India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అవి నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా 4 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వన్డే చరిత్రలో స్లోయెస్ట్ ఇన్నింగ్స్ సరిగ్గా ఇదే రోజు 1975లో నమోదైంది. ENGపై గెలిచేందుకు 335 రన్స్ చేయాల్సి ఉండగా.. సునీల్ గవాస్కర్ టెస్ట్ తరహాలో ఆడారు. 174 బంతుల్లో ఒక్క ఫోర్ కొట్టి కేవలం 36 పరుగులు చేశారు. దీంతో భారత్ 60 ఓవర్లలో 133/2 రన్స్ మాత్రమే చేయడంతో ENG 202 పరుగుల తేడాతో గెలిచింది. గవాస్కర్ ఇన్నింగ్స్ కోపం తెప్పించడంతో కొందరు ఫ్యాన్స్ మైదానంలోకి దూసుకొచ్చారు.
TG: నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్ సిద్ధమయ్యారు. ‘ఫోన్ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకోవచ్చు. నీటి ఎద్దడి, మురుగు నీటి కాలువలు, రోడ్డు, విద్యుత్, మిషన్ భగీరథ సమస్యల, పోడు భూముల గురించి కాల్స్ వచ్చినట్లు ఆయన Xలో పోస్ట్ చేశారు.
TG: రేవంత్ CM అవుతారని తొలుత చెప్పిన తననే ఆయన మొదటగా రోడ్డున పడేశారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. 6గంటలు సెక్రటేరియట్‌లో కూర్చున్నా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. ‘6సార్లు గెలిచిన నాకు ఇంత అవమానం ఎక్కడా జరగలేదు. పాలన ఎలా చేయాలో రేవంత్ నేర్చుకోవాలి. APలో అహంకారంతో జగన్ ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. CBN ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు’ అని పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. కవితకు ఈ నెల 21 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి కవిత 9 పుస్తకాలు కోరగా ఆ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ‘కల్కి’ సినిమా ట్రైలర్ ఈనెల 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో ట్రైలర్ రాబోతోందని ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పెషల్‌గా డిజైన్ చేసిన ఆయుధంతో ఉన్నారు. ఈనెల 27న ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
ఏమాత్రం అంచనాల్లేని అమెరికా టీ20 వరల్డ్ కప్‌లో అదరగొడుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయం గాలి వాటం కాదని నిరూపిస్తూ.. టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో కెనడాపై విజయం సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో ఏకంగా మాజీ ఛాంపియన్ పాకిస్థాన్‌కు షాకిచ్చి ప్రపంచకప్‌లోకి తన ఆగమనాన్ని ఘనంగా చాటింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న అమెరికా ప్లేయర్లు పెద్ద జట్లకే సవాల్ విసురుతున్నారు.
ఎన్డీఏ అంటే న్యూ ఇండియా.. డెవలప్ ఇండియా.. యాస్పిరేషనల్ ఇండియా అని నరేంద్ర మోదీ కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అందరి కర్తవ్యమని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పిలుపునిచ్చారు. దేశ ప్రజల స్వప్నాల సాకారానికి తమ వద్ద రోడ్ మ్యాప్ ఉందన్నారు. ఇండియాగా పేరు మార్చుకున్న తర్వాత కూడా యూపీఏను ప్రజలు అంగీకరించలేదని మోదీ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ గడ్డపై తెలుగు దేశం పార్టీ తిరిగి అధికారంలోకి రానుండటంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే, ఈ సంతోష సమయంలో సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలతో పాటు తారకరత్నను మిస్ అవుతున్నామని ట్వీట్స్ చేస్తున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన కోరుకునేవారు.
TG: రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్ 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 13న ఆయన టీన్యాబ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.