India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇటీవల మల్టీ నేషనల్ కంపెనీల్లోనూ భారీగా లేఆఫ్స్ జరుగుతున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. లేఆఫ్స్ ఇచ్చిన కంపెనీలివే.. UPSలో 48,000, అమెజాన్‌లో 30,000, ఇంటెల్‌లో 24,000, Nestleలో 16,000, యాక్సెంచర్‌లో 11,000, ఫోర్డ్‌లో 11,000, నోవో నార్డిస్క్‌లో 9,000, మైక్రోసాఫ్ట్‌లో 7,000, PwCలో 5,600, సేల్స్‌ఫోర్స్‌లో 4,000 ఉద్యోగాల తొలగింపు వార్తలు వచ్చాయి.

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అమరావతి నుంచి ఆయన హెలికాప్టర్‌లో బయల్దేరారు. వాతావరణం అనుకూలిస్తే అమలాపురంలో దిగి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనిపై ఉదయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సమీక్ష కూడా నిర్వహించారు.

పొలంలో నిల్వ ఉన్న నీటిని 24-48 గంటలలోపు తొలగించాలి. పొలాలు ఎండిన తర్వాత లీటరు నీటికి 10గ్రా. యూరియా+5గ్రా. జింక్ సల్ఫేట్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. కోతకు దగ్గరలో ఉన్న మొక్కజొన్న పొత్తులను వెంటనే కోసి వాటిని 12-13% తేమ స్థాయికి ఆరబెడితే మొలకెత్తదు, నాణ్యత తగ్గదు. కండె కుళ్ళు, ఆకుమచ్చ ఇతర శిలీంద్ర తెగుళ్ల నివారణకు లీటరు నీటికి ప్రాపికొనజోల్ 1ml లేదా మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

AP: మొంథా తుఫాను శాంతించింది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడి AP, TG, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఐదు రోజుల్లోగా పంటనష్టం అంచనా వేయాలని ఆదేశించామన్నారు.

AP: మొంథా తుఫాన్ తీరం దాటిందని, ఇవాళ మధ్యాహ్నానికి సాధారణ స్థితి నెలకొంటుందని CM చంద్రబాబు తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మరణించినట్లు చెప్పారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు 10వేల మందిని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది బాగా పనిచేశారని అభినందించారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పెరిగిందని టెలీకాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు.

భారత ప్రభుత్వం సార్వత్రిక టీకా కార్యక్రమం కింద క్షయ (BCG), పోలియో, ధనుర్వాతం (టెటనస్), హెపటైటిస్-బి, డిప్తీరియా, కోరింత దగ్గు, మెదడువాపు (హిబ్), న్యుమోకోక్కల్ వంటి 10కి పైగా టీకాలను ఉచితంగా అందిస్తోంది. ఈ టీకాల ద్వారా పిల్లల మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇవి లేకపోతే భారతీయ సగటు ఆయుర్దాయం 30-40 ఏళ్లకే పరిమితమయ్యేదట. అందుకే ప్రతి బిడ్డకు టీకాలు వేయించడం తప్పనిసరి. SHARE IT

గుండెలోపాలతో పుట్టే శిశువులకు, వారి తల్లులకు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రచురించిన ఈ అధ్యయనంలో గుండెలోపాలున్న శిశువుల్లో 66% ఎక్కువ క్యాన్సర్లు బయటపడ్డాయి. ముఖ్యంగా రక్తనాళాలు, గుండెకవాటాల లోపం ఉంటే ముప్పు రెండింతలు ఎక్కువగా ఉంది. తల్లి జన్యు స్వభావం వల్ల తల్లీబిడ్డలిద్దరీ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు.

AP: సమర్థంగా వ్యవహరించి తుఫాన్ నష్టనివారణ చర్యలు చేపట్టామని కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌లో CM చంద్రబాబు అన్నారు. ‘అంతా టీమ్‌గా పనిచేశాం. ప్రతిఒక్కరికీ అభినందనలు. మరో 2 రోజులు ఇలానే చేస్తే మరింత ఊరట ఇవ్వగలం. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ సమస్యలు అడిగి తెలుసుకోవాలి. నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలి’ అని ఆదేశించారు.

AP: ట్రస్టు డిపాజిట్లు ₹2500 కోట్లకు చేరనుండడంతో దేశంలోని తమ అన్ని దేవాలయాల్లోనూ ‘అన్నదానం’ చేయాలని TTD నిర్ణయించింది. కరీంనగర్(TG)లో ఆలయ నిర్మాణానికి ₹30 కోట్లు కేటాయించింది. అక్కడే ₹3 కోట్లతో ‘ఆధ్యాత్మిక ఉద్యానవనం’ నిర్మించనుంది. తక్కువ ధరలకు మందులు విక్రయించేలా స్విమ్స్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులను ఏర్పాటు చేయనుంది. వైకుంఠ ద్వార దర్శన విధానాన్ని 10 రోజుల పాటు కొనసాగించనుంది.

ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ఆస్ట్రేలియాVsభారత్ తొలి T20 ప్రారంభం కానుంది. అయితే ఆసీస్‌పై పొట్టి క్రికెట్లో మనదే పైచేయి. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు ఇండియా టీ20 సిరీస్ కోల్పోలేదు. 2012లో 1-1తో సమం కాగా 2016లో 3-0 తేడాతో గెలిచింది. 2018లో మళ్లీ 1-1తో సమం చేయగా 2020లో 2-1తో సిరీస్ సాధించింది. ఇక AUS-IND మధ్య జరిగిన చివరి 8 మ్యాచుల్లో భారత్ ఏడింట్లో గెలవడం విశేషం.
Sorry, no posts matched your criteria.