News January 28, 2025

‘మ్యాన్ ఈటర్’ పొట్టలో మహిళ వెంట్రుకలు, రింగులు

image

కేరళలోని వయనాడ్‌లో రాధ (45) అనే మహిళను తిన్న ‘మ్యాన్ ఈటర్’ పొట్టలో ఆమె అవశేషాలు కనిపించాయని అధికారులు నిర్ధారించారు. పోస్టుమార్టంలో ఆమె వెంట్రుకలు, చెవి రింగులు పులి పొట్టలో లభించినట్లు తెలిపారు. పులి కోసం అటవీ అధికారులు వేటాడుతుండగా ఓ పాడుబడిన ఇంట్లో చనిపోయి కనిపించింది. వెంటనే దానికి పోస్టుమార్టం నిర్వహించారు. టీమ్ ఇండియా క్రికెటర్ మిన్ను మణికి మృతురాలు రాధ సమీప బంధువు అన్న విషయం తెలిసిందే.

News January 28, 2025

జనవరి 28: చరిత్రలో ఈ రోజు

image

1950: భారత సుప్రీంకోర్టు ఏర్పాటు
1865: జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ జననం
1885: భాషా పరిశోధకుడు గిడుగు వెంకట సీతాపతి జననం
1920: నిర్మాత, దర్శకుడు బి.విఠలాచార్య జననం
1986: హీరోయిన్ శ్రుతి హాసన్ జననం
2004: దర్శకుడు, క్రీడాకారుడు పామర్తి సుబ్బారావు మరణం
2014: దర్శకుడు, నట శిక్షకుడు బీరం మస్తాన్‌రావు మరణం

News January 28, 2025

టీమ్ ఇండియాతో మూడో టీ20.. ఇంగ్లండ్ జట్టు ఇదే

image

టీమ్ ఇండియాతో జరగబోయే మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. రెండో టీ20లో ఆడిన జట్టునే ఈ మ్యాచుకు కూడా కొనసాగిస్తోంది. జట్టు: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్ (), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. మూడో టీ20 ఇవాళ రాజ్ కోట్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.

News January 28, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 28, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 28, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.33 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.09 గంటలకు
✒ ఇష: రాత్రి 7.24 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 28, 2025

శుభ ముహూర్తం (28-01-2025)

image

✒ తిథి: బహుళ చతుర్దశి రా.7.29 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాడ ఉ.8.57 గంటల వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ప.3.00-4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00-10.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1.ఉ.8.24-9.12 వరకు
2.రా.10.46-11.36 వరకు
✒ వర్జ్యం: సా.4.59-6.35 వరకు
✒ అమృత ఘడియలు: రా.3.04-4.40 వరకు

News January 28, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 28, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* ఆర్థిక పరిస్థితి పుంజుకున్నాకే పథకాలు: ఏపీ సీఎం చంద్రబాబు
* ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువ పెంపు: మంత్రి అనగాని
* ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు చెప్పేవి పచ్చి అబద్ధాలు: అంబటి
* రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ప్రయత్నాలను అడ్డుకుంటాం: సీఎం రేవంత్
* గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వం: బండి సంజయ్
* ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024గా బుమ్రా

News January 28, 2025

బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్

image

TG: గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలకే అవార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రజా యుద్ధ నౌకగా గద్దర్ పేరు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

News January 28, 2025

నిద్రపోయే ముందు ఇలా చేయట్లేదా?

image

శరీరం డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా ఉండాలంటే తగినంత నీరు అవసరం. రోజును గ్లాసు నీళ్లతో ప్రారంభించడమే కాకుండా నిద్ర పోయే ముందూ గ్లాసు నీరు తాగడం ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుందంటున్నారు. అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉన్నవారు గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.