India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ‘జలశక్తి’ మంత్రి పదవిని టీడీపీ ఆశిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ నీటి వనరులు, కేటాయింపులపై తీవ్ర ప్రభావం పడొచ్చు. TG అసెంబ్లీ పోలింగ్ రోజు సాగర్ డ్యామ్‌ను AP అధీనంలోకి తీసుకుంది. దీంతో జలశక్తి పరిధిలోని KRMB రంగంలోకి దిగింది. సాగర్లో అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో TGకి 8.5, APకి 5.5 టీఎంసీల నీటిని ఏప్రిల్‌లో కేటాయించింది. ఇకపై వివాదాలు ముదిరితే ఏపీదే పైచేయి కావొచ్చు. మీరేమంటారు?
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో ఒడిశా CM నవీన్ పట్నాయక్ రాజీనామా చేశారు. 24 ఏళ్ల పాటు ఆయన CMగా కొనసాగారు. తాజా ఫలితాల్లో నవీన్ పార్టీ బిజూ జనతాదళ్(BJD) మొత్తం 147 స్థానాలకు గాను 51 స్థానాలకే పరిమితమైంది. BJP 78 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సాధించింది. కాంగ్రెస్ 14, ఇతరులు 5 చోట్ల గెలిచారు. అటు 21 లోక్‌సభ స్థానాలకు BJP 20, కాంగ్రెస్ ఒకచోట గెలిచాయి.
సొంత మెజార్టీ తగ్గింది కానీ ఇప్పటికీ దేశంలో BJPనే అతిపెద్ద పార్టీ. ఇండియా కూటమి మొత్తం కన్నా దానికొచ్చిన సీట్లే ఎక్కువ. కాంగ్రెస్ 99, SP 37, TMC 29, DMK 22 డబుల్ డిజిట్లు పొందాయి. ఉద్ధవ్ శివసేన, శరద్ NCP సహా చిన్నా చితక 16 పార్టీలకు సింగిల్ డిజిటే వచ్చింది. ఇక ఖాతా తెరవనివి 4. కూటమికి 234 వస్తే కమలానికి 240 వచ్చాయి. ఉచితాలతో విపక్షాలన్నీ ఏకమైనా బీజేపీ కన్నా తక్కువేనని కొందరి వాదన. మీరేమంటారు?
గత హయాంలో మోదీ ప్రభుత్వం రైల్వేపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో ఈ స్టాక్స్ రెండు రోజుల్లోనే 33% వరకు క్రాష్ అయ్యాయి. టిటాగఢ్ రైల్వే సిస్టమ్స్ 33, ఇర్కాన్ ఇంటర్నేషనల్ 26, రైల్ టెల్ కార్ప్, IRCTC చెరో 19, RITES, IRFC, RVNL, టెక్స్‌మాకో, జూపిటర్ వ్యాగన్స్ షేర్లు 18-23% మేర క్షీణించాయి. NDA-3 ప్రభుత్వం స్థిరపడే దాక ఈ షేర్లలో కరెక్షన్ తప్పకపోవచ్చు.
ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయడంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయనను ఆపద్ధర్మ పీఎంగా కొనసాగాలని కోరినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 8న మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ సాధారణమైపోయింది. ముఖ్యంగా ఇందులో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వాడకానికే అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. సోషల్ మీడియాలో కంటిన్యూగా 3 గంటలు గడిపే టీనేజర్లలో యాంగ్జైటీ, కోపం, నిరాశ వంటి సమస్యలు ఉన్నాయని ఓ సర్వే పేర్కొంది. చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారని తెలిపింది. దీంతో వీలైనంత ఎక్కువగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
TG: APలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పానని CM రేవంత్ రెడ్డి తెలిపారు. APకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని, అది ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ గతంలోనే ప్రకటించారని చెప్పారు. ఈ విషయంలో తమ పార్టీ అధిష్ఠానంతో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానని అన్నారు. CMగా ప్రమాణస్వీకారానికి పిలిస్తే తప్పకుండా వెళ్తానని వెల్లడించారు.
AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
AP: మాచర్ల.. ఇక్కడ రాజకీయం చేయడం నేతలకే కాదు కార్యకర్తలకూ కత్తి మీద సామే. గత 15 ఏళ్లుగా తన అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సామ్రాజ్యాన్ని జూలకంటి బ్రహ్మారెడ్డి(TDP) కూలదోశారు. గతంలో జూలకంటి తండ్రి, తల్లి కూడా ఇక్కడ నెగ్గారు. 1972లో నాగిరెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచారు. దీంతో ఆయన్ను పల్నాటి పులి అంటారు. 1999లో బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంబ TDP నుంచి నెగ్గారు.
*అమెరికా- 8,133.46 టన్నులు
*జర్మనీ – 3,352.65 టన్నులు
*ఇటలీ – 2,451.84టన్నులు
*ఫ్రాన్స్ – 2,436.88 టన్నులు
*రష్యా- 2,332.74టన్నులు
*చైనా – 2,262.45టన్నులు
*స్విట్జర్లాండ్ – 1,040 టన్నులు
*జపాన్ – 845.97టన్నులు
*భారత్ – 822.10టన్నులు
Sorry, no posts matched your criteria.