India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అసెంబ్లీని వైసీపీ ప్రభుత్వం కౌరవ సభగా మార్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘శాసనసభలో నాకు, నా కుటుంబానికి, నా భార్యకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయా. గతంలో నాపై బాంబులతో దాడి చేసినప్పుడూ ఇంత బాధపడలేదు. గెలిచి సీఎంగానే వస్తానని ఆనాడు ప్రతిజ్ఞ చేశా. దాన్ని నిజం చేయడానికి ప్రజలు తోడ్పడ్డారు. ఇప్పుడు మళ్లీ శాసనసభను గౌరవసభ చేస్తా’ అని చెప్పారు.
YCP ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఐదేళ్లు మా కార్యకర్తలకు నిద్ర లేకుండా చేశారు. అహంకారులైన పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పారు. కూటమికి 58.38%ఓట్లు పడ్డాయి. TDPకి 45%, YCPకి 39% ఓట్లు వచ్చాయి. స్వేచ్ఛను హరించడం వల్ల వచ్చిన ఈ ఫలితం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది’ అని అన్నారు.
లోక్‌సభ ఫలితాలపై పాక్ మీడియా ఆచితూచి స్పందించింది. అత్యుత్సాహం ప్రదర్శించలేదు. ‘ఆశ్చర్యకరంగా తక్కువ మార్జిన్‌తో గెలిచిన మోదీ కూటమి’ అని డాన్ పత్రిక హెడ్డింగ్ పెట్టింది. ‘రామ మందిరం కట్టిన చోట BJP ఓటమి, ఓటర్లు BJPని శిక్షించారన్న రాహుల్ గాంధీ’ అని బుల్లెట్ పాయింట్లు పెట్టింది. ఇక ఖతర్ కేంద్రంగా నడిచే అల్ జజీరా ‘మెజార్టీ కోల్పోవడం పీఎం మోదీ నేతృత్వంలోని కూటమికి పెద్ద దెబ్బే’ అని హెడ్‌లైన్ ఇచ్చింది.
నేడు పలు కీలక సమావేశాలకు ఢిల్లీ వేదిక కానుంది. కాసేపట్లో మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ చివరి సమావేశం జరగనుంది. అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకై రాజీనామా చేసే అవకాశం ఉంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై సాయంత్రం 4 గంటలకు ప్రధాని నివాసంలో NDA నేతల సమావేశం జరగనుంది. అటు సాయంత్రం 6 గంటలకు AICC చీఫ్ ఖర్గే నివాసంలో INDIA కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణలోని లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం ఒక సీటు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ అత్యధికంగా 40.10శాతం ఓటు షేర్ (87,41,263ఓట్లు) పొందింది. బీజేపీ 35.08శాతం ఓట్ షేరు (76,47,424 ఓట్లు)తో రెండో స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ 16.68 శాతం ఓటు షేర్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఎంఐఎం 3.092శాతం ఓటు షేర్(6,59,278 ఓట్లు) పొందింది.
ఒడిశా అనగానే గుర్తొచ్చే పేరు నవీన్ పట్నాయక్. దాదాపు 24 ఏళ్లుగా అక్కడ బిజూ జనతా దళ్ పార్టీనే అధికారంలో ఉంది. నిన్న వెలువడిన ఫలితాల్లో బీజేడీ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టింది. మొత్తం 147 స్థానాల్లో 78 చోట్ల ఒంటరిగానే గెలుపొంది ఆ రాష్ట్రంలో తొలిసారిగా అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు నవీన్ పట్నాయక్ హింజిలీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సిసిర్ కుమార్‌పై 4,636 ఓట్ల తేడాతో గెలుపొందారు.
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జేడీయూ వంటి పార్టీలను సంప్రదించడంపై నేడు నిర్ణయం తీసుకుంటామన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీయే కూటమి పార్టీలను సంప్రదిస్తారా అన్న మీడియా ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. మేజిక్ ఫిగర్ అయిన 272 సీట్లు బీజేపీకి సొంతంగా రాకపోవడంతో ఇండియా కూటమికి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వచ్చినట్టయింది. కాగా సా.6 గం.కు ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు.
ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సభ్యులంతా రాజీనామా చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ సాయంత్రం 4 గంటలకు మోదీ నివాసంలో ఎన్డీయే పక్షాలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ హాజరుకానున్నారు.
AP TDP చీఫ్ అచ్చెన్నాయుడు ఆరోసారి MLAగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 1996, 1999, 2004లో హరిశ్చంద్రపురం నుంచి గెలిచిన ఆయన 2009లో ఓడిపోయారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అటు మరో TDP నేత ధూళిపాళ్ల నరేంద్ర కూడా 6వ సారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 1994 నుంచి 2014 వరకు వరుసగా 5 సార్లు గెలిచిన ఆయన 2019లో ఓటమి చవిచూశారు. 2024లో 32వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
AP: పోలింగ్ సమయంలో హింస చెలరేగిన పల్నాడు జిల్లాలో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఫలితాల తర్వాత హింస చెలరేగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికతో బందోబస్తు కొనసాగిస్తున్నారు. నరసరావుపేటలో 144 సెక్షన్ అమలులో ఉంది. పోలీసులు ముందస్తుగా షాపులను మూయిస్తున్నారు. రాజకీయ నేతల ఇంటి దగ్గర ముళ్ల కంచెలు వేసి పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.