News April 17, 2025

వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు..$700Mలతో బిగ్ డీల్!

image

భారత్, వియత్నాం మధ్య బ్రహ్మోస్ క్షిపణుల డీల్ తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. 700 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులను ఆ దేశానికి సరఫరా చేసేలా భారత్ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. చైనాతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వియత్నాం ఈ క్షిపణులను కొనుగోలు చేసుకుంటుంది. కాగా 2022లో తొలిసారిగా 375 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు భారత్ అందించింది.

News April 17, 2025

ఏ క్షణమైనా ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను ఇవాళ విడుదల చేస్తామని NTA ప్రకటించిన విషయం తెలిసిందే. రాత్రిలోపు ఏ క్షణమైనా ఫలితాలు వెలువడే అవకాశం ఉండటంతో పరీక్షకు హాజరైన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. మీరూ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారా?

News April 17, 2025

కంచ భూములు ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదు: టీపీసీసీ చీఫ్

image

TG: కంచ గచ్చిబౌలి భూములను ప్రైవేటు పరం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో KTR ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. BRS హయాంలో HYD చుట్టూ వేల ఎకరాల భూములను విక్రయించిందని విమర్శించారు. గతంలో చాలా సార్లు BRSకు కోర్టుల చేతిలో మొట్టికాయలు పడ్డాయని గుర్తు చేశారు. కోర్టులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందని చెప్పారు.

News April 17, 2025

25న ‘గురుకుల’ పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల

image

AP: గురుకుల స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 25న పరీక్ష జరగనుంది. గురుకుల విద్యాలయాల సంస్థ అభ్యర్థుల హాల్‌టికెట్లను ఇవాళ విడుదల చేసింది. <>https://aprs.apcfss.in/<<>> వెబ్‌సైట్‌లో ఐడీ, బర్త్ డే ఎంటర్ చేసి డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. 5, 6, 7, 8వ తరగతులకు ఉ.10 నుంచి మ.12 వరకు, కాలేజీలకు మ.2.30 నుంచి సా.5 వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

News April 17, 2025

పాతబస్తీలో మెట్రో.. చారిత్రక కట్టడాలకు నష్టం కలగొద్దు: హైకోర్టు

image

TG: పాతబస్తీ మెట్రో నిర్మాణ పనులపై నెలకొన్న అభ్యంతరంపై హైకోర్టులో విచారణ జరిగింది. మెట్రో నిర్మాణం వల్ల ఇక్కడి చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయని పిటిషన్ దాఖలైంది. దీంతో పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయొద్దని, వాటి వద్ద నిర్మాణ పనులు చేపట్టొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.

News April 17, 2025

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వాన పడనున్నట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా నిన్న కూడా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి.

News April 17, 2025

సమంత ఫ్యాన్స్‌కు నిరాశ.. కారణమిదే!

image

‘సిటాడెల్’ ఇంగ్లిష్‌ సిరీస్‌ను భారత్‌లో ‘సిటాడెల్: హనీ- బన్నీ’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. వరుణ్ ధవన్, సమంత నటించిన ఈ సిరీస్‌కు సీక్వెల్‌ను రద్దు చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఇటాలియన్ వెర్షన్ ‘సిటాడెల్-డయానా’కు కూడా సీక్వెల్ ఉండదని తెలిపింది. ఒరిజినల్ సిరీస్‌(ఇంగ్లిష్)కు మాత్రమే కొనసాగింపుగా సీజన్-2ను తీసుకురానుంది. ప్రియాంక చోప్రా నటించిన సీజన్-2 2026లో రిలీజ్ కానుంది.

News April 17, 2025

మస్క్ లాంటి వ్యక్తి అరుదుగా ఉంటారు: పుతిన్

image

స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఆయన ఆలోచనలు చూస్తే ఇప్పటికీ తనకు నమ్మశక్యంగా ఉండదని ఆశ్చర్యపోయారు. రష్యాలోని బౌమన్ వర్సిటీలో విద్యార్థులతో పుతిన్ ముచ్చటించారు. మస్క్, సోవియట్ రాకెట్ ఇంజినీర్ సెర్గీ కోరోలెవ్ లాంటి గొప్ప దార్శనికుడని కొనియాడారు. ‘అమెరికాలో నివసించే ఓ వ్యక్తి అంతరిక్షమంతటి గురించి చెప్పగలరు’ అంటూ గొప్పగా చెప్పారు.

News April 17, 2025

రాష్ట్రపతికి కోర్టు డెడ్‌లైన్ విధించడమేంటి?: ఉపరాష్ట్రపతి

image

బిల్లులపై రాష్ట్రపతి 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల గడువు విధించిన విషయం తెలిసిందే. దీనిపై ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు చట్టాలు రూపొందించి అమలు చేసే పరిస్థితి, సుప్రీంకోర్టుకు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించే అధికారం మన డెమొక్రసీలో లేవన్నారు. ఇలాంటి తీర్పులతో మనం ఎటువైపు వెళ్తున్నాం? దేశంలో ఏం జరుగుతోంది? అని అసహనం వ్యక్తం చేశారు.

News April 17, 2025

IPLలో ఫిక్సింగ్ అలర్ట్.. పోలీసుల ఆరా!

image

ఐపీఎల్ మ్యాచుల్లో ఫిక్సింగ్ జరిగే అవకాశముందని అన్ని జట్లను బీసీసీఐ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై హైదరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని BCCIని కోరినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వ్యాపారవేత్తతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించగా అతను ఎవరనే విషయమై ఆరా తీస్తున్నారు. ఐసీసీ, బీసీసీఐ, స్థానిక క్రికెట్ క్లబ్‌తో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!