India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని నిరసిస్తూ ఇవాళ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా నిర్వహించనుంది. క్లాక్ టవర్ వేదికగా KTR నాయకత్వంలో ఆ పార్టీ నేతలతో పాటు పలువురు రైతులు నిరసన తెలపనున్నారు. ఉ.11 నుంచి మ.2 గంటల వరకు మాత్రమే ధర్నాను నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

సీఐఎస్ఎఫ్ 1,124 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కానిస్టేబుల్/డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, డ్రైవర్ ఫర్ సర్వీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెట్రిక్యులేషన్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. https://cisfrectt.cisf.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4 వరకు అప్లై చేసుకోవచ్చు.

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు లాభాల్లో మొదలవ్వొచ్చు. గిఫ్ట్‌నిఫ్టీ 110 PTS పెరగడం దీనినే సూచిస్తోంది. ఇప్పటికే సూచీలన్నీ ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్లడంతో పుల్‌బ్యాక్ ర్యాలీకి ఆస్కారముంది. ఆసియా, గ్లోబల్ మార్కెట్ల నుంచీ మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి. డాలర్ ఇండెక్స్, US బాండ్ ఈల్డుల పెరుగుదల ఆందోళనకరం. నిఫ్టీకి సపోర్టు 22790, రెసిస్టెన్సీ 22,959 వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటమే మంచిది.

TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద రూ.579 కోట్లు విడుదల చేసింది. దీంతో విడతల వారీగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. తొలి రోజు 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.569 కోట్లు జమ చేసింది. అలాగే 18,180 రైతు కూలీ కుటుంబాలకు రూ.6 వేల చొప్పున రూ.10.91 కోట్లు అందించింది. మరి ఈ పథకాల కింద మీ అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో కామెంట్ చేయండి.

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(LTTE) పేరిట శ్రీలంకలో తమిళుల కోసం పోరాడిన ప్రభాకరన్ బతికే ఉన్నారా? ఈ ఏడాది మేలో జనం ముందుకు రానున్నారా? తమిళ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాకరన్‌ను తాము అంతం చేసినట్లు 2009లో శ్రీలంక సైన్యం ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫొటోలనూ విడుదల చేసింది. అలాంటిది ఆయన బతికున్నారంటూ ఇప్పుడు వార్తలు రావడం సంచలనంగా మారింది.

సైబర్ దాడుల నేపథ్యంలో కొత్త యూజర్ల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా ఆపేస్తున్నామని చైనీస్ స్టార్టప్ డీప్‌సీక్ తెలిపింది. పాత యూజర్లు నిరభ్యంతరంగా తమ AIను వాడుకోవచ్చని సూచించింది. ChatGPT, Gemini వంటి AI యాప్స్‌కు డీప్‌సీక్ పెనుసవాళ్లు విసురుతోంది. కొత్త వెర్షన్ విడుదలయ్యాక అనేక దేశాల్లో దీనినే ఎక్కువగా వాడుతున్నారు. అమెరికాలో APPLE యాప్‌స్టోర్‌లో ఎక్కువ డౌన్‌లోడ్ చేసుకున్న ఫ్రీ యాప్‌గా నిలిచింది.

ఉదయాన్నే పరగడుపున కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కాఫీ, స్పైసీ ఫుడ్స్, సిట్రస్ పండ్లు, చక్కెర పదార్థాలు, డీప్ ఫ్రై ఆహారం తీసుకోకూడదు. ఇవి తింటే జీర్ణ సమస్యలు, పొట్ట ఉబ్బరానికి దారి తీస్తాయి. దీనివల్ల డయాబెటిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఓట్ మీల్, గుడ్లు, గ్రీన్ టీ, బెర్రీలు, చియా విత్తనాలు, బాదంపప్పు వంటివి తీసుకోవాలి. వీటిని తింటే పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది.

AP: పథకాల అమలుపై సీఎం చంద్రబాబు చేసిన <<15282237>>కామెంట్లకు<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో కౌంటరిచ్చారు. ‘సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు. జగన్ మీద తోసేసి చంద్రబాబు, లోకేశ్ చేతులెత్తేశారు. హామీలు గాలికి వదిలేశారు. గోవిందా.. గోవిందా!!’ అని ఎద్దేవా చేశారు. అప్పుల పేరుతో CBN పథకాలు అమలు చేయడం లేదని అంబటి నిన్న విమర్శించిన విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. HYD రాజేంద్రనగర్ పరిధిలో ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇక ఏపీలోని నంద్యాల చాపిరేవులలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇజ్రాయెల్ తరహాలోనే అమెరికాకూ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ మేరకు చట్టసభల సభ్యులకు వెల్లడించారు. త్వరలోనే అందుకు సంబంధించిన ఆదేశాలపై సంతకం చేస్తానని స్పష్టం చేశారు. USకి రక్షణ కవచం అత్యవసరమని, ఐరన్ డోమ్ నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని వారితో పేర్కొన్నారు. దేశ గగనతలంలోకి దూసుకువచ్చే క్షిపణుల్ని ఐరన్ డోమ్ వ్యవస్థ నేలకూలుస్తుంది.
Sorry, no posts matched your criteria.