News October 29, 2025

గాజాపై దాడులు.. 60 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 60 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించడంతో సైన్యం 3చోట్ల బాంబుల వర్షం కురిపించింది. కాగా బందీల మృతదేహాల అప్పగింతకు ఉద్రిక్త పరిస్థితులు అడ్డంకిగా ఉన్నట్లు హమాస్ పేర్కొంది. హమాస్ ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం వల్లే దాడి జరిగిందని, ఇది శాంతికి విఘాతం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

News October 29, 2025

కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

image

అధిక వర్షపాతం ఉన్న సమయంలో ఈ ఆకుగూడు పురుగు పంటను ఆశిస్తుంది. కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆశిస్తుంది. లార్వాలు చిగురాకులను, ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్‌ 36% యస్‌.యల్‌ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలి.

News October 29, 2025

తుఫాన్ బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000

image

AP: తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక <<18137630>>సాయం<<>> ప్రకటించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.1000 అందజేయాలని నిర్ణయించింది. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3000 అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారు.

News October 29, 2025

ఎయిమ్స్ మదురైలో 84 పోస్టులు

image

<>ఎయిమ్స్ <<>>మదురై 84 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MD, MS, DM, M.Ch, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 58ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ఠ వయసు 50ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://aiimsmadurai.edu.in/

News October 29, 2025

రంగు చెప్పే ఆరోగ్య రహస్యం!

image

జీవనశైలి కారణంగా సంతానలేమి సమస్య పెరుగుతోంది. ఈక్రమంలో పురుషులు తమ ఆరోగ్య సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీర్యం రంగును చెక్ చేసుకోవాలంటున్నారు. ఆకుపచ్చ రంగు ఇన్‌ఫెక్షన్ (STIs కూడా)కు సూచన కావొచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పసుపు రంగు యూరిన్ కలవడం లేదా సప్లిమెంట్ల ప్రభావమై ఉండొచ్చు. రెడ్ కలర్ రక్తానికి సంకేతం (వైద్య పరీక్ష అవసరం). తెలుపు/బూడిద రంగు హెల్తీ.

News October 29, 2025

మొదటి సంతానం అమ్మాయైతే వివక్ష తక్కువ

image

ప్రస్తుత సమాజంలో కొందరు ఆడపిల్లలపై ఇప్పటికీ వివక్ష చూపుతున్నారు. అయితే ఇళ్లల్లోనూ బిడ్డల మధ్య వివక్ష చూపడం సాధారణం అని భావిస్తారు. అయితే మొదటి సంతానం అమ్మాయి అయితే ఆ తండ్రుల్లో లింగ వివక్ష ధోరణి తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అమ్మాయి పెరిగే క్రమంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లే తండ్రి ఆలోచనా తీరులో ఈ మార్పుని తీసుకొస్తున్నాయని, దీన్నే మైటీ గర్ల్‌ ఎఫెక్ట్‌ అంటారని నిపుణులు చెబుతున్నారు.

News October 29, 2025

దైవారాధనలో ఆహార నియమాలు పాటించాలా?

image

దేహపోషణకే కాక, మోక్షప్రాప్తికి కూడా ఆహార నియమాలు ముఖ్యమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆహార నియమాలు పాటించడం వలన శరీరం ఆరోగ్యంగా ఉండి, మనస్సు స్థిరంగా, నిశ్చలంగా ఉంటుంది. దేవుడిపై మనస్సు లగ్నం కావాలంటే, కష్టపడి, నిజాయతీగా సంపాదించిన ఆహారాన్నే స్వీకరించాలి. దుఃఖం, కోపం, భయం కలిగించే ఆహారాలు భక్తికి ఆటంకం. కాబట్టి ఆత్మశుద్ధిని కాపాడే ఆహారం మాత్రమే భగవత్‌ చింతనకు, దైవ ప్రాప్తికి సహాయపడుతుంది. <<-se>>#Aaharam<<>>

News October 29, 2025

టాస్ ఓడిన టీమ్ ఇండియా

image

ఇండియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది.
IND ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
AUS ప్లేయింగ్ XI: మార్ష్(కెప్టెన్), హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఓవెన్, స్టోయినిస్, ఫిలిప్, బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, కుహ్నెమాన్, హేజిల్‌వుడ్

News October 29, 2025

అర్హుల ఓట్లు తొలగిస్తే కాళ్లు విరగ్గొడతాం: బెంగాల్ మంత్రి

image

SIR పేరిట CAA అమలుకు BJP, EC ప్రయత్నిస్తున్నాయని బెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ ఆరోపించారు. అర్హులైన ఒక్కరి ఓటు తొలగినా ఊరుకొనేది లేదని, కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, మమత సీఎంగా ఉన్నన్నాళ్లూ రాష్ట్రంలో NRC అమలు కాబోదని స్పష్టం చేశారు. కాగా SIR పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగబోదని బెంగాల్ CEO స్పష్టం చేశారు.

News October 29, 2025

CSIR-IIIMలో ఉద్యోగాలు

image

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(IIIM)జమ్మూ 4 జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, మాస్టర్ డిగ్రీ( హిందీ / ఇంగ్లిష్‌) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiim.res.in.