News June 7, 2024

ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది: YS జగన్

image

ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కూలిపోయాయని జగన్ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. వైసీపీ నేతలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. గత ఐదేళ్లలో సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బ తీశారు. 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా’ అని తెలిపారు.

News June 7, 2024

BREAKING: ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు, మావోల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

News June 7, 2024

టీచర్ల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల

image

TG: రాష్ట్రంలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మల్టీ జోన్-1లో ఈనెల 22 వరకు, మల్టీ జోన్-2లో ఈనెల 30 వరకు ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు చేపట్టనుంది. పదవీ విరమణకు 3 ఏళ్లలోపు ఉన్నవారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. కోర్టు కేసులతో గతంలో ఆగిపోయిన దగ్గరి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. TETతో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించనుంది.

News June 7, 2024

369 మంది పోటీ.. 311 మంది డిపాజిట్ గల్లంతు

image

ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 29 MP స్థానాలనూ గెలుచుకుని BJP రికార్డు సృష్టించింది. గత 40 ఏళ్లలో ఆ రాష్ట్రంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. మొత్తం 369 మంది పోటీ చేయగా 311 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇండోర్‌లో బీజేపీ నేత శంకర్ లల్వానీ రికార్డు స్థాయిలో 11.75 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మిగిలిన అన్ని చోట్లా నాయకులు లక్ష నుంచి 5 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

News June 7, 2024

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోయిన్ సునయన

image

టాలీవుడ్ హీరోయిన్ సునయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవల తనకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు సోషల్ మీడియాలో వెల్లడిస్తూ, రింగులు మార్చుకున్న ఫొటోను షేర్ చేశారు. అయితే కాబోయే భర్త ఎవరనేది బయటపెట్టలేదు. కుమార్VSకుమారి, టెన్త్ క్లాస్, రాజ రాజ చోర తదితర తెలుగు చిత్రాలతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో సునయన నటించారు. ఇన్‌స్పెక్టర్ రిషి, మీట్ క్యూట్, చదరంగం వెబ్‌సిరీస్‌లలోనూ కీలక పాత్రలు పోషించారు.

News June 7, 2024

ఏడాదిలో మళ్లీ ఎన్నికలు ఖాయం: భూపేశ్ బఘేల్

image

పార్టీలను చీల్చిన వారికి, CMలను జైలులో పెట్టిన వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని ఛత్తీస్‌గఢ్ మాజీ CM భూపేశ్ బఘేల్ వ్యాఖ్యానించారు. దేశంలో ఏడాదిలోనే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. INC కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘మహారాష్ట్ర డిప్యూటీ CM ఫడ్నవీస్ రిజైన్ చేయబోతున్నారు. UPలో యోగి కుర్చీ షేక్ అవుతోంది. రాజస్థాన్ CM భజన్ లాల్ ఊగిసలాడుతున్నారు’ అని పేర్కొన్నారు.

News June 7, 2024

ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తాం: లోకేశ్

image

AP: తలసరి ఆదాయం తక్కువగా ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం బుజ్జగింపు కాదని, సామాజిక న్యాయమని నారా లోకేశ్ చెప్పారు. వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. 20ఏళ్లుగా కొనసాగుతున్న రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా తాము మళ్లీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను తొలగించి SC, ST, BCలకు ఇస్తామని మోదీ, అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.

News June 7, 2024

నామినేటెడ్ పోస్టులు రద్దు

image

AP: రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులన్నీ రద్దు చేస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ప్రకటించారు. వివిధ శాఖల నామినేటెడ్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల నుంచి రాజీనామాలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. కాగా ఇప్పటికే కొంతమంది నామినేటెడ్ ఛైర్మన్లు రాజీనామా చేశారు. చేయని వారి నుంచి ప్రభుత్వం రాజీనామాలు కోరుతోంది.

News June 7, 2024

NEET ఫలితాల్లో అవకతవకలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలి: ప్రియాంక

image

NEET ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన ఆరుగురికి 720/720 మార్కులు రావడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తొలుత ప్రశ్నపత్రం లీకైందని, ఇప్పుడు ఫలితాల్లో స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు.

News June 7, 2024

ఏపీలో తొలగింపు.. మరుసటి రోజే తెలంగాణలో పదవి

image

TG: ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆయన్ను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సలహాదారుగా నియమించింది. జగన్ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయన్ను నిన్ననే అక్కడి ప్రభుత్వం తొలగించింది. మరుసటి రోజే తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించడం విశేషం. నీటిపారుదల శాఖలో ఆదిత్యనాథ్ దాస్‌కు సుదీర్ఘ అనుభవం ఉండటంతో రేవంత్ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.