89 సెకన్లు ముందుకెళ్లింది. దీంతో ఏదో ఉపద్రవం ముంచుకు రాబోతోందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 1947లో గడియారం ఏర్పాటు చేసిన తర్వాత యుగాంతపు కౌంటింగ్‌లో ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. పర్యావరణ మార్పు, అణు ఉద్రిక్తతలు, భౌగోళిక పరిస్థితులు, మహమ్మారుల వంటి పలు అంశాల ఆధారంగా ముల్లును కదుపుతుంటారు.

AP: కరోనాతో మరణించిన పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. కారుణ్య నియామకాల ఫైల్‌ను ఆర్థిక శాఖ సీఎం చంద్రబాబు వద్దకు పంపింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1,488 పోస్టులు భర్తీ కానున్నాయి. కరోనా కారణంగా 2,917 మంది ఉద్యోగులు చనిపోగా, కారుణ్య నియామకాలకు 2,744 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1,488 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించగా, 1,149 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడూ లాభాల్లోనే మొదలయ్యే అవకాశముంది. గిఫ్ట్‌నిఫ్టీ 59 పాయింట్ల మేర పెరగడం దీనినే సూచిస్తోంది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే వస్తున్నాయి. డాలర్ ఇండెక్స్, బాండ్ యీల్డులు మాత్రం తగ్గడం లేదు. డీప్‌సీక్ ప్రభావం భారత మార్కెట్లపై అంతగా లేదు. నిఫ్టీ 23000 పై స్థాయిలో నిలదొక్కుకోవచ్చు. సూచీకి సపోర్టు 22,877, రెసిస్టెన్సీ 23,091 వద్ద ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.