India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. వీరిలో 17 మంది ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీలతో జయకేతనం ఎగురవేశారు. ఇందులో CBN, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, గంటా, చినరాజప్ప, గోరంట్ల, నిమ్మల, గద్దె, అనగాని, గొట్టిపాటి, వంటి నేతలున్నారు. ఉండి, రాజమండ్రి సిటీలో అభ్యర్థులు మారగా వారూ గెలిచారు. కాగా నలుగురు MLAలు YCP వైపు మళ్లారు. YCP నుంచి పోటీచేసిన వల్లభనేని వంశీ, కరణం వెంకటేశ్, వాసుపల్లి గణేశ్ ఓడిపోయారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ‘కల్కి’ సినిమా నుంచి ఉదయం 10 గంటలకు అప్డేట్ రానుంది. ట్రైలర్ రిలీజ్‌కు సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇవ్వనున్నారు. అయితే, ఈనెల 7న గ్రాండ్‌గా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రిలీజైన టీజర్, బుజ్జి గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే.
* శంకర్ లాల్వాణీ(ఇండోర్-బీజేపీ) 11,75,092
* రక్బీల్ హుస్సేన్(ధుబ్రీ-కాంగ్రెస్) 10,12,476
* శివరాజ్ సింగ్ చౌహాన్(విదిశ-బీజేపీ) 8,21,408
* సీఆర్ పాటిల్(నవసారి-బీజేపీ) 7,73,551
* అమిత్ షా(గాంధీనగర్-బీజేపీ) 7,44,716
* అభిషేక్ బెనర్జీ(డైమండ్ హార్బర్-టీఎంసీ) 7,10,930
* రఘువీర్ రెడ్డి( నల్గొండ-కాంగ్రెస్) 5,59,905
మోదీ మంత్ర ‘డబుల్ ఇంజిన్’కు ఈ ఫలితాల్లో ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన యూపీ, మహారాష్ట్రలో ఆ పార్టీకి మెజారిటీ కంటే తక్కువ స్థానాలే దక్కాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో BJPకి 33 సీట్లు, ప్రతిపక్ష ఎస్పీకి 37 సీట్లు రావడం గమనార్హం. మరోవైపు మహారాష్ట్రలో బీజేపీకి 9 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు 13 రావడం గమనార్హం. దీంతో అధికారంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీకి తక్కువ సీట్లు రావడం చర్చనీయాంశంగా మారింది.
AP అసెంబ్లీ ఎన్నికల్లో YCP ఘోర ఓటమిని తట్టుకోలేక కొందరు అభిమానులు మృతి చెందారు. కృష్ణా(D) గుడివాడ సైదేపూడికి చెందిన పిట్ట అనిల్(28) జగన్ ప్రభుత్వం, కొడాలి నాని ఓటమి చెందడం తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. YSR(D) దిగువ తంబళ్లపల్లెకు చెందిన YCP కార్యకర్త చిన్నయల్లాలు(63) గుండెపోటుతో చనిపోయాడు. కర్నూలు(D) చిన్నతంబళంలోనూ ఉరుకుందప్ప(68) టీవీ చూస్తూ YCP ఓటమిని తట్టుకోలేక తుదిశ్వాస విడిచారు.
* కుందూర్ రఘువీర్(నల్గొండ-కాంగ్రెస్)-5,59,905
* శ్రీభరత్(వైజాగ్-టీడీపీ)-5,04,247
* రఘురాం రెడ్డి(ఖమ్మం-కాంగ్రెస్)-4,67,847
* ఈటల రాజేందర్(మల్కాజిగిరి-బీజేపీ)-3,91,475
* బలరాం నాయక్(మహబూబాబాద్-కాంగ్రెస్) -3,49,165
* గుంటూరు(చంద్రశేఖర్ పెమ్మసాని-టీడీపీ)-3,44,695
* హరీశ్(అమలాపురం-టీడీపీ)-3,42,196
* అసదుద్దీన్ ఒవైసీ(హైదరాబాద్-MIM)-3,38,087
* రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం-టీడీపీ)-3,27,901
AP: టీడీపీ అధినేత చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ గుప్తా మరికాసేపట్లో కలవనున్నారు. ఎన్నికల్లో గెలవడంపై అభినందనలు తెలపడంతో పాటు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు తదితర అంశాలపై వీరు బాబుతో చర్చించే అవకాశం ఉంది. అనంతరం పవన్‌తో కలిసి CBN ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.
TG: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు <<13382331>>ప్రక్రియ<<>> ప్రారంభమైంది. ఈ స్థానంలో ప్రధాన అభ్యర్థులుగా రాకేశ్ రెడ్డి(BRS), తీన్మార్ మల్లన్న(కాంగ్రెస్), ప్రేమేందర్ రెడ్డి(బీజేపీ), అశోక్(స్వతంత్ర) బరిలో ఉన్నారు. నిన్న వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో కామెంట్ చేయండి.
AP: ప్రభుత్వంలో తన పాత్ర ఏంటో చంద్రబాబు నిర్ణయిస్తారని నారా లోకేశ్ చెప్పారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. వైసీపీ చేసిన తప్పులు చేయకుండా రాష్ట్రాన్ని దారిలో పెడతామన్నారు. ఆస్తుల ధ్వంసం, వేధింపులు, దొంగ కేసులు పెట్టడం తమకు తెలియదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన, తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. విభజన హామీల అమలు కోసం కేంద్రాన్ని అడుగుతామన్నారు.
AP: చంద్రబాబుపై పలు కేసులు, ఆయన అరెస్టులో కీలక పాత్ర వహించిన CID అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై వెళ్తున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఆయన దరఖాస్తు చేసుకోగా.. సీఎస్ జవహర్ రెడ్డి వెంటనే అనుమతించడం గమనార్హం. ఇటు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి కూడా రాజీనామా చేశారు. అయితే ఆయన కీలక దస్త్రాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.